మరో విజయం సాధిస్తే భారత బాక్సర్లు మనోజ్ కుమార్ (64 కేజీలు), సుమిత్ సాంగ్వాన్ (81 కేజీలు) రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు.
బాకు (అజర్‌బైజాన్): మరో విజయం సాధిస్తే భారత బాక్సర్లు మనోజ్ కుమార్ (64 కేజీలు), సుమిత్ సాంగ్వాన్ (81 కేజీలు) రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు. ప్రపంచ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌లో ఈ ఇద్దరు బాక్సర్లు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో మనోజ్ 2-1తో ఇస్మెతోవ్ ఐరిన్ స్మెతోవ్ (బల్గేరియా)ను ఓడించగా... సుమిత్ 3-0తో సందాగ్‌సురెన్ ఎర్దెనెబాయెర్ (మంగోలియా)పై విజయం సాధించాడు.
75 కేజీల విభాగంలో భారత్‌కే చెందిన వికాస్ కృషన్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి చేరుకున్నాడు. 49 కేజీల విభాగంలో దేవేంద్రో సింగ్ సెమీఫైనల్‌కు చేరాడు. ఫైనల్‌కు చేరితేనే దేవేంద్రోకు రియో బెర్త్ ఖాయమవుతుంది.