Madhya Pradesh: Para Athlete Sachin Sahu Sells Ice Cream At Rewa - Sakshi
Sakshi News home page

Para Athlete Sachin: భారతీయులు గర్వపడేలా చేసిన సచిన్‌ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే..?

Published Fri, May 6 2022 9:19 AM | Last Updated on Fri, May 6 2022 1:41 PM

Para Athlete Sachin Sahu Sells Ice Cream At Rewa - Sakshi

దేశానికి పతకాలను అందించి భారతీయులను గర్వపడేలా చేసిన క్రీడాకారులు నేడు అత్యంత దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాల నుంచి కనీస సాయం కూడా అందకపోవడంతో వారు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. 

స్పెషల్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించిన సీతా సాహు సమోసాలు అమ్ముకుంటున్న ఘటనను మరవకముందే మరో వార్త అందరినీ ఆవేదనకు గురిచేస్తోంది. నేషనల్‌ చాంపియన్‌(పారా అథ్లెట్‌) సచిన్‌ సాహు.. జీవనోపాధి కోసం ఐస్‌క్రీమ్‌ బండి నడుపుకుంటున్నాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన సచిన్‌.. ఒడిశాలోని కళింగ స్టేడియంలో జరిగిన 20వ జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ 400 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం సాధించాడు. ఈ రేసును సచిన్‌ 1.17 సెకన్లలో పూర్తి చేసి రికార్డు క్రియేట్‌ చేశాడు. ఆ తర్వాత ప్రభుత్వం తనకు ఎలాంటి సాయం అందకపోవడంతో తాను ఇలా ఐస్‌క్రీమ్స్‌ అమ్ముకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. 

ఇదిలా ఉండగా.. సచిన్ 2015 నుండి 2019 వరకు క్రికెట్ ఆడాడు. కానీ, దివ్యాండైన కారణంగా క్రికెట్‌లో పెద్దగా రాణించలేకపోయాడు. అనంతరం.. గ్వాలియర్‌ అథ్లెటిక్స్‌ కోచ్‌ బీకే ధవన్‌ సాయంతో పారా అథ్లెట్‌గా మారాడు. అనంతరం కాంస్య పతకం సాధించాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement