
సాక్షి, భువనేశ్వర్ : ప్రాణం విలువ చివరి క్షణంలో తెలుస్తుందంటారు అనుభవించిన వాళ్లు. సరదాగా జూలోకి వెళ్లి చూద్దామనుకున్న వాళ్లకు ఆ అనుభవం కళ్లారా కట్టినట్టు కనిపించింది. షాక్ కు గురి చేసింది. ఒడిషాలో అసలేం జరిగిందంటే..
విచిత్రమైన అనుభవం
వినోదం, ఆహ్లాదం కోసం బారంగ్ నందనకానన్ జూ సందర్శించిన పర్యాటకులకు విచిత్రమైన అనుభవం ఎదురైంది. సందర్శనలో భాగంగా యంత్రాంగం ఏర్పాటు చేసిన వాహనంలో జంగిల్ సఫారీకి సుమారు 30 మంది బృందంగా బయల్దేరారు. అయితే సింహాలు, పులులు, ఎలుగు బంటి వంటి వన్య మృగాలు విచ్చలవిడిగా సంచరించే ప్రాంతంలో సందర్శకుల వాహనం మొరాయించడంతో ప్రాణాలు పోయినంత పనయ్యింది. ఎటూ కదలలేని పరిస్థితుల్లో ఇరుక్కుంది.
వచ్చేశాయి సింహాలు
ఇంతలో అక్కడే సంచరిస్తున్న మృగరాజులు ఈ వాహనాన్ని చుట్టుముట్టాయి. దీంతో ఒక గంట పైబడి సందర్శకులు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బయటపడ్డారు. నందన కానన్ అధికార వర్గాలు మరో వాహనం ఏర్పాటు చేసి ఘటనా స్థలానికి చేరారు. సందర్శకులను చుట్టు ముట్టిన సింహాలను ఆహారం మిషతో పక్కదారి పట్టించి, ప్రమాదం నుంచి బయటపడేలా చేసి సందర్శకులను సురక్షితంగా తీసుకుని రాగలిగారు. ఈ సంఘటనపై విచారణ జరిపేందుకు ఏఎఫ్‌వోకు ఆదేశించినట్లు నందన కానన్ డైరెక్టరు తెలిపారు.
#ସିଂହ_ସଫାରୀରେ_ଫସିଲା_ବସ୍
— Kanak News (@kanak_news) July 9, 2023
ନନ୍ଦନକାନନ ସିଂହ ସଫାରୀରେ ଫସିଗଲା ବସ୍ । ଭୟଭୀତ ହୋଇପଡ଼ିଲେ ପର୍ଯ୍ୟଟକ । ସିଂହଗୁଡିକୁ କାବୁ କରି ଫିଡିଂ ଚାମ୍ବରରେ ରଖିଲେ କର୍ମଚାରୀ । #Nandankanan #Zoo #KanakNews pic.twitter.com/NwCoXWD1nt