Den
-
గర్ల్‌ఫ్రెండ్‌ని ఇంప్రెస్ చేద్దాం అనుకుంటే ప్రాణమే పోయింది
కొందరు వెర్రితో చేసే పిచ్చి స్టంట్లు భయానకంగానూ, ప్రాణాంతకంగానూ ఉంటాయి. కనీసం ఇలాంటివి చేసే ముందు వికటిస్తే ఏమవుతుందో అనే ధ్యాస లేకుండా అనాలోచితంగా చేసేస్తారు. ఆ తర్వాత అందరూ చూస్తుండగానే వాళ్ల కథ విషాదాంతంగా ముగిసిపోతుంటుంది. అలాంటి ఘటనే ఇది.ఓ జూ సంరక్షకుడు గర్ల్‌ఫ్రెండ్(Girlfriend)ని ఇంప్రెస్ చేద్దాం అనుకుని చేసిన పనికి ప్రాణాలే పోగొట్టుకున్నాడు. ఈ ఘటన ఉజ్బెకిస్తాన్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..44 ఏళ్ల జూకీపర్(zookeeper) తన గర్ల్‌ఫ్రెండ్‌ని ఇంప్రెస్ చేద్దామన్న ఉద్దేశ్యంతో ఓ స్టంట్ చేయాలనుకున్నాడు. అందుకోసం తెల్లవారుజామున 5 గంటలకు సింహాల గుహ(Lion Den)కు చేరుకుని సెల్ఫీ వీడియో(Selfie Video) తీసుకుంటున్నాడు. ముందుగా మూడు పెద్ద సింహాలు ఉన్న బోనులోకి వెళ్లాడు. వాటిని నిశబ్దంగా ఉండండి అని సైగ చేస్తూ సెల్ఫీ వీడియో చిత్రీకరిస్తున్నాడు..ఇంతలో ఓ సింహం అనుహ్యంగా అతడి చేతిపై దాడిచేయడంతో.. జరగకూడని ఘోరం జరిగిపోయింది. చివరికీ ఆ సింహాల దాడిలో తీవ్రంగా గాయపడి మరణించాడు. అతడు సరదాగా చేసిన స్టంట్ కాస్తా తన చివరి క్షణాలను బంధించిన వీడియోగా మిగిలిందని పోలీసులు వెల్లడించారు. ఏదీ ఏమైనా క్రూర జంతువులతో చేసే స్టంట్ల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాల్సిందే.(చదవండి: షాలిని పాసీ అందమైన కురుల రహస్యం ఇదే..!) -
కొత్త డైరెక్టర్స్‌కు వర్మ పరీక్ష.. ఎంపికైన వారి లిస్ట్ ఇదే
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌లో RGV డెన్‌ను నిర్మించారు. అక్కడి నుంచే సినిమా కార్యక్రమాలను ఆయన చూస్తూ ఉంటారు. అయితే కొద్దిరోజుల క్రితం ఆయన డెన్ నుంచి ఒక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టాలని చాలామందికి కోరిక ఉంటుంది. అలాంటి వారికి ఆర్జీవీ డెన్ గతంలోనే ఒక ప్రకటన జారీ చేసింది. ఇందులో ఆసక్తి ఉన్న డైరెక్టర్స్,రైటర్స్, మ్యూజిక్ కంపోజర్స్ కావాలంటూ వర్మ ట్వీట్ ద్వారా తెలిపారు. అయితే తాజాగా వర్మ తన డెన్లోకి అడుగుబెట్టబోయే వారి లిస్ట్‌ను ప్రకటించారు.డైరెక్టర్స్‌గా వర్మ డెన్‌లో అడుగుబెట్టాలని 419 మంది తన వెబ్సైట్ (https://rgvden.com/) ద్వారా నమోదు చేసుకుంటే అందులో 11 మందిని సెలక్ట్ చేసి వారి పేర్లను వెబ్సైట్లో పొందుపరిచారు. వీరందరూ జూన్ 14న హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌కు రావాలని ఆయన తెలిపారు. ఇదే క్రమంలో మ్యూజిక్ డైరెక్టర్స్‌గా 9మంది ఎంపికయ్యారని చెప్పారు. అయితే, వీరిలో ఒక్కరు మాత్రమే ఫైనల్ అవుతారని, వారిని కూడా ఎలా ఎంపిక చేస్తారు అనేది వెబ్సైట్లో తెలిపారు. వర్మ డెన్‌కు ఎంపిక అయిన వారందరీ ఇన్స్టాగ్రామ్ ఖాతాలను కూడా వారి పేరు పక్కన చేర్చడం విశేషం. వివరాల కోసం ఈ వెబ్సైట్లో https://rgvden.com/ చూడగలరు -
ఇండస్ట్రీలోకి రావాలనుకునే వారికి వర్మ ఆహ్వానం.. జూన్ 9న లిస్ట్ విడుదల
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌లో RGV డెన్‌ను నిర్మించారు. అక్కడి నుంచే సినిమా కార్యక్రమాలను ఆయన చూస్తూ ఉంటారు. అయితే కొద్దిరోజుల క్రితం ఆయన డెన్ నుంచి ఒక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టాలని చాలామందికి కోరిక ఉంటుంది. అలాంటి వారికి ఆర్జీవీ డెన్ గతంలోనే ఒక ప్రకటన జారీ చేసింది. ఇందులో ఆసక్తి ఉన్న డైరెక్టర్స్,రైటర్స్, మ్యూజిక్ కంపోజర్స్ కావాలంటూ వర్మ ట్వీట్ ద్వారా గతంలోనే తెలిపారు. అందుకు భారీగా రెస్పాన్స్ వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.ప్రస్తుతం ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లు అన్నీ ఔట్ డేటెడ్‌గా మారాయని వర్మ అన్నారు. డైరెక్టర్, రైటర్, మ్యూజిక్ కంపోజర్స్ ఇలా ఎందులో ఆసక్తి ఉన్నా సరే తమ డెన్ ఆహ్వానం పలుకుతుందన్నారు వర్మ. అందుకు కావాల్సిన కొన్ని ప్రశ్నలను కూడా తన వెబ్సైట్లో ఉంచాడు. అయితే ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అనేది వర్మ తాజాగా తెలిపాడు.ఇప్పటి వరకు 319 మంది డైరెక్టర్స్‌గా తన వెబ్సైట్ (https://rgvden.com/) ద్వారా నమోదు చేసుకున్నారని తెలిపారు. మ్యూజిక్ కంపోజర్స్‌గా 50 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన చెప్పారు. అయితే, వీరందరిలో ఒక్కో విభాగం నుంచి 10 మందిని సెలక్ట్ చేస్తామని, ఆ లిస్ట్‌ను జూన్ 9న ప్రకటిస్తామని వర్మ ప్రకటించారు.నటీనటులకు సంబంధించి గమనికనటీనటులకు సంబంధించి, ఔత్సాహిక నటులు/నటీమణులను కేవలం వారి ఫోటోలు మాత్రమే పంపమని చెప్పడంలో పొరపాటు చేశామని ఆ వెబ్సైట్లో తెలిపారు. వెయ్యికి పైగా తమకు ధరఖాస్తులు వచ్చినట్లు వారు తెలిపారు. దీంతో ఫోటో లుక్స్ వల్ల సెలక్ట్ చేయడం కాస్త కష్టంగా ఉన్నట్లు వారు పేర్కొన్నారు. కాబట్టి డైలాగ్ ఆడిషన్ కోసం మరోసారి అక్కడ ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఒక వీడియో ద్వారా చెప్పాల్సిన డైలాగ్‌ను కూడా అక్కడే వర్మ టీమ్ పొందుపరిచింది. దానిని వీడియో రూపంలో క్రియేట్ చేసి జూన్ 20లోపు తమ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని వారు కోరారు.కెమెరామెన్స్ కూడా ఛాన్స్కొత్తగా కెమెరామెన్స్‌గా రాణించాలనుకునే వారికి అవకాశాలు ఎలా ఇస్తారో, ఎలా అప్లై చేయాలో ఆర్జీవీ తమ వెబ్సైట్లో తెలిపారు. దాని ప్రకారం జూన్ 20లోపు ధరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు. గతంలో ఇచ్చిన నిబంధనల విషయంలో కొన్ని మార్పులు చేసి మరోసారి జూన్ 20లోపు ధరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. రైటర్స్ అప్లై చేసుకున్న విషయంలో కూడా పలు మార్పులు చేశారని గమనించగలరు. డైరెక్టర్,రైటర్,మ్యూజిక్ కంపోజర్, యాక్టింగ్,కెమెరామెన్ వంటి రంగాల్లో రాణించాలనుకునే వారందరికి వర్మ డెన్ ఆహ్వానం పలుకుతుంది.YOUR FILM is SUPER SUCCESS ..Out of 319 submissions and 50’submissions from directors and music directors , 10 Shortlisted directors and 10 music directors list will be put out on 9th June…Also see the revised tests regarding Actors/Actresses ,Cinematographers and writers Check…— Ram Gopal Varma (@RGVzoomin) June 6, 2024 -
వాళ్ళని వాడుకోవడానికి ఈ డెన్
-
ఒక అడవి జంతువి కి గ్యాంగ్ స్టార్ మధ్యలో క్రాస్ బ్రీడ్ మానస్తత్వం నది అందుకే నేను ఇలా
-
కుక్క కోసం రాజభవనం..
ఈ ఫొటోలో శునకం దర్జాగా కూర్చున్న డెన్ బాగుంది కదా! డెన్‌లో కుక్క కూర్చుని ఉంది. అందులో దర్జా ఏముందని తీసి పారేయకండి. ఎందుకంటే రాజభవనాన్ని పోలి ఉన్న ఆ డెన్ (ఇన్యుడెన్)ఖరీదు అక్షరాలా... కోటి 17 లక్షల 60 వేల రూపాయలు. సాధారణ ఇళ్ల ఖరీదు కంటే కూడా ఎక్కువ. దీనిని నిర్మించింది... జపాన్‌లోని ఒసాకాకు చెందిన కల్చరల్ ప్రాపర్టీ స్ట్రక్చరల్ ప్లాన్ కార్పొరేషన్ లిమిటెడ్. వారసత్వ కట్టడాలను పునరుద్ధరించడం ఈ కంపెనీ ప్రత్యేకత. ఇందులోని ఉద్యోగులు శతాబ్దాల కిందటి గుళ్లు, గోపురాల నిర్మాణంలో నిపుణులు. ఆ కంపెనీ ఇటీవలే ఈ ఇన్యుడెన్ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. జపనీస్ గుళ్లు, గోపురాల పురాతన రీతులను ఉపయోగించి సహజసిద్ధమైన మెటీరియల్స్‌తో, అత్యంత నాణ్యతతో వీటిని నిర్మిస్తామని ప్రకటించింది. అందులో ఏమైనా సౌకర్యాలుంటాయా? అంటే అదీ లేదు. కేవలం అది జపాన్‌కు చెందిన రాజభవనాల రిప్లికా మాత్రమే. దీనికెందుకంత ధర అంటే... అది గ్రానైట్ రాయిపై ప్రత్యేక కలపను ఉపయోగించి, ఎలాంటి మెషీన్లను వాడకుండా పూర్తిగా చేతులతో రూపొందించిన భవనం. దాని స్పెషాలిటీ అంతా అందమైన పైకప్పులో ఉంది. డెన్ నిర్మాణం కోసం సెప్టెంబర్ నుంచి ఆర్డర్లు తీసుకోనుందీ కంపెనీ. ఎక్కువ ఆర్డర్లు వస్తే... లాటరీ తీసి మరీ ఎంపిక చేస్తారు. ఎందుకంటే అది ఏడాదికి ఒక్క ఇంటిని మాత్రమే తయారు చేస్తుంది. -
మరో టారిఫ్ వార్ : రిలయన్స్ చేతికి డెన్, హాత్వే
సాక్షి,ముంబై: ముకేశ్ అంబానీ నేతృత్వంలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో టారిఫ్ వార్‌కు రంగం సిద్ధం చేసుకుంది. ఇప్పటికే రిలయన్స్ జియో టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులతో ప్రత్యర్థి కంపెనీలకు చుక్కలు చూపించింది. తాజాగా కేబుల్ రంగంలో కూడా విధ్వంసానికి రడీ అవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో చరిత్రలో అతిపెద్ద లాభాలను నమోదు చేసిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కేబుల్ టీవీ, హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ రంగంలో పాక్షిక పెట్టుబడులను పెట్టనున్నట్టు వెల్లడించింది. ఈ నేపథ్యంలో జియో ఎంట్రీతో కుదేలైన ఎయిర్‌టెల్‌ను, సిటీ కేబుల్ వ్యాపారాన్ని కూడా దెబ్బతీయనుంది. దేశీయంగా అతిపెద్ద కేబుల్ ఆపరేటర్ హాత్వే కేబుల్ అండ్ డేటాకామ్, డెన్ నెట్వర్క్స్ సంస్థలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలను ప్రకటించింది. బ్రాడ్ బాండ్ సేవలను పెద్దయెత్తున విస్తరించే క్రమంలో ఈ పెట్టుబడులకు బుధవారం బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హాత్వే, డెన్ నెట్వర్క్ కంపెనీల్లో మెజారిటీ వాటా తీసుకోవాలని నిర్ణయించింది. ఇందుకు రిలయన్స్ రూ. 5,230 కోట్లు చెల్లించనుంది. హాత్వేలో 51.3 శాతం వాటా కొనుగోలుకు రూ. 2,045 కోట్లను రిలయన్స్ చెల్లిస్తుంది. అలాగే డెన్ నెట్‌వర్క్స్‌లో 66 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఈ డీల్ విలువ రూ. 2,045 కోట్లు. హాత్వే, డెన్ నెట్వర్స్క్ 1,100 నగరాల్లో 5 కోట్ల మంది సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. తాజా డీల్ ద్వారా ప్రత్యక్షంగా 20 మిలియన్ల కేబుల్ చందాదారులు రియలన్స్ అధీనంలోకి రానున్నారు. అంతేకాదు కేబుల్ మార్కెట్లో 23 శాతం వాటాను రిలయన్స్ సొంతం కానుంది. -
నయీమ్ నమ్మినబంటు శ్రీధర్‌గౌడ్!
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘ కాలంపాటు తనను తాను రక్షించుకోవడానికే శక్తియుక్తుల్ని వినియోగించిన గ్యాంగ్‌స్టర్ నయీమ్.. దాదాపు గత ఏడేళ్లపాటు ధనార్జనే ధ్యేయంగా పని చేశాడు. ఈ నేపథ్యంలో ఎవరినీ పూర్తిస్థాయిలో నమ్మేవాడు కాదు. వనస్థలిపురం పరిధిలోని తుర్కయాంజాల్‌కు చెందిన శ్రీధర్‌గౌడ్‌కు మాత్రమే తన ప్రధాన ‘డెన్’ వివరాలు తెలిపాడు. ఇతడే టార్గెట్ల ‘రవాణా’ బాధ్యతలు చూసుకునేవాడు. అలాగే నయీమ్ తన చేతిలో హతమైన వారి ‘అంత్యక్రియల’ సమయంలో మహిళా అనుచరులతో నల్లవస్త్రాలు ధరింపజేసేవాడని తెలిసింది. పోలీసుల విచారణలో నయీమ్ భార్య హసీనా బేగం పలు కీలక అంశాలను వెల్లడించింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ‘కీలక ఘట్టాలన్నీ’ షాద్‌నగర్ ఇంట్లోనే.. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లోని మిలీనియం టౌన్షిప్లో తన సమీప బంధువు సయ్యద్ సాదిఖ్ పాషా పేరుతో ఉన్న ఇంటినే నయీమ్ తన ప్రధాన డెన్‌గా వినియోగించుకున్నాడు. ఇంట్లో తన సమీప బంధువు మతీన్ కుటుంబాన్ని ఉంచి.. టార్గెట్లను బెదిరించడంతోపాటు కీలక వ్యవహారాలూ ఇక్కడ నుంచే నెరపేవాడు. అత్యంత అరుదైన సందర్భాల్లో తప్ప సాధారణంగా కుటుంబీకుల్ని అక్కడకు తీసుకువెళ్లేవాడు కాదు. ‘మామిడి’ అనే పేరు పెట్టిన ఈ ఇంటి వివరాలను అందరికీ తెలియనీయలేదు. ప్రతి ఒక్కరినీ అనుమానించే నయీమ్.. యాక్షన్ టీమ్ సభ్యులతోపాటు తనకు నమ్మిన బంటుగా ఉన్న శ్రీధర్‌గౌడ్‌కు మాత్రమే ఇంటి గురించి చెప్పాడు. టార్గెట్లను తొలుత అనుచరుల ద్వారా, ఆపై ఫోన్లో బెదిరించేవాడు. అవసరమైతే వారిని ‘మామిడి’కి రప్పించి ‘గడాఫీ సైన్యం’ మధ్యలో కూర్చుని బెదిరించే వాడు. రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి చెందిన వారినైనా ఎల్బీ నగర్ మీదుగానే షాద్‌నగర్‌లోని డెన్‌కు రప్పించేవాడు. టార్గెట్లను అనుచరులు ఎల్బీనగర్ వరకు తీసుకొస్తారు. అక్కడి నుంచి వారి కళ్లకు గంతలు కట్టి, షాద్‌నగర్‌కు తరలించేది మాత్రం శ్రీధర్‌గౌడ్ అని తెలిసింది. శ్రీధర్‌గౌడ్ ఈ దందాల్లో ‘రెడ్డి భయ్యా’గా చెలామణి అయ్యాడని వెల్లడైంది. ఆ సమయంలో వారంతా నల్లవస్త్రాల్లో.. అనుమానం, విభేదాలు, అసహనం.. కారణమేదైనా నయీమ్ సమాధానం మాత్రం హత్యే. సొంత బావతోపాటు అనేక మంది పసి పిల్లలు, పని పిల్లల్ని తన ఇంట్లోనే కుటుంబీకులతో కలసి దారుణంగా చంపేవాడు. హత్యలు చేసిన తర్వాత మృతదేహాలను స్వయంగా తీసుకువెళ్లే నయీమ్.. నిర్మానుష్య ప్రాంతాల్లో కాల్చేయడమో, శివార్లలో పూడ్చేయడమో చేసేవాడు. అంత్యక్రియల కోసం మృతదేహాలను రవాణా చేసే సమయంలో మాత్రం తన వెంట ‘గడాఫీ సైన్యాన్ని’ తీసుకెళ్లేవాడు. ఆ సమయంలో వారు కచ్చితంగా నల్లరంగు వస్త్రాల్లో ఉండాలని స్పష్టం చేసేవాడు. అక్క సలీమా బేగం రెండో భర్త నదీం, పని పిల్ల నస్రీన్లను అల్కాపురి టౌన్‌షిప్‌లోని ఇంట్లో చంపిన నయీమ్.. నల్లవస్త్రాల్లో ఉన్న మహిళా అనుచరులతో వెళ్లి మృతదేహాల అంత్యక్రియలు నిర్వహించాడని వెలుగులోకి వచ్చింది. ‘మావో’ల కనుమరుగు తర్వాతే ధనార్జన మావోయిస్టు పార్టీలో చేరడం.. పోలీసులకు కోవర్ట్‌గా మారడం.. మావోయిస్టు నేత ఈదన్న హత్యతోపాటు ఇతర పరిణామాల నేపథ్యంలో ఉద్యమం నుంచి బయటకు రావడంతోపాటు మావోయిస్టుల్ని అంతం చేస్తానంటూ నయీమ్ ప్రకటించాడు. దీంతో అతడు మావోయిస్టులకు టార్గెట్‌గా మారాడు. ఈ నేపథ్యంలో తనను తాను కాపాడుకోవడంపైనే దృష్టిపెట్టాడు. 2008 తర్వాతే నయీమ్ దృష్టి ధనార్జనపై పడింది. అప్పటికి రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో తన అనుచరగణాన్ని పెంచుకుని, శత్రువుల్ని తుంచేయడంతో డబ్బు పైనే దృష్టి కేంద్రీకరించి సంపాదించడం ప్రారంభించాడు. -
ఒంగోలులోనూ నయీం డెన్
-
అది నయీమ్ డెన్
2008–2011 మధ్యలో ఇక్కడికి నయీమ్, ఫయీం..? ఇంటిని పరిశీలించిన వైరా డీఎస్పీ భూక్యా రాంరెడ్డి సిట్‌కు సమాచారం అందించామని వెల్లడి సాక్షిప్రతినిధి, ఖమ్మం: పక్కాగా అది నయీమ్ డెన్.. ఇల్లు కొనుగోలు చేసిన తర్వాత ఏసీలు, ఖరీదైన బెడ్లు, ప్రతి రూమ్‌కు అటాచ్డ్ బాత్రూమ్.. కింద పాలరాతి బండలు.. ఆ ఇంట్లో దొంగతనం జరిగిన తర్వాత సుల్తానాబేగం మాయం. ఆ తర్వాత ఇవన్నీ తొలగించడం.. మళ్లీ 2014లో బీబమ్మ ప్రత్యక్షం. ఇంట్లో ఉంటున్న రహీం కుటుంబీకులకు మీరే ఉండాలని చెప్పడం.. ఇదంతా చూస్తే.. నయీమ్ ఐదేళ్ల క్రితం గాంధీనగర్ కాలనీలోని ఇంటిని డెన్‌గా ఉపయోగించుకున్నట్లు అర్థమవుతోంది. మిర్యాలగూడలో వారం రోజుల క్రితం అరెస్ట్ అయిన నయిమ్ అత్తే ఇక్కడి సుల్తానా అని పోలీసులు, నిఘా విభాగాలు పసిగట్టినట్లు తెలుస్తోంది. మొత్తంగా నయీమ్ ఇక్కడ డెన్‌ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ నుంచి ఏంచేశాడనే దానిపై నిఘా వర్గాలు లోతుగా శోధిస్తుండగా.. దీనిపై ఇప్పటి వరకు ఉన్న సమాచారం సిట్‌కు కూడా పంపినట్లు తెలిసింది. డెన్‌కు పలుమార్లు నయీమ్.. ఖమ్మం నగరానికి సమీపంలోని విజయవాడ వెళ్లే రాష్ట్రీయ రహదారి పక్కన ఉన్న గాంధీనగర్ కాలనీలో డెన్ కోసమే నయీమ్ ఇంటిని కొనుగోలు చేశాడని తెలుస్తోంది. ఇక్కడ డెన్ ఏర్పాటు చేసుకుంటే.. ఇటు హైదరాబాద్‌కు, అటు ఆంధ్రా ప్రాంతానికి వెళ్లే సమయంలో సేఫ్‌జోన్‌గా ఉపయోగపడుతుందని భావించినట్లు సమాచారం. అందుకే ఇక్కడ ఎటువంటి కార్యకలాపాలు చేయకుండా కేవలం అతను వచ్చి వెళ్లేలా షెల్టర్‌జోన్‌గా ఉపయోగించుకున్నాడా..? లేక ఇక్కడ కూడా ఏమైనా సెటిల్మెంట్లు చేశాడా..? అని నిఘా విభాగాలు లోతుగా పరిశీలిస్తున్నాయి. అయితే 2008–2011 మధ్యలో నయీమ్ తన సోదరుడు ఫయీమ్ మరికొంతమంది అనుచరులు పలుమార్లు వచ్చినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఇల్లు కొనుగోలు, ఆంజనేయస్వామి దేవాలయానికి విరాళం ఇచ్చిన బీబమ్మ అలియాస్ సుల్తానాబేగం నయీమ్ అత్తనే అని ప్రస్తుతం ఆ ఇంట్లో ఉన్న వారు చెప్పే వివరాలను బట్టి స్పష్టమవుతోంది. రెండేళ్ల తర్వాత గాంధీనగర్ కాలనీకి బీబమ్మ.. 2011లో బీబమ్మ ఇంట్లో దొంగతనం జరిగిన తర్వాత అక్కడినుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆ ఇంటిని ఖమ్మం కోర్టులో బెంచ్ క్లర్కుగా పనిచేసే రహీంకు అద్దెకు ఇచ్చింది. అయితే తన తండ్రి రహీమ్‌కు బీబమ్మ మేనత్త అవుతుందని వైరా డీఎస్పీ ఆ ఇంటిని పరిశీలించినప్పుడు రహీమ్ కుమారుడు పోలీసులకు వివరించాడు. 2011లో వెళ్లిన బీబమ్మ 2014లో ఒకసారి ఇంటికి వచ్చి.. ఇంట్లో మీరే ఉంటున్నారా..? ఇంటిని సరిగా చూసుకోవాలని, ఇంట్లో మీరే ఉండాలని చెప్పి.. పది నిమిషాల్లోనే వచ్చిన కారులో వెళ్లిపోయిందని రహీం భార్య కూడా చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. వారం రోజుల క్రితం మిర్యాలగూడలో నయీమ్ అత్త సుల్తానాతోపాటు అతని బావమరుదులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా 400 పత్రాలను, ఓ పిస్తోలును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ పత్రాల్లో గాంధీనగర్ కాలనీ ఇంటి ఒప్పంద పత్రాలు కూడా ఉన్నట్లు సమాచారం. రహీం ఆ ఇంట్లో ఎప్పటి నుంచి ఉంటున్నాడు. ఇంకా ఎవరెవరు వచ్చేవారని పోలీసు నిఘా విభాగాలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. బంగారు నగలతో ఖరీదైన కార్లలో.. గాంధీనగర్ కాలనీలో సుమారు 600 కుటుంబాల వరకు ఉన్నా.. ఆ ఇంటికే ఖరీదైన కార్లలో.. బంగారు ఆభరణాలు ధరించిన మహిళలు వచ్చేవారని స్థానికులు పేర్కొంటున్నారు. ఎవరితో మాట్లాడేవారు కాదని, ఇంట్లోనే రెండు,మూడు రోజులు ఉండి.. వెళ్లిపోయే వారని, ఆ తర్వాత బీబమ్మే కనిపించేదని, ఆమె కూడా ఎవరితో పెద్దగా ముచ్చటించేది కాదని చెబుతున్నారు. ఆంజనేయస్వామి దేవాలయానికి భారీగా విరాళం ఇవ్వడంతో అక్కడ ప్రార్థనామందిరం కడుతున్న మరో వర్గం వారు విరాళం ఇవ్వాలని బీబమ్మతోపాటు అక్కడికి వచ్చిన కొందరిని అడిగినా.. స్పందించలేదని చెబుతుండటంతో ఇక్కడకు వచ్చింది నయీమ్, ఫయీమ్ అయి ఉంటారని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఆ ఇంటి సమీపంలోనే మరో ప్లాట్.. నయీమ్ తన తల్లిదండ్రుల పేరుతో కొనుగోలు చేసిన ఇంటి సమీపంలోనే మరో ప్లాట్‌ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీంట్లో కూడా ఇల్లు నిర్మించాలని బీబమ్మ అనుకున్నట్లు స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంతేకాకుండా బీబమ్మకు దగ్గరగా ఉండే ఓ మహిళకు బంగారు ఆభరణాలు బహుమతిగా ఇచ్చినట్లు కాలనీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏదైనా సహాయ సహకారాల కోసం బీబమ్మను కలవాలంటే ముందుగా ఆ మహిళను కలిసి చెబితే.. ఆమె బీబమ్మకు తెలిపేదని.. ఆమె చెప్పిన సమాధానాన్ని మళ్లీ వీరికి చేరవేసేదని చెబుతున్నారు. ప్రకాశంను ఆరాతీసిన ఇంటెలిజెన్స్.. ఈ ఇంటిని విక్రయించిన నేలకొండపల్లి మండలం చెరువుమాదారం వీఆర్ఏ ప్రకాశంను ఇంటెలిజెన్స్ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. ఇల్లు ఎప్పుడు విక్రయించారు..? ఎందుకు విక్రయించారు..? కొనుగోలు చేసినప్పుడు ఎంతమంది వచ్చారు..? ఎక్కడినుంచి వచ్చారు..? తదితర అంశాలను ప్రకాశంను అడిగినట్లు సమాచారం. ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండాలని, ఫోన్ ఎత్తాలని, గ్రామంలోనే ఉండాలని సూచించారు. సిట్‌కు ‘సాక్షి’ కథనం.. నయీమ్ అత్త సుల్తానాబేగం గాంధీనగర్ కాలనీలో ఇల్లు కొనుగోలు చేసిందని.. ఇక్కడికి నయీమ్, అతని అనుచరులు పలుమార్లు వచ్చి ఉంటారన్న అనుమానాలను వ్యక్తంచేస్తూ ‘సాక్షి’లో ‘నయీమ్ నీడ’ పేరుతో వచ్చిన కథనాన్ని జిల్లా పోలీస్ అధికారులు సిట్‌కు పంపించినట్లు సమాచారం. ఈ కథనం ఆధారంగానే అతి త్వరలో సిట్ బృందం సభ్యులు ఇక్కడికి రానున్నట్లు తెలుస్తోంది. ‘సాక్షి’లో వచ్చిన వివరాలు.. వాస్తవ పరిస్థితులపై ఏఎస్పీ సాయికృష్ణ, వైరా డీఎస్పీ భూక్యా రాంరెడ్డి, సీఐ వి.చేరాలు సమావేశమై సమీక్షించారు. అనుమానం ఉంది.. డీఎస్పీ భూక్యా రాంరెడ్డి గాంధీనగర్ కాలనీలో నయీమ్ ఇంటిని కొనుగోలు చేశాడనే వార్తలతో వైరా డీఎస్పీ భూక్యా రాంరెడ్డి వైరా సీఐ చేరాలు శనివారం మధ్యాహ్నం ఆ ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న రహీం కుమారులను మీ నాన్న ఎక్కడికి వెళ్లాడు..?ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు..? సుల్తానాబేగం ఏమవుతుందని ప్రశ్నించారు. డీఎస్పీ ప్రశ్నలకు.. రహీం కుమారుడు.. సుల్తానాబేగం తన తండ్రికి మేనత్త అవుతుందని, ఆమె చాలాకాలంగా ఇక్కడకు రావడం లేదన్నారు. ఇంటిపైన ఖాళీగా ఉన్న గదులను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ నయీమ్ తల్లిదండ్రుల పేరుతో ఇల్లు కొనుగోలు, దేవాలయానికి విరాళం ఇవ్వడం, సుల్తానాబేగం మిర్యాలగూడకు చెందిన వారు కావడంతో నయీమ్ ఆనవాళ్లపై అనుమానం ఉందని పేర్కొన్నారు. మొత్తంగా ఈ విషయాన్ని ఇప్పటికే పోలీస్ ఉన్నతాధికారులకు వివరించామని, సిట్‌కు కూడా తెలిపామని చెప్పారు. -
సీన్ కట్ చేస్తే..
డ్రగ్స్.. సమాజాన్ని కేన్సర్‌లా పీల్చిపిప్పిచేస్తున్న జబ్బు... హీరో ఈ డ్రగ్స్ మాఫియా అంతు చూస్తానని శపథం చేశాడు.. ఓ రోజు అర్ధరాత్రి తనను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు బ్యాట్‌మ్యాన్‌లా మారువేషం వేసుకున్నాడు.. డ్రగ్ మాఫియా డెన్లోకి అడుగుపెట్టాడు.. తలుపులు వేశాడు.. డిష్యూం.. డిష్యూం.. అరుపులు, కేకలు.. సామాన్లు ఎగిరి పడుతున్నాయి. అంతలోనే నిశ్శబ్దం.. హీరో స్టైల్‌గా బయటకి వచ్చాడు.. తన విజయానికి గుర్తుగా చిన్నసైజు బాంబును అలా వెనక్కి విసిరాడు.. పొగ కమ్ముకుంది.. హీరో మాయమయ్యాడు.. ఎప్పట్లాగే.. పోలీసులు లేట్‌గా సీన్లోకి ఎంటరయ్యారు.. హీరో చేతిలో చావు దెబ్బలు తిన్న ఇద్దరు విలన్లను కస్టడీలోకి తీసుకున్నారు.. హీరో మారువేషంలో విలన్ల ఆటకట్టించడం వంటి సీన్లు చాలా సినిమాల్లో చూశాం.. కానీ ఇది సినిమా సీన్ కాదు.. నిజంగానే జరిగిందట.. రష్యాలోని మాస్కో శివారు.. కిమ్‌కి ప్రాంతంలో.. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ ట్యాక్సీ డ్రైవర్ ఈ మొత్తం సీన్‌ను వివరించాడు. ఈ ఘటన జూన్‌లో జరిగింది. అంతే.. ఒక్కసారిగా ఆ ముసుగు వ్యక్తి అక్కడ పాపులర్ అయిపోయాడు. కిమ్‌కి బ్యాట్‌మ్యాన్ అని పిలవడం ప్రారంభమైంది. రష్యాకు చెందిన ఓ పత్రిక ఈ విషయంపై పరిశోధన మొదలుపెట్టింది. ఇందులో భాగంగా సదరు ముసుగు వ్యక్తి పోలీసులకు రాసిన ఓ లేఖను సంపాదించింది. ఆ లేఖ ప్రకారం.. డ్రగ్మాఫియాతోపాటు స్థానిక నేరగాళ్లపై వన్‌మ్యాన్ ఆర్మీలా యుద్ధం చేస్తానని కిమ్‌కి బ్యాట్‌మ్యాన్ ప్రకటించాడు. తనను రీపర్-మానవత్వానికి మొదటి హీరో అని అభివర్ణించుకున్నాడు. నేరసామ్రాజ్యాన్ని సమూలంగా నాశనం చేసేందుకు సాయం చేయాలని పోలీసులను కోరాడు. సోషల్ మీడియా ద్వారా తనకు సమాచారం అందించాలన్నాడు. ‘నే ను పోలీసులకు వ్యతిరేకం కాదు.. నాకు తెలుసు మీ చేతులు బంధించి ఉన్నాయి. సహచరుల వల్ల, నేరగాళ్ల వల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రదేశాలకు మీరు వెళ్లలేరు. కానీ నేను అక్కడికి వెళ్లి.. వారి వ్యవస్థలను నాశనం చేస్తాను. నాకు పేరు ప్రఖ్యాతులు వద్దు. సమాచారం మాత్రమే కావాలి. నేరగాళ్లు, రేపిస్టులు, డ్రగ్స్ మాఫియాదారుల సమాచారం నాకు కావాలి’ అని లేఖలో పేర్కొన్నాడు. నేరగాళ్ల గురించి తనకు ఎవరైనా సమాచారం ఇవ్వొచ్చంటూ ‘అపరిచితుడు’ సినిమా టైపులో తన ట్వీటర్ పేజీ అడ్రస్ కూడా తెలిపాడు. ఇప్పటివరకూ 40 మంది నేరగాళ్లను పట్టుకోవడంలో పోలీసులకు సహకరించానని చెప్పాడు. ఈ కిమ్‌కి బ్యాట్‌మ్యాన్ ట్వీటర్ ప్రొఫైల్లోకి వెళ్తే.. ఓ డైలాగ్ మనల్ని ఆకర్షిస్తుంది.. అదేంటో తెలుసా? ‘‘ఆట మొదలైంది’’