టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌లో RGV డెన్‌ను నిర్మించారు. అక్కడి నుంచే సినిమా కార్యక్రమాలను ఆయన చూస్తూ ఉంటారు. అయితే కొద్దిరోజుల క్రితం ఆయన డెన్ నుంచి ఒక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టాలని చాలామందికి కోరిక ఉంటుంది. అలాంటి వారికి ఆర్జీవీ డెన్ గతంలోనే ఒక ప్రకటన జారీ చేసింది. ఇందులో ఆసక్తి ఉన్న డైరెక్టర్స్,రైటర్స్, మ్యూజిక్ కంపోజర్స్ కావాలంటూ వర్మ ట్వీట్ ద్వారా గతంలోనే తెలిపారు. అందుకు భారీగా రెస్పాన్స్ వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లు అన్నీ ఔట్ డేటెడ్‌గా మారాయని వర్మ అన్నారు. డైరెక్టర్, రైటర్, మ్యూజిక్ కంపోజర్స్ ఇలా ఎందులో ఆసక్తి ఉన్నా సరే తమ డెన్ ఆహ్వానం పలుకుతుందన్నారు వర్మ. అందుకు కావాల్సిన కొన్ని ప్రశ్నలను కూడా తన వెబ్‌సైట్‌లో ఉంచాడు. అయితే ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అనేది వర్మ తాజాగా తెలిపాడు.
ఇప్పటి వరకు 319 మంది డైరెక్టర్స్‌గా తన వెబ్‌సైట్ (https://rgvden.com/) ద్వారా నమోదు చేసుకున్నారని తెలిపారు. మ్యూజిక్ కంపోజర్స్‌గా 50 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన చెప్పారు. అయితే, వీరందరిలో ఒక్కో విభాగం నుంచి 10 మందిని సెలక్ట్ చేస్తామని, ఆ లిస్ట్‌ను జూన్ 9న ప్రకటిస్తామని వర్మ ప్రకటించారు.
నటీనటులకు సంబంధించి గమనిక
నటీనటులకు సంబంధించి, ఔత్సాహిక నటులు/నటీమణులను కేవలం వారి ఫోటోలు మాత్రమే పంపమని చెప్పడంలో పొరపాటు చేశామని ఆ వెబ్‌సైట్‌లో తెలిపారు. వెయ్యికి పైగా తమకు ధరఖాస్తులు వచ్చినట్లు వారు తెలిపారు. దీంతో ఫోటో లుక్స్ వల్ల సెలక్ట్ చేయడం కాస్త కష్టంగా ఉన్నట్లు వారు పేర్కొన్నారు. కాబట్టి డైలాగ్ ఆడిషన్ కోసం మరోసారి అక్కడ ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఒక వీడియో ద్వారా చెప్పాల్సిన డైలాగ్‌ను కూడా అక్కడే వర్మ టీమ్ పొందుపరిచింది. దానిని వీడియో రూపంలో క్రియేట్ చేసి జూన్ 20లోపు తమ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని వారు కోరారు.
కెమెరామెన్స్ కూడా ఛాన్స్
కొత్తగా కెమెరామెన్స్‌గా రాణించాలనుకునే వారికి అవకాశాలు ఎలా ఇస్తారో, ఎలా అప్లై చేయాలో ఆర్జీవీ తమ వెబ్‌సైట్‌లో తెలిపారు. దాని ప్రకారం జూన్ 20లోపు ధరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు. గతంలో ఇచ్చిన నిబంధనల విషయంలో కొన్ని మార్పులు చేసి మరోసారి జూన్ 20లోపు ధరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. రైటర్స్ అప్లై చేసుకున్న విషయంలో కూడా పలు మార్పులు చేశారని గమనించగలరు. డైరెక్టర్,రైటర్,మ్యూజిక్ కంపోజర్, యాక్టింగ్,కెమెరామెన్ వంటి రంగాల్లో రాణించాలనుకునే వారందరికి వర్మ డెన్ ఆహ్వానం పలుకుతుంది.
YOUR FILM is SUPER SUCCESS ..Out of 319 submissions and 50’submissions from directors and music directors , 10 Shortlisted directors and 10 music directors list will be put out on 9th June…Also see the revised tests regarding Actors/Actresses ,Cinematographers and writers Check…
— Ram Gopal Varma (@RGVzoomin) June 6, 2024
Comments
Please login to add a commentAdd a comment