para athlete
-
Madhurawada Nidhi: క్యాన్సర్‌ను ఓడించి..క్రీడల్లో మెరిసి..!
కష్టాలను జయించి.. స్వప్నాలను సాకారం చేసుకున్న పోరాట యోధురాలు ఆమె. చిన్న వయసులోనే క్యాన్సర్ తన జీవితాన్ని కుదిపేసినా ధైర్యంగా ఎదుర్కొంది. ఈ క్రమంలో కాలు కోల్పోయినా.. ఆత్మస్థైర్యం మాత్రం కోల్పోలేదు. తన బలహీనతను బలంగా మార్చుకుని.. పోరాటానికి సిద్ధమైంది. పారా క్రీడల్లో తనను తాను నిరూపించుకుంటూ.. రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది. ఆమే మధురవాడకు చెందిన నిధి. ఆమె ఒక క్రీడాకారిణిగానే కాకుండా.. కష్టాలను ఎలా అధిగమించాలనే దానికి ఒక సాక్ష్యం. ఆమె కథ మనందరికీ స్ఫూర్తినిస్తుంది. ఆమె విజయాలు ప్రేరణగా నిలుస్తాయి. భవిష్యత్తులో నిధి మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిద్దాం. – విశాఖ స్పోర్ట్స్విశాఖలో ఆదివారం జరిగిన రాష్ట్రస్థాయి పారా స్విమ్మింగ్ పోటీల్లో నిధి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కృత్రిమ కాలుతో నడుస్తూ.. నాలుగు క్రీడాంశాల్లో పోటీపడుతున్న ఆమె చిన్న వయసులోనే ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. మధురవాడ ప్రాంతానికి చెందిన నిధి తండ్రి కేశవరావు, తల్లి జ్యోతి. ప్రస్తుతం ఆమె 10వ తరగతి చదువుతోంది. ఏడేళ్ల వయసులోనే ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన వ్యాధుల్లో ఒకటైన క్యాన్సర్ బారిన పడింది. చికిత్సలో భాగంగా ఆమె ఎడమ కాలును కోల్పోయింది. ఈ క్రమంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని.. క్యాన్సర్‌ను జయించి మామూలు స్థితికి చేరుకుంది. అంగవైకల్యాన్ని మరిచిపోయేందుకు ఆటలను ఎంపిక చేసుకుంది. కృత్రిమ కాలుతో కదన రంగంలోకి దిగింది. పట్టుదలతో స్విమ్మింగ్, చదరంగం, రైఫిల్ షూటింగ్, రన్నింగ్‌లో శిక్షణ పొందింది. పారా క్రీడల్లో తాను తలపడుతున్న అన్ని అంశాల్లోనూ నేడు పతకాలు సాధించే స్థాయికి చేరుకుంది. ఇటీవల రష్యాలో జరిగిన పారా క్రీడల్లో నాలుగు పతకాలను సొంతం చేసుకుంది. మలుపు తిప్పిన సర్వేవర్స్ క్యాంప్ అంగవైకల్యం ఏర్పడినా క్యాన్సర్‌ను జయించిన నిధి నిబ్బరంగానే నిలిచింది. చదువుకుంటూనే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఆటలపై ఆసక్తిని పెంచుకుంది. అప్పట్లో ముంబయిలో క్యాన్సర్ చికిత్స తీసుకున్న ఆమె.. క్యాన్సర్ సర్వేవర్స్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు నిర్వహించిన పోటీల్లో పాల్గొంది. తనలాంటి వారితో నిర్వహించే పోటీల్లో పోటీపడగలననే ధీమాతో.. వారిచ్చిన శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంది. అలా రాంచీలో జరిగిన జాతీయస్థాయి చదరంగం అండర్–19 పోటీల్లో తొలిసారి పాల్గొని సత్తా చాటింది. జాతీయ పారా స్విమ్మింగ్ పోటీలకు ఎంపిక 2019లో కరోనా కారణంగా పోటీల్లో పాల్గొనడం కాస్త తగ్గించింది నిధి. అప్పటికే ముంబయి నుంచి విశాఖకు తల్లిదండ్రులతో వచ్చేసిన నిధి తిరిగి గ్వాలియర్‌లో జరిగిన పారా స్విమ్మింగ్ పోటీల్లో తన కేటగిరీలో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఇటీవల రష్యాలో జరిగిన రైఫిల్ షూటింగ్లో కాంస్య పతకం, చెస్, స్విమ్మింగ్లతో పాటు రన్నింగ్‌లో స్వర్ణ పతకాలను అందుకుంది. ఆదివారం విశాఖలో జరిగిన రాష్ట్ర స్థాయి పారా స్విమ్మింగ్ పోటీల్లో ఎస్–9 కేటగిరీలో తలపడింది. 50 మీటర్ల ఫ్రీస్టయిల్, బ్యాక్ స్ట్రోక్, వంద మీటర్ల ఫ్రీస్టయిల్ పోటీల్లో విజేతగా నిలిచింది. వచ్చే నెలలో గోవాలో జరగనున్న జాతీయ పారా స్విమ్మింగ్ పోటీలకు సిద్ధమవుతోంది. -
పారా అథ్లెట్ దీప్తికి సీఎం రేవంత్ భారీ నజరానా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని వరంగల్‌కు చెందిన పారా అథ్లెట్ దీప్తి జీవన్ జీ.. పారిస్‌లో జరుగుతున్న పారా ఒలంపిక్స్‌లో సత్తా చాటారు. మహిళల 400 మీటర్ల టీ20 క్లాస్‌లో దీప్తి కాంస్య పతకం గెలుచుకున్నారు. ఈ నేపథ్యంలో అథ్లెట్ దీప్తికి సీఎం రేవంత్ రెడ్డి భారీ నజరానా ప్రకటించారు.ఒలంపిక్స్‌లో సత్తా చాటినందుకు గాను దీప్తికి రూ. కోటి నగదుతో పాటు గ్రూప్-2 ఉద్యోగం, వరంగల్‌లో 500 గజాల స్థలం ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. అలాగే, దీప్తి కోచ్‌కు రూ. 10 లక్షల నజరానా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇదే సమయంలో రాష్ట్రంలోని పారా గేమ్స్ క్రీడాకారులకు శిక్షణ, ప్రోత్సాహకాలు ఇవ్వాలని అధికారులకు సూచించారు. -
Sumit Antil: ప్రపంచ రికార్డు... పసిడి పతకం
న్యూఢిల్లీ: పారిస్ పారాలింపిక్స్‌లో ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు పసిడి పతకాన్ని సాధించడమే తన లక్ష్యమని భారత పారాథ్లెట్ సుమిత్ అంటిల్ పేర్కొన్నాడు. ఈ నెల 28 నుంచి సెపె్టంబర్ 8 వరకు పారాలింపిక్స్ జరగనుండగా... ఆరంభ వేడుకల్లో జావెలిన్ త్రోయర్ సుమిత్ భారత బృందం పతాకధారిగా వ్యవహరించనున్నాడు. మూడేళ్ల క్రితం టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన సుమిత్.. ఎఫ్64 విభాగంలో పోటీపడనున్నాడు. తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డును ఇటీవల మూడుసార్లు బద్దలు కొట్టిన సుమిత్... గత ఏడాది పారా ఆసియా క్రీడల్లో జావెలిన్‌ను 73.29 మీటర్ల దూరం విసిరి బంగారు పతకం గెలుచుకున్నాడు. పారా ప్రపంచ చాంపియన్సిప్లోనూ సుమిత్ స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. డిఫెండింగ్ పారాలింపిక్ చాంపియన్‌గా బరిలోకి దిగనున్న సుమిత్ టైటిల్ నిలబెట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ‘మరోసారి ప్రపంచ రికార్డు బద్దలు కొట్టి పసిడి పతకం గెలవాలనుకుంటున్నా. ప్రాక్టీస్ లో నిలకడగా మంచి ప్రదర్శన చేస్తున్నా. నైపుణ్యాలు పెంచుకునేందుకు నిరంతరం ప్రయతి్నస్తున్నా. 80 మీటర్ల మార్క్ అందుకోవడం నా లక్ష్యం. డిఫెండింగ్ చాంపియన్ అనే ఒత్తిడి ఏం లేదు. అత్యుత్తమ ప్రదర్శన చేయడంపైనే దృష్టి పెడతా. 2019 నుంచి టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్‌లో భాగంగా ఉన్నా. ప్రభుత్వ సహకారం వల్లే అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణించగలుగుతున్నా. పారాలింపిక్స్‌లో దేశానికి పతకం అందించాలనే ఉద్దేశంతో ఇతర టోరీ్నల్లో ఎక్కువ పాల్గొనలేదు’ అని సుమిత్ అన్నాడు. పారాలింపిక్స్‌లో భారత్ నుంచి 12 క్రీడాంశాల్లో 84 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. -
పుట్టుకతోనే దృష్టి లోపం.. అయినా గానీ వరల్డ్ ఛాంపియన్!
జపాన్ వేదికగా జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్-2024లో స్ప్రింటర్ సిమ్రాన్ శర్మ సత్తా చాటిన సంగతి తెలిసిందే. మహిళల 200 మీటర్ల రన్నింగ్ విభాగంలో సిమ్రాన్ శర్మ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. కేవలం 24.95 సెకన్లలోనే పరుగు పూర్తి చేసిన సిమ్రాన్.. భారత్‌కు ఆరో గోల్డ్‌మెడల్‌ను అందించింది. పారిస్ ఒలింపిక్స్‌కు ముందు బంగారు పతకం సాధించడం సిమ్రాన్‌లో మరింత ఆత్మ విశ్వాసాన్ని నింపుతుంది.ఇక ఛాంపియన్‌గా నిలిచిన సిమ్రాన్ వెనుక ఎంతో కష్టం దాగి ఉంది. సిమ్రాన్ ఈ స్ధాయికి చేరుకోవడంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఢిల్లీకి చెందిన సిమ్రాన్ కథ ఎంతో మందికి ఆదర్శం. ఈ నేపథ్యంలో అథ్లెట్‌గా సిమ్రాన్ జర్నీపై ఓ లుక్కేద్దాం.ఎన్నో కష్టాలు..సిమ్రాన్ పూర్తిగా నెలల నిండకుండానే(ప్రీ మ్యాచూర్ బేబీ) జన్మించింది. కేవలం ఆరున్నర నెలలకే ఈ ప్రపంచంలోకి సిమ్రాన్ అడుగుపెట్టింది. ఆమె పుట్టినప్పటి నుంచే దృష్టి లోపంతో బాధపడుతోంది.పుట్టిన తర్వాత ఆమె దాదాపు నెలలకు పైగా ఇంక్యుబేటర్‌లో గడిపింది. దృష్టి లోపం వల్ల ఆమెను ఇరుగుపొరుగు వారు హేళన చేసేవారు. కానీ వాటిని ఆమె ఎప్పుడూ పట్టించుకోలేదు. కానీ జీవితంలో ఏదైనా సాధించి హేళన చేసిన వారితోనే శెభాష్ అనుపించుకోవాలని ఆమె నిర్ణయించుకుంది. ఇప్పుడు తన కలలు కన్నట్లు గానే వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచి అందరితోనూ శెభాష్ అనిపించుకుంది.సూపర్ లవ్ స్టోరీ.. భర్తే కోచ్ఇక సిమ్రాన్ వరల్డ్ ఛాంపియన్‌గా నిలవడంలో తన భర్త గజేంద్ర సింగ్‌ది కీలక పాత్ర. వీరిద్దరిది ప్రేమ వివాహం. వీరి లవ్ స్టోరీ సినిమా స్టోరీని తలపిస్తోంది. గజేంద్ర సింగ్ ప్రస్తుతం ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నాడు. అయితే లక్నోలో సమీపంలోని ఖంజర్పూర్ గ్రామానికి చెందిన సింగ్.. తన కూడా అంతర్జాతీయ స్ధాయిలో అథ్లెట్‌గా రాణించాలని కలలు కన్నాడు. కానీ గజేంద్ర సింగ్ తన కలను నేరవేర్చుకోలేకపోయాడు.ఆర్ధికంగా స్థోమత లేని వారికి శిక్షణ ఇచ్చి వారి విజయాల్లో భాగం కావాలనుకున్నాడు. ఈ క్రమంలోనే 2015లో ఢిల్లీలోని ఎమ్ఎమ్ కాలేజీ గ్రౌండ్లో సిమ్రాన్‌తో సింగ్‌కు తొలిపరిచయం ఏర్పడింది. సిమ్రాన్‌కు గజేంద్ర సింగ్ కోచ్‌గా పనిచేశాడు. ఇద్దరూకాగా వీరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది. అయితే వీరి ప్రేమను గజేంద్ర సింగ్ కుటంబం అంగీకరించలేదు. కానీ గజేంద్ర సింగ్ తన ఫ్యామిలీని ఎదురించి 2017లో సిమ్రాన్‌ను పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వీరిద్దరూ తమ కుటంబాలకు దూరంగా ఉంటున్నారు.అతడితో సూచనతోనే..ఇక తన భార్యను ప్రపంచ స్ధాయి అథ్లెట్‌గా చూడాలని కలలు గన్న గజేంద్ర సింగ్.. వివాహం తర్వాత కీలక నిర్ణయం తీసుకున్నాడు. పెళ్లయిన రెండేళ్ల తర్వాత పారా అథ్లెట్ నారాయణ్ ఠాకూర్‌తో గజేంద్ర సింగ్, సిమ్రాన్ సమావేశమయ్యారు. మహిళల పారా విభాగంలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.అయితే 2019లో మహిళల T13 కేటగిరీకి సంబంధించిన లైసెన్స్‌ని పొందేందుకు శర్మ వరల్డ్ పారా గ్రాండ్ ప్రిక్స్‌లో పోటీ పడింది. అయితే లైసెన్స్ పొందేందుకు వారికి పెద్ద మొత్తాన డబ్బులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో సిమ్రాన్ భర్త సింగ్ లోన్ తీసుకోవడంతో పాటు తన పేరిట ఉన్న స్ధలాన్ని విక్రయించాడు. ఆ తర్వాత దుబాయ్‌లో జరిగే ప్రపంచ పారా ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించడానికి ముందు చైనాలో జరిగిన క్వాలిఫయర్స్‌లో ఆమె స్వర్ణం గెలుచుకుంది. కానీ దుబాయ్‌లో జరిగిన వరల్డ్ ఛాంపియన్ షిప్ 100 మీటర్ల T13 ఫైనల్లో ఆమె ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. ఆ తర్వాత షిమ్రాన్ తన కెరీర్లో ఉన్నో ఎత్తు పల్లాలను చవిచూస్తూ వరల్డ్ ఛాంపియన్‌గా అవతరించింది. -
అంగ వైకల్యం అడ్డు కాలేదు.. ప్రపంచం మెచ్చిన స్పోర్ట్స్ స్టార్ అయ్యింది..!
ఆమె దృఢ సంకల్పానికి అంగ వైకల్యం అడ్డు కాలేదు. మొండి పట్టుదలతో అనుకున్నది సాధించింది. 22 ఏళ్లకే రోడ్డు ప్రమాదంలో కాలు పోయినా.. కృత్రిమ కాలితో తనకెంతో ఇష్టమైన బ్యాడ్మింటన్ క్రీడలో సక్సెస్ సాధించింది. విధి వెక్కిరించినా సంచలనాలు సృష్టించింది. ఆమె ఆత్మ విశ్వాసం ముందు అంగ వైకల్యం ఓడిపోయింది. ఈ నిజమైన విజేత పేరే మానసి జోషి. గుజరాత్లో పుట్టి, ముంబైలో పెరిగిన 34 ఏళ్ల మానసి రోడ్డు ప్రమాదంలో కాలు పోయినా ఏమాత్రం అధైర్యపడకుండా జీవితంలో ముందడుగు వేసింది. కృత్రిమ కాలితో తనకెంతో ఇష్టమైన బ్యాడ్మింటన్ క్రీడలో సక్సెస్ సాధించింది. శారీరక లోపాన్ని జయించి అంతర్జాతీయ వేదికలపై భారత కీర్తి పతాకను రెపరెపలాడించింది. ఈ క్రమంలో పారా బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌గా, వరల్డ్ నంబర్ వన్ షట్లర్‌గా ఎదిగింది. ఆరేళ్ల వయసులోనే రాకెట్ పట్టుకున్న మానసి ఓవైపు ఉన్నత చదువులు చదువుతూనే.. క్రీడల్లో రాణించింది. ముంబైలో ఇంజినీరింగ్ పూర్తి చేశాక సాఫ్ట్వేర్ ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించిన మానసి.. ఉద్యోగంలో చేరిన కొద్ది రోజులకే రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయింది. 2011 డిసెంబర్ 2న ద్విచక్రవాహనంపై ఆఫీసుకు వెళ్తుండగా లారీ ఢీకొట్టడంతో ఆమె ఎడమ కాలు పూర్తిగా ఛిద్రమైంది. కాలు కోల్పోయాక కొద్ది రోజుల పాటు డిప్రెషన్లోకి వెళ్లిపోయిన మానసి.. వైకల్యం తన ఎదుగుదలకు అడ్డుకాకూడని నిశ్చయించుకుని ముందడుగు వేసింది. కృత్రిమ కాలును అమర్చుకొని తనకెంతో ఇష్టమైన బ్యాడ్మింటన్ బరిలోకి రీఎంట్రీ ఇచ్చింది. కఠోర శ్రమ అనంతరం జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన మానసి.. 2018లో హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో చేరి తన ఆటకు మరిన్ని మెరుగులు దిద్దుకుంది. గోపీచంద్ శిక్షణలో రాటుదేలిన మానసి.. వరల్డ్ ఛాంపియన్‌షిప్‌తో పాటు మరెన్నో అంతర్జాతీయ పతకాలు సాధించింది. తన ప్రతిభకు గుర్తింపుగా ఎన్నో అవార్డులు, పురస్కారాలు పొందింది. 2022లో మానసి వరల్డ్ నంబర్ వన్ ర్యాంకర్‌గా అవతరించింది. అమెరికాకు చెందిన బార్బీ కంపెనీ మానసి సాధించిన విజయాలకు గుర్తింపుగా ఆమె పోలికలతో బార్బీ బొమ్మను రూపొందించింది. తాజాగా చైనాలో జరుగుతున్న పోటీల్లో పాల్గొనేందుకు వెళ్లిన మానసి.. సహచర క్రీడాకారిణిలతో కలిసి ఫోటోకు పోజిచ్చింది. With Para baddy girls in China 🇨🇳 pic.twitter.com/bkDNlDM5vl — Manasi Joshi (@joshimanasi11) February 29, 2024 -
ఇండిగో, కోల్‌కతా ఎయిర్ పోర్ట్ నిర్వాకం: మహిళా పారా అథ్లెట్ ఆగ్రహం
బడ్జెట్ ఎయిర్‌లైన్స్ ఇండిగోకు సంబంధించి మరో అనుచిత ఘటన వివాదాన్ని రేపింది. అలాగే కోల్‌కతా విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది దివ్యాంగ మహిళ పట్ల అమానుషంగా వ్యవరించారు. దీనికి సంబంధించిన ఘటనను ఆమె ట్విటర్ షేర్ చేయడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. సెక్యూరిటీ క్లియరెన్స్ సమయంలో వికలాంగురాలైన (వీల్‌చైర్ యూజర్ కూడా) తనను మూడుసార్లు లేచి నిలబడాలంటూ కోరారని న్యాయ విద్యార్థిని ఆరూషి సింగ్ ట్వీట్ చేశారు. మొదట ఆమె నన్ను లేచి కియోస్క్‌లోకి రెండు అడుగులు వేయమని చెప్పింది. పుట్టుకతోనే తనకు వైక్యల్యంఉందని తన వల్ల కాదని చెప్పినా. వినిపించుకోకుండా రెండు నిమిషాలే అయిపోతుంది అంటూ వేధించారని ఆమె ఆరోపించారు. దీంతో తాను భయంతో వణికి పోయానంటూ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా తనకు 20 నిమిషాలు లేటైందని పేర్కొన్నారు. గతంలో ఇలాంటి జరిగినా, ఇండిగోకు ఇంకా బుద్ధి రాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే కోల్‌కతా ఎయిర్‌పోర్టు అధికారులు వైకల్యం ఉన్న ప్రయాణీకుల పట్ల వ్యవహరించాల్సిన తీరును పునరాలోచించాల్సిన అవసరం ఉందని సింగ్ కోరారు. ఈ ఘటనపై సిఐఎస్ఎఫ్, కోల్‌కతా విమానాశ్రయం ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయ లేదు. Yesterday evening during the security clearance at Kolkata airport, the officer asked me (a wheelchair user) to stand up, not once but thrice. First she asked me to get up and walk two steps into the kiosk. (1/1) — Arushi Singh (@singhharushi) February 1, 2024 ఇది ఇలా ఉంటే ఇండిగోకు సంబంధించి తాజా సంఘటన కలకలం రేపింది. వీల్ చెయిర్ విషయంలో ఇండిగో సిబ్బంది అమానుషంగా ప్రవర్తించారంటూ ఆసియా పారా గేమ్స్ పతక విజేత , పారా అథ్లెట్ సువర్ణ రాజ్ ఆరోపణలు గుప్పించారు. దివ్యాంగురాలైన తనకు విమానం డోర్ దగ్గర తన వీల్ చెయిర్ ఇవ్వకుండా ఇబ్బందికి గురి చేశారని మండి పడుతూ తన అనుభవాన్ని ఏఎన్ఐతో షేర్ చేశారు. #WATCH | Chennai, Tamil Nadu: Indian para-athlete Suvarna Raj alleges that she was mistreated by IndiGo Airlines crew members while taking a flight from New Delhi to Chennai yesterday. "...I told them 10 times that I want my personal wheelchair at the aircraft door, but no… pic.twitter.com/avResgXHJ0 — ANI (@ANI) February 3, 2024 విమానం డోర్ వద్ద తనకు వ్యక్తిగత వీల్‌చైర్ గురించి సిబ్బంది స్పందించలేదని ఆరోపించారు. న్యూఢిల్లీనుంచి చెన్నైకి వెళ్తుండగా ఇండిగో సిబ్బంది తన పట్ల దారుణంగా ప్రవర్తించారని సువర్ణ తెలిపారు. ఇండిగో నిర్ల్యక్షం మూలంగా తన వ్యక్తిగత వీల్‌చైర్ పాడైందని, దాని రిపేర్‌కు రూ. 3 లక్షలు ఖర్చయ్యాయని పేర్కొన్నారు. ఈ నష్టాన్ని ఇండిగోనే భరించాలన్నారు. వికలాంగులకు వీల్చైర్లు ప్రోటోకాల్ ఉల్లంఘనపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సువర్ణ డిమాండ్ చేశారు. అంతేకాదు సింగ్ వ్యవహారంపై కూడా ఆమె స్పందించారు. వికలాంగుల సమస్యను అర్థం చేసుకొని వారి పట్ల సున్నితంగా వ్యవహరించాలని రాజ్ కోరారు. -
దివ్యాంగ విజయాలు.. వింగ్స్ ఆఫ్ ఫైర్..!
అవయవలోపం ఉన్నా అనితరసాధ్య విజయాలు సాధించడంలో మిన్నగా నిలిచిన దివ్యాంగులకు అభినందన కార్యక్రమం ఆహ్లాదభరితంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దివ్యాంగులు పంచుకున్న క్రీడానుభవాలు అందరి మనసుల్నీ స్పర్శించాయి. గృహనిర్మాణానికి పేరొందిన జీ స్క్వేర్ హౌసింగ్ ఆధ్వర్యంలో జరిగిన హైదరాబాద్ లోని వెస్టిన్ హోటల్లో వింగ్స్ ఆఫ్ ఫైర్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పేరొందిన పారా అథ్లెటిక్స్ను నగదు బహుమతులతో పాటు సన్మానించారు. ఈ సందర్భంగా క్రీడారంగంలో దివ్యాంగుల విజయాలు ప్రతీ ఒక్కరికీ స్ఫూర్తిని అందిస్తాయని సీఆర్పీఎఫ్ డిఐజీ అనిల్ మింజ్ అన్నారు. పారా అథ్లెట్స్‌కు సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతూ దివ్యాంగులు విభిన్న రంగాల్లో రాణించేందుకు అన్ని వర్గాల వారూ తమ వంతుగా ప్రోత్సాహించాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అతిధిగా పాల్గొన్న భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు బి.సాయి ప్రణీత్ మాట్లాడుతూ క్రీడారంగంలో ఎదురయ్యే సవాళ్లు తనకు తెలుసని వీటిని ఎదుర్కుని విజేతలు కావడం ద్వారా దివ్యాంగులు ఎందరికో స్ఫూర్తిగా నిలిచారన్నారు. కార్యక్రమంలో సంస్థ సిఇఒ ఈశ్వర్ మాట్లాడుతూ దివ్యాంగుల విజయాలకు తోడ్పడేందుకు వచ్చే ఏడాది నుంచి గెలుపొందిన క్రీడాకారులను సన్మానించడం మాత్రమే కాకుండా క్రీడల్లో పాల్గొనేవారికి ఆర్ధికంగా సాయం అందించనున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ నివాసి పారా అధ్లెట్ వేణు తొలి దశలో తనని ఎవరూ ప్రోత్సహించేవారు కాదనీ చెబుతూ తానెలా అడ్డంకుల్ని అధిగమించి విజేతగా నిలిచాడో వివరించారు. అదే విధంగా భాగ్యశ్రీ మాథవ్ రావు జావెద్ మాట్లాడుతూ తన అనుభవాలు వివరించారు. హై జంప్‌లో పారాఒలింపిక్ గోల్డ్ మెడల్ తో పాటుగా పద్మశ్రీ, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్‌రత్న, అర్జున పురస్కారం తదితర పురస్కారాలు అందుకున్న మరియప్పన్ తంగవేలు, అంతర్జాతీయ పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు గీరీశ్ చంద్ర జోషి, ఇంటర్నేషనల్ పారా అథ్లటిక్స్ ఛాంపియన్ ప్రణవ్ ప్రశాంత్ దేశాయ్, కర్ణాటకకు చెందిన పారా బ్యాడ్మింటన్ ప్లేయర్ కె. గోపీనాథ్, మేథా జయంత్, తమిళనాడుకు చెందిన స్విమ్మింగ్ ఛాంపియన్ ఎస్ఆర్ తేజస్విని, హైదరాబాద్‌కు చెందిన నేషనల్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్లు బీర్ భద్ర సింగ్, అజయ్‌కుమార్‌లు పాల్గొన్నారు. భాగ్యశ్రీ మాధవరావు జావేద్ లకు రూ.1లక్ష చొప్పున, మరో ముగ్గురికి రూ.75వేల చొప్పున, మరో ముగ్గురు క్రీడాకారులకు 50వేల చొప్పున నగదు బహముతులను అందించడంతో పాటు ఘనంగా సన్మానించారు. -
భారతీయులు గర్వపడేలా చేసిన సచిన్ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే..?
దేశానికి పతకాలను అందించి భారతీయులను గర్వపడేలా చేసిన క్రీడాకారులు నేడు అత్యంత దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాల నుంచి కనీస సాయం కూడా అందకపోవడంతో వారు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. స్పెషల్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించిన సీతా సాహు సమోసాలు అమ్ముకుంటున్న ఘటనను మరవకముందే మరో వార్త అందరినీ ఆవేదనకు గురిచేస్తోంది. నేషనల్ చాంపియన్(పారా అథ్లెట్) సచిన్ సాహు.. జీవనోపాధి కోసం ఐస్‌క్రీమ్ బండి నడుపుకుంటున్నాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన సచిన్.. ఒడిశాలోని కళింగ స్టేడియంలో జరిగిన 20వ జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 400 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం సాధించాడు. ఈ రేసును సచిన్ 1.17 సెకన్లలో పూర్తి చేసి రికార్డు క్రియేట్ చేశాడు. ఆ తర్వాత ప్రభుత్వం తనకు ఎలాంటి సాయం అందకపోవడంతో తాను ఇలా ఐస్‌క్రీమ్స్ అమ్ముకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదిలా ఉండగా.. సచిన్ 2015 నుండి 2019 వరకు క్రికెట్ ఆడాడు. కానీ, దివ్యాండైన కారణంగా క్రికెట్లో పెద్దగా రాణించలేకపోయాడు. అనంతరం.. గ్వాలియర్ అథ్లెటిక్స్ కోచ్ బీకే ధవన్ సాయంతో పారా అథ్లెట్‌గా మారాడు. అనంతరం కాంస్య పతకం సాధించాడు. Madhya Pradesh | Para-athlete Sachin Sahu sells ice cream in Rewa to make ends meet "Despite lack of facilities, I won a bronze medal in 400m race in 20th National Para-Athletics Championship. I appeal to the government to support me to play further," he said pic.twitter.com/bH53zzwdcf — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) May 6, 2022 -
చేయందిస్తే..చరిత్ర సృష్టిస్తా..
సాక్షి, హైదరాబాద్: శరీరం సహకరించకున్నా... అలుపెరుగకుండా విజయాలు సాధిస్తూనే ఉన్న ఆ క్రీడాకారిణి... ఆర్థిక పరిస్థితి సహకరించక చేయూత కోసం ఎదురు చూస్తోంది. కాస్తంత చేయి అందిస్తే...పారా అథ్లెట్‌గా చరిత్ర తిరగరాస్తానంటోంది. నగరంలోని సరూర్‌నగర్‌కు చెందిన కుడుముల లోకేశ్వరి (26) పారా క్రీడాకారిణి. 10 ఏళ్ల వయస్సులో బ్రెయిన్ ట్యూమర్ కారణంగా కుడి వైపు శరీరం పనిచేయడం మానేసింది. అయినా చిన్నప్పటి నుంచి క్రీడల పైన తనకున్న మక్కువే ఆమెను పారా క్రీడాకారిణిగా మార్చింది. 2019 నుంచి నిరంతర సాధన చేస్తున్న లోకేశ్వరి ఈ ఏడాది మార్చి 27న భువనేశ్వర్ కళింగా స్టేడియంలో జరిగిన 20వ నేషనల్ పారా ఆథ్లెటిక్ చాంపియన్ షిప్ డిస్కస్ త్రోలో పాల్గొని సిల్వర్ మెడల్ సాధించింది. గత ఏడాది మార్చిలో బెంగళూర్ కంఠీరవా స్టేడియంలో జరిగిన 19వ జాతీయ స్థాయి పారా అథ్లెటిక్స్‌లో షాట్ ఫుట్, డిస్కస్ త్రో విభాగంలో 2 కాంస్య పతకాలు సాధించింది. డిసెంబర్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బెంగళూర్‌లో జరిగిన 3వ ఇండియన్ ఓపెన్ పారా ఆథ్లెటిక్ ఛాంపియన్షిప్ షాట్ ఫుట్‌లో కూడా సిల్వర్ మెడల్ సాధించింది. 3 సార్లు రాష్ట్ర స్థాయి పోటీల్లో బంగారు పతకాలు సాధించింది. త్వరలో జరగనున్న ఆసియన్ పారా గేమ్స్ కోసం సాధన చేస్తుంది. ఇందులో పాల్గొనడానికి అర్హత సాధించాలంటే జూన్ నెలలో తునిషియా (నార్త్ ఆఫ్రికా) వేదికగా జరిగే పోటీల్లో పాల్గొనాలి. అయితే ఇందుకు రూ.3 లక్షల వరకు ఖర్చవుతుందని లోకేశ్వరి తెలిపింది. అందుకు ఆమె ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం అనుకూలించడం లేదు. పదేళ్ల క్రితం తండ్రి అనారోగ్యంతో మృతి చెందారు. ఓ ప్రైవేట్ హాస్పిటల్లో స్వీపర్‌గా పని చేసే తల్లి జీతంతో కుటుంబ పోషణ కష్టంగా ఉందని తెలిపింది. అప్పులు చేస్తూ సాధన కొనసాగిస్తున్నానని ఇలాంటి పరిస్థితుల్లో తన ప్రతిభను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం లేదా ఎవరైనా దాతలు ఆర్థిక సహాయం అందించాలని కోరుతోంది. దాతలు సహకరిస్తే దేశానికి పతకాలు సాధించగలననే ఆత్మ విశ్వాసం తనకుందని అంటోంది. సహాయం చేయాలనుకునే వారు ఫోన్ నెం 6304394851 లో సంప్రదించవచ్చు. (చదవండి: చిరిగిన పుస్తకాలు..విరిగిన కుర్చీలు) -
యువ స్విమ్మర్ మృతి.. భౌతిక కాయం తరలించేందుకు డబ్బుల్లేని దుస్థితి
Former Swimming Champion Amartya Chakraborty Passed Away: మూడు జాతీయ అవార్డుల గ్రహీత, కామన్వెల్త్ క్రీడల్లో పతకం సాధించిన తొలి భారత స్విమ్మర్ అమర్త్య చక్రవర్తి (19) అనారోగ్యం కారణంగా ఢిల్లీలోని జీబీ పంత్ ఆస్పత్రిలో మృతి చెందాడు. గత కొంతకాలంగా వెన్నెముక, మెదడు సంబంధిత దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న అమర్త్య.. బుధవారం ఉదయం కార్డియో రెస్పిరేటరీ అరెస్ట్ కావడంతో కన్నుమూశాడు. భౌతికకాయాన్ని స్వస్థలానికి తరలించేందుకు కూడా డబ్బులు లేవని అమర్త్య తండ్రి అమితోష్ చక్రవర్తి కన్నీరుమున్నీరవడం అందరినీ కలచి వేసింది. కొడుకుని బతికించుకునేందుకు ఉన్నందంతా ఖర్చుచేయడమే కాక పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయానని అమితోష్ వాపోయాడు. ఆర్ధిక సాయం కోసం కేంద్ర క్రీడా శాఖకు, భారత పారాలింపిక్ కమిటీకి ఎన్నిసార్లు లేఖలు రాసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, అమర్త్య చక్రవర్తి అనారోగ్యం కారణంగా ఐదేళ్ల కిందట పారా స్విమ్మింగ్ ఈవెంట్స్‌లో పాల్గొనే అర్హతను కోల్పోయాడు. అమర్త్య 2017 పారా నేషనల్స్‌లో ఉత్తమ స్విమ్మర్ అవార్డును గెలుచుకున్నాడు. చదవండి: బోణీ విజయం కోసం ముంబై.. రెండో విజయంపై కన్నేసిన చెన్నై -
అస్తమించిన క్రీడా దిగ్గజం..
సాక్షి, కరీంనగర్ : దివ్యాంగ క్రీడాకారులకు ఆయన ఓ స్ఫూర్తి.. ఆదర్శం. దివ్యాంగుడైనా పట్టుదల.. సడలని ఆత్మవిశ్వాసం.. మనోధైర్యంతో ప్రపంచ స్థాయి పోటీల్లో విజేతగా నిలిచాడు. ఆటే శ్వాసగా ప్రతీ పోటీలో పతకాలు సాధిస్తూ జాతీయ పతాకాన్ని రెపరెపలాడించాడు. ఆయన క్రీడా ప్రతిభ ముందు వైకల్యం తలవంచింది. చివరికి క్యాన్సర్‌తో ఆయన సాగించిన పోరాటంలో పరాజితుడై తుది శ్వాస విడిచాడు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లికి చెందిన అర్జున అవార్డు గ్రహీత మాదాసు శ్రీనివాస్‌రావు(67) హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో మృతిచెందారు. కార్సినోమా క్యాన్సర్‌తో చికిత్స పొందుతూ కొంతకాలంగా కోమాలో ఉన్న ఆయన బుధవారం రాత్రి తుదిశ్వాస వదిలారు. స్వగ్రామంలో అంత్యక్రియలు.. శ్రీనివాసరావు స్వగ్రామం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలో క్రీడాభిమానుల అశ్రునయనాల మధ్య గురువారం అంత్యక్రియలు నిర్వహించారు. శ్రీనివాస్‌రావు మృతదేహం వద్ద సర్పంచ్ వీరగోని సుజాత, ఎంపీటీసీ పులి అనూష నివాళులర్పించారు. ఆయనకు భార్య రమాదేవి, ఇద్దరు కుమారులు, రోహిత్, రోహన్, కూతురు ధృవి ఉన్నారు. మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించిన శ్రీనివాస్‌రావు వృత్తి రీత్యా ఆర్టీసీలో మెకానిక్‌గా చేరారు. ఉత్తమ దివ్యాంగ ఉద్యోగిగా 1994లో జాతీయ స్థాయి అవార్డును అప్పటి రాష్ట్రపతి శంకర్‌దయాల్ శర్మ చేతుల మీదుగా అందుకున్నారు. దివ్యాంగుల జాతీయ క్రీడా సంఘానికి అనుబంధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పారా స్పోర్ట్స్ సంఘం ఏర్పాటు చేశారు. 2003లో అర్జున అవార్డు.. 1996లో లండన్‌లో జరిగిన దివ్యాంగుల ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని సాధించారు. 2002లో బెంగళూరులో జరిగిన వరల్డ్ పారా బ్యాడ్మింటన్‌లో స్వర్ణం సాధించారు. దీంతో భారత ప్రభుత్వం 2003లో అర్జున అవార్డు ప్రకటించింది. అప్పటి రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి పారా అథ్లెట్ల విభాగంలో అర్జున పురస్కారాన్ని పొందిన తొలి శ్రీడాకారుడిగా రికార్డ్ సాధించారు. 2010లో చైనాలోని గ్వాంగ్ జూలో జరిగిన ఏసియన్ పారా ఫెన్సింగ్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. 2004లో మలేసియాలో జరిగిన మెన్స్ డబుల్స్ ఏసియన్ పారా బ్యాడ్మింటన్‌లో కాంస్య పతకం, 2006లో ఇజ్రాయిల్‌లో జరిగిన సింగిల్స్ ఓపెన్ బ్యాడ్మింటన్‌లో కాంస్యం, 2010లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో బ్యాటన్ రిలేలో ప్రతిభ కనబరిచారు. 2006 నుంచి ముంబయి మారథాన్ రన్లో వరుసగా పాల్గొన్నారు. చివరగా 2018లో బెంగళూర్ జరిగిన రన్లో పాల్గొని కాంస్య పతకం సాధించారు. వైఎస్సార్ పాదయాత్రలో.. దివంగత సీఎం వైఎస్సార్ జిల్లాలో చేపట్టిన పాదయాత్రలో ఆయనతో కలిసి అడుగులు వేశారు. జమ్మికుంట నుంచి పరకాల వరకు పాదయాత్రలో పాల్గొన్నారు. అర్జున అవార్డు అందుకున్న మాదాసు కు అప్పటి ఏపీ సీఎం వైఎస్సార్ రూ.లక్ష నజరానా అందించారు. 2017లో తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం దివ్యాంగ స్ఫూర్తి అవార్డు ప్రదానం చేసింది. ఇంటి స్థలం కోసం.. అర్జున అవార్డు గ్రహీతలకు ప్రభుత్వాలు ఇంటి స్థలాలివ్వడం పరిపాటి. తిమ్మాపూర్ సమీపంలో తనకు 3 ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయించాలని ప్రభుత్యాలను విన్నవించినా నేటికీ కేటాయింపులు జరగలేదు. పద్మశ్రీ పురస్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేయడం గమనార్హం. 2004లో జిల్లా కేంద్రంలో మాదాసు శ్రీనివాస్‌రావు కాలనీని ఏర్పాటు చేసింది. తన అంతర్జాతీయ ప్రతిభతో ఎంతోమంది దివ్యాంగులు క్రీడల్లో భాగస్వాములను చేస్తూ వారికి స్ఫూర్తినిచ్చారు. దీంతో అంజనారెడ్డి, రఘురాం వంటి దివ్యాంగ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించారు. శ్రీనివాస్‌రావు మృతదేహానికి నివాళులరి్పస్తున్న సర్పంచ్ సుజాత -
పారాఅథ్లెట్తో బిచ్చమెత్తించారు..
న్యూఢిల్లీ: శారీరక లోపాలతో సతమతమవుతున్నా వెరవక కష్టించి.. ఏదో సాధించి దేశం పేరు మార్మొగేలా చేయాలని తపన పడుతున్న ఓ పారాఅథ్లెట్‌కు తీవ్ర అవమానం జరిగింది. దృష్టిలోపం గల కాంచనమాల పాండే ఈ నెల 3 నుంచి 9 వరకూ జర్మనీ రాజధాని బెర్లిన్‌లో జరిగిన పారా స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొని వెండి పతకం సాధించారు. అయితే, చాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్న సమయంలో ఖర్చులకు డబ్బు లేకపోవడంతో ఆమె బిచ్చమెత్తినట్లు రిపోర్టులు వచ్చాయి. కాంచనమాల పాండే ఇంటర్వూ తీసుకున్న మెయిల్ టుడే.. టూర్లో ఆమెకు జరిగిన అవమానాన్ని వెలుగులోకి తెచ్చింది. టోర్నీలో పాల్గొనేందుకు రూ.5 లక్షలు లోన్ తీసుకున్నట్లు కాంచనమాల మెయిల్ టుడేకు వెల్లడించారు. టోర్నమెంట్ ముగిసేనాటికి తాను రూ.1,10,000/- హోటల్ బిల్లు చెల్లించాల్సివుందని చెప్పారు. తాను ఖర్చు చేసిన డబ్బు రీయింబర్స్మెంట్ రూపంలో వెనక్కు వస్తుందో? రాదో కూడా అధికారికంగా సమాచారం లేదని వెల్లడించారు. కాగా, ఈ ఏడాది జరిగిన పారా అథ్లెటిక్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌కు భారత్ నుంచి ఎంపికైన ఏకైక స్విమ్మర్ కాంచనమాల పాండేనే. కాంచనమాలకు ఈ గతి పట్టడానికి కారణం భారత పారాలింపిక్ కమిటి(పీసీఐ)యే అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టూర్‌కు బయల్దేరే ముందు ఆర్థిక సాయం కోసం కాంచనమాల పెట్టుకున్న అభ్యర్ధనను పీసీఐ పట్టించుకోలేదు. ఈ ఘటనపై టాప్ చైర్మన్ అభినవ్ బింద్రా ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయల్, ప్రధానమంత్రి నరేంద్రమోదీలకు ట్వీట్ చేశారు. బింద్రా ట్వీట్‌కు వెంటనే సమాధానం ఇచ్చిన గోయల్.. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. విచారణ తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.