జపాన్ వేదికగా జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్-2024లో స్ప్రింటర్ సిమ్రాన్ శర్మ సత్తా చాటిన సంగతి తెలిసిందే. మహిళల 200 మీటర్ల రన్నింగ్ విభాగంలో సిమ్రాన్ శర్మ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది.
కేవలం 24.95 సెకన్లలోనే పరుగు పూర్తి చేసిన సిమ్రాన్.. భారత్‌కు ఆరో గోల్డ్‌మెడల్‌ను అందించింది. పారిస్ ఒలింపిక్స్‌కు ముందు బంగారు పతకం సాధించడం సిమ్రాన్‌లో మరింత ఆత్మ విశ్వాసాన్ని నింపుతుంది.
ఇక ఛాంపియన్‌గా నిలిచిన సిమ్రాన్ వెనుక ఎంతో కష్టం దాగి ఉంది. సిమ్రాన్ ఈ స్ధాయికి చేరుకోవడంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఢిల్లీకి చెందిన సిమ్రాన్ కథ ఎంతో మందికి ఆదర్శం. ఈ నేపథ్యంలో అథ్లెట్‌గా సిమ్రాన్ జర్నీపై ఓ లుక్కేద్దాం.
ఎన్నో కష్టాలు..
సిమ్రాన్ పూర్తిగా నెలల నిండకుండానే(ప్రీ మ్యాచూర్ బేబీ) జన్మించింది. కేవలం ఆరున్నర నెలలకే ఈ ప్రపంచంలోకి సిమ్రాన్ అడుగుపెట్టింది. ఆమె పుట్టినప్పటి నుంచే దృష్టి లోపంతో బాధపడుతోంది.
పుట్టిన తర్వాత ఆమె దాదాపు నెలలకు పైగా ఇంక్యుబేటర్‌లో గడిపింది. దృష్టి లోపం వల్ల ఆమెను ఇరుగుపొరుగు వారు హేళన చేసేవారు. కానీ వాటిని ఆమె ఎప్పుడూ పట్టించుకోలేదు.
కానీ జీవితంలో ఏదైనా సాధించి హేళన చేసిన వారితోనే శెభాష్ అనుపించుకోవాలని ఆమె నిర్ణయించుకుంది. ఇప్పుడు తన కలలు కన్నట్లు గానే వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచి అందరితోనూ శెభాష్ అనిపించుకుంది.
సూపర్ లవ్ స్టోరీ.. భర్తే కోచ్
ఇక సిమ్రాన్ వరల్డ్ ఛాంపియన్‌గా నిలవడంలో తన భర్త గజేంద్ర సింగ్‌ది కీలక పాత్ర. వీరిద్దరిది ప్రేమ వివాహం. వీరి లవ్ స్టోరీ సినిమా స్టోరీని తలపిస్తోంది. గజేంద్ర సింగ్ ప్రస్తుతం ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నాడు.
అయితే లక్నోలో సమీపంలోని ఖంజర్‌పూర్ గ్రామానికి చెందిన సింగ్.. తన కూడా అంతర్జాతీయ స్ధాయిలో అథ్లెట్‌గా రాణించాలని కలలు కన్నాడు. కానీ గజేంద్ర సింగ్ తన కలను నేరవేర్చుకోలేకపోయాడు.
ఆర్ధికంగా స్థోమత లేని వారికి శిక్షణ ఇచ్చి వారి విజయాల్లో భాగం కావాలనుకున్నాడు. ఈ క్రమంలోనే 2015లో ఢిల్లీలోని ఎమ్ఎమ్ కాలేజీ గ్రౌండ్‌లో సిమ్రాన్‌తో సింగ్‌కు తొలిపరిచయం ఏర్పడింది. సిమ్రాన్‌కు గజేంద్ర సింగ్ కోచ్‌గా పనిచేశాడు. ఇద్దరూ
కాగా వీరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది. అయితే వీరి ప్రేమను గజేంద్ర సింగ్ కుటంబం అంగీకరించలేదు. కానీ గజేంద్ర సింగ్ తన ఫ్యామిలీని ఎదురించి 2017లో సిమ్రాన్‌ను పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వీరిద్దరూ తమ కుటంబాలకు దూరంగా ఉంటున్నారు.
అతడితో సూచనతోనే..
ఇక తన భార్యను ప్రపంచ స్ధాయి అథ్లెట్‌గా చూడాలని కలలు గన్న గజేంద్ర సింగ్.. వివాహం తర్వాత కీలక నిర్ణయం తీసుకున్నాడు. పెళ్లయిన రెండేళ్ల తర్వాత పారా అథ్లెట్ నారాయణ్ ఠాకూర్‌తో గజేంద్ర సింగ్, సిమ్రాన్ సమావేశమయ్యారు. మహిళల పారా విభాగంలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.
అయితే 2019లో మహిళల T13 కేటగిరీకి సంబంధించిన లైసెన్స్‌ని పొందేందుకు శర్మ వరల్డ్ పారా గ్రాండ్ ప్రిక్స్‌లో పోటీ పడింది. అయితే లైసెన్స్ పొందేందుకు వారికి పెద్ద మొత్తాన డబ్బులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో సిమ్రాన్ భర్త సింగ్ లోన్ తీసుకోవడంతో పాటు తన పేరిట ఉన్న స్ధలాన్ని విక్రయించాడు.
ఆ తర్వాత దుబాయ్‌లో జరిగే ప్రపంచ పారా ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించడానికి ముందు చైనాలో జరిగిన క్వాలిఫయర్స్‌లో ఆమె స్వర్ణం గెలుచుకుంది. కానీ దుబాయ్‌లో జరిగిన వరల్డ్ ఛాంపియన్ షిప్ 100 మీటర్ల T13 ఫైనల్‌లో ఆమె ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. ఆ తర్వాత షిమ్రాన్ తన కెరీర్‌లో ఉన్నో ఎత్తు పల్లాలను చవిచూస్తూ వరల్డ్ ఛాంపియన్‌గా అవతరించింది.
Comments
Please login to add a commentAdd a comment