గర్ల్‌ఫ్రెండ్‌ని ఇంప్రెస్‌ చేద్దాం అనుకుంటే ప్రాణమే పోయింది | Zookeeper Enters Lion's Den To Impress Girlfriend | Sakshi
Sakshi News home page

గర్ల్‌ఫ్రెండ్‌ని ఇంప్రెస్‌ చేద్దాం అనుకుంటే ప్రాణమే పోయింది

Published Fri, Jan 3 2025 12:57 PM | Last Updated on Fri, Jan 3 2025 1:27 PM

Zookeeper Enters Lion's Den To Impress Girlfriend

కొందరు వెర్రితో చేసే పిచ్చి స్టంట్‌లు భయానకంగానూ, ప్రాణాంతకంగానూ ఉంటాయి. కనీసం ఇలాంటివి చేసే ముందు వికటిస్తే ఏమవుతుందో అనే ధ్యాస లేకుండా అనాలోచితంగా చేసేస్తారు. ఆ తర్వాత అందరూ చూస్తుండగానే వాళ్ల కథ విషాదాంతంగా ముగిసిపోతుంటుంది. అలాంటి ఘటనే ఇది.

ఓ జూ సంరక్షకుడు గర్ల్‌ఫ్రెండ్‌(Girlfriend)ని ఇంప్రెస్‌ చేద్దాం అనుకుని చేసిన పనికి ప్రాణాలే పోగొట్టుకున్నాడు. ఈ ఘటన ఉజ్బెకిస్తాన్‌లో చోటు చేసుకుంది.  పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..44 ఏళ్ల జూకీపర్(zookeeper) తన గర్ల్‌ఫ్రెండ్‌ని ఇంప్రెస్‌ చేద్దామన్న ఉద్దేశ్యంతో ఓ స్టంట్‌ చేయాలనుకున్నాడు. 

అందుకోసం తెల్లవారుజామున 5 గంటలకు సింహాల గుహ(Lion Den)కు చేరుకుని సెల్ఫీ వీడియో(Selfie Video) తీసుకుంటున్నాడు. ముందుగా మూడు పెద్ద సింహాలు ఉన్న బోనులోకి వెళ్లాడు. వాటిని నిశబ్దంగా ఉండండి అని సైగ చేస్తూ సెల్ఫీ వీడియో చిత్రీకరిస్తున్నాడు..ఇంతలో ఓ సింహం అనుహ్యంగా అతడి చేతిపై దాడిచేయడంతో.. జరగకూడని ఘోరం జరిగిపోయింది. 

చివరికీ ఆ సింహాల దాడిలో తీవ్రంగా గాయపడి మరణించాడు. అతడు సరదాగా చేసిన స్టంట్‌ కాస్తా తన చివరి క్షణాలను బంధించిన వీడియోగా మిగిలిందని పోలీసులు వెల్లడించారు. ఏదీ ఏమైనా క్రూర జంతువులతో చేసే స్టంట్‌ల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాల్సిందే.

(చదవండి: షాలిని పాసీ అందమైన కురుల రహస్యం ఇదే..!)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement