పర్యటనకు వెళ్తే.. పరుగులు పెట్టించింది | Karnataka Lion Chases Tourists On Safari | Sakshi
Sakshi News home page

భయానక వీడియో.. సఫారిని వెంబడించిన సింహం

Published Mon, Oct 14 2019 10:47 AM | Last Updated on Mon, Oct 14 2019 10:54 AM

Karnataka Lion Chases Tourists On Safari - Sakshi

బెంగళూరు: సరదాగా పర్యటించడానికి పార్కుకు వెళ్లిన వారికి ఒక్కసారిగి మృత్యువు కళ్ల ముందు ప్రత్యక్షమయ్యింది. దాంతో ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని పరుగందుకున్నారు. మృగరాజు పర్యటనకు వచ్చి వారిని వెంటాడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కర్ణాటక​ బళ్లారిలోని అటల్‌ బిహారీ వాజ్‌పేయి జూలాజికల్‌ పార్కులో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాలు... నలుగురు పర్యటకులు పార్కులో పర్యటించేందుకు సఫారిలో వెళ్లారు. ఇంతలో అనుకోకుండా ఓ సింహం సఫారి వైపే పరిగెత్తుకుంటూ రాసాగింది. ఇది గమనించిన వ్యక్తులు మొదట్లో దీన్ని సరదాగా తీసుకుని నెమ్మదిగా వెళ్లడం ప్రారంభించారు.

కానీ సింహం వేగంగా సఫారివైపు దూసుకువస్తుండటంతో మృత్యు దేవతే తమను తరుముతున్నట్లు భయంతో వణికిపోయారు. వెంటనే సఫారి వేగాన్ని పెంచి ముందుకు దూకించారు. కానీ మృగరాజు మాత్రం కొద్ది దూరం పాటు ఆ సఫారిని వెంబడించి.. ఆ తర్వాత దాని వేగాన్ని అందుకోలేక ఆగిపోయింది. దాంతో సఫారిలో ఉన్నవారిగా ఒక్కసారిగా బతుకు జీవుడా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇంతకు సింహం పర్యటకుల వాహనాన్ని ఎందుకు వెంబడించిందనేది మాత్రం తెలియలేదు. మూడు రోజుల క్రితం యూట్యూబ్‌లో పోస్ట్‌ చేసిన ఈ వీడియో ఇప్పటికే లక్షలో వ్యూస్‌, కామెంట్స్‌ సంపాదించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement