సాక్షి, న్యూఢిల్లీ : నేటి ఆధునిక సమాజంలో కులానికున్న ప్రాధాన్యత తక్కువేమి కాదు. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా కులాల ప్రస్థావన లేకుండా ప్రభుత్వ పాలనే లేదు. ఇంతకూ కులం అంటే ఏమిటీ? ఎక్కడి నుంచి వచ్చింది. ఎలా పుట్టింది?. కులానికి సమానమైన అర్థం ఉందా?. సంస్కతంలో ‘జాతి’ , అరబిక్‌లో ‘కామ్’, పర్షియన్‌లో ‘జాట్’ అనే పదాలున్నాయి. ఇవన్నీ కూడా ‘క్యాస్ట్ (కులం)’అనే పదానికి సమానమైన అర్థాన్ని ఇవ్వడం లేదు. క్యాస్ట్ అనే ఇంగ్లీషు పదం ‘క్యాస్ట’ అనే స్పానిష్ మాతృక నుంచి వచ్చింది. ‘క్యాస్ట’ అన్న పదం తొలుత ఐబీరియన్లు అయిన స్పానిష్, పోర్చుగీసులు ఉపయోగించారు. ఈ పదాన్ని అమెరికాకు స్పానిష్‌లు, ఆసియాకు పోర్చుగీసులు పరిచయం చేశారు. ‘ఎసో మీ వియెని డి క్యాస్ట’... ‘క్యాస్ట డి జుడియోస్’ పదాలు ఆ విషయాన్ని సూచిస్తున్నాయి.
‘ఎసో మీ వియెని డి క్యాస్ట’ అనే స్పానిష్ వ్యాక్యానికి తెలుగులో ‘ఇది నా రక్తం’ అని అర్థం. ఎవరి కులం ఏదైనా అందరిలో ప్రవహించేది ఒకే రక్తం అంటాం. అదే రక్తం అనే పదం నుంచి క్యాస్ట్ అనే పదం వచ్చిందంటే ఆశ్చర్యమే! యూదులను వేరు చేసి వారిని అవమానించడం కోసం ఐబీరియన్లు ‘క్యాస్ట డి జుడియోస్’ అంటే ‘వారు యూదులు’ అనే పదాన్ని ముందుగా తీసుకొచ్చారట. ఈ క్యాస్ట్ అనే పదం భారత దేశానికి పరిచయం కాకముందే ఒకే ఆదిమ జాతి లేదా గణం మధ్య తప్ప మిగతా జాతి లేదా గణాల మధ్య పెళ్లిళ్లు చేసుకునే వ్యవస్థ లేదు. భారత్‌లోని హిందువులు, జైనులు, బౌద్ధులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవ మతస్తులందరిలోనూ ‘క్యాస్ట్ సిస్టమ్’ ఉంది.
ఒకప్పుడు జైనులు, బౌద్ధులు, సిక్కులను హిందువులుగానే పరిగణించేవారు. ఇప్పుడు జైనులు, బౌద్ధులను వేరు మతస్థులుగాను, సిక్కులను హిందువుల్లో భాగంగాను పరిగణిస్తున్నారు. బ్రిటిషర్లు మొట్టమొదటి సారిగా ముంబైలో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు కూడా కులాల ప్రాతిపదికనే పదవులను నిర్ణయించారు. వ్యవసాయదారులు, వ్యవసాయేతరుల మధ్య భూముల లావాదేవీలకు సంబంధించి 1900 సంవత్సరంలో బ్రిటిష్ పాలకులు ‘ల్యాండ్ ఎలియనేషన్ యాక్ట్’ను తీసుకొచ్చినప్పుడు కూడా అందులో తెగలు, కులాల ప్రస్థావన తీసుకొచ్చారు. (కుల వ్యవస్థ గురించి పూర్తి అవగాహన కలగాలంటే సుమిత్ గుహ రాసిన ‘బియాండ్ క్యాస్ట్’ రివైజ్డ్ వెర్షన్ పుస్తకాన్ని చదవాల్సిందే. సుమిత్ టెక్సాస్ యూనివర్సిటీలో హిస్టరీ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు).
Comments
Please login to add a commentAdd a comment