చాలామంది వేటితో పడితే వాటితో పరాచకాలు ఆడతుంటారు. ఎంతవరకు ఆటపట్టించాలో, వేటితో ఆడుకోవాలో కూడా కొంతమందికి తెలీదు. క్రూరమృగాలతోటి, విష జంతువులతోనూ అత్యంత జాగ్రత్తగా ఉండాలి. బంధించే ఉన్నాయి కదా అని వాటితో కూడా ఆడుకోవాలని చూస్తే అంతే సంగతులు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి ముందు వెనుక చూడకుండా క్రూరమృగాన్ని ఆటపట్టింటి ఎలా సమస్యను కొని తెచ్చుకున్నాడో చూడండి.
వివరాల్లోకెళ్తే...చాలా మంది జూ చూసేందుకు వెళ్లి అక్కడ బోనుల్లో బంధించి ఉండే జంతువులను టచ్ చేయాలనుకుంటారు. ఓపక్క జూ అధికారులు వాటిని ముట్టుకోవద్దు అని చెప్పిన వినరు. ఎవరలేరు కదా వాటిని ముట్టుకునేందుకు ప్రయత్నించి నానా అవస్థలు పడుతుంటారు. జమైక జూలో కూడా ఒక సందర్శకుడు ఇలానే జంతువులను ముట్టుకునేందుకు ప్రయత్నించి ఇబ్బందులను కొనితెచ్చుకున్నాడు.
ఆ సందర్శకుడు బోనులోనే బంధించి ఉంది కదా అని సంహాన్ని టచ్ చేసి ఆట పట్టించేందుకు ప్రయత్నిచాడు. అంతటితో ఊరుకోకుండా దాని నోటిలో వేలు పెట్టేందుకు ట్రై చేశాడు కూడా. సింహం ఊరుకుంటుందా..'నాతోనే మజాక్ చేస్తావ్ రా'.. అంటూ కోపంతో వాడి వేలును గట్టిగా కోరికి పట్టుకుంది. ఇక ఆ సందర్శకుడు పాట్లు మాములుగా లేవు. తన వేలుని వెనక్కి తీసుకునేందుకు శతవిధాల ప్రయత్నించాడు. చివరికి వేలు పైన ఉన్న కండంతా పోయి ఎముకతో మిగిలింది. అందుకే పెద్దలు అంటారు వేటిలో పడితే వాటిలో వేళ్లు పెట్టకూడదని. ఇది అన్ని విషయాలకి వర్తిస్తుంది గానీ మనమే గుర్తించం. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్ అవుతుంది.
Show off bring disgrace
— Ms blunt from shi born 🇯🇲 “PRJEFE” (@OneciaG) May 21, 2022
The lion at Jamaica Zoo ripped his finger off. pic.twitter.com/Ae2FRQHunk
(చదవండి: పెళ్లి మండపంలోనే పెళ్లి వద్దని తెగేసి చెప్పిన వధువు... స్పృహ తప్పి పడిపోయిన వరుడు)
Comments
Please login to add a commentAdd a comment