bronze medalist winner
-
Asian Games 2023: కూలి పనులు చేసిన ఈ చేతులు కాంస్య పతకం అందుకున్నాయి
మనం కనే కలలకు మన ఆర్థికస్థాయి, హోదాతో పనిలేదు. సంకల్పబలం గట్టిగా ఉంటే మనల్ని విజేతలను చేస్తాయి. అందరిచేతా ‘శబ్భాష్’ అనిపించేలా చేస్తాయి. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రాంబాబు కూలి పనులు చేసేవాడు. ఆటల్లో తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలని కలలు కనేవాడు. నిజానికి అతడి కలలకు, అతడు చేసే కూలిపనులకు పొంతన కుదరదు. అయితే లక్ష్యం గట్టిగా ఉంటే విజయం మనవైపే చూస్తుంది. కూలిపనులు చేస్తూనే కష్టపడి తన కలను నిజం చేసుకున్నాడు. ఆసియా గేమ్స్‌లో 35 కిలోమీటర్ల రేస్‌వాక్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో కాంస్య పతకాన్ని గెలుచుకొని ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచాడు. ‘మాది పేదకుటుంబం. చాలా కష్టాలు పడ్డాను. మా అమ్మ నన్ను మంచి స్థాయిలో చూడాలనుకునేది. కాంస్య పతకం గెలచుకోవడంతో మా తలిదండ్రులు సంతోషంగా ఉన్నారు’ అంటున్నాడు రాంబాబు. రాంబాబు కూలిపనులు చేస్తున్న ఒకప్పటి వీడియోను ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ పర్వీన్ కాశ్వాన్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘అదృష్టం కష్టపడే వారి వైపే మొగ్గు చూపుతుంది అంటారు. అయితే రాంబాబుది అదృష్టం కాదు. కష్టానికి తగిన ఫలితం. లక్ష్య సాధనకు సంబంధించి సాకులు వెదుక్కునేవారికి ఈ వీడియో కనువిప్పు కలిగిస్తుంది’ అంటూ నెటిజనులు స్పందించారు. -
భారతీయులు గర్వపడేలా చేసిన సచిన్ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే..?
దేశానికి పతకాలను అందించి భారతీయులను గర్వపడేలా చేసిన క్రీడాకారులు నేడు అత్యంత దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాల నుంచి కనీస సాయం కూడా అందకపోవడంతో వారు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. స్పెషల్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించిన సీతా సాహు సమోసాలు అమ్ముకుంటున్న ఘటనను మరవకముందే మరో వార్త అందరినీ ఆవేదనకు గురిచేస్తోంది. నేషనల్ చాంపియన్(పారా అథ్లెట్) సచిన్ సాహు.. జీవనోపాధి కోసం ఐస్‌క్రీమ్ బండి నడుపుకుంటున్నాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన సచిన్.. ఒడిశాలోని కళింగ స్టేడియంలో జరిగిన 20వ జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 400 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం సాధించాడు. ఈ రేసును సచిన్ 1.17 సెకన్లలో పూర్తి చేసి రికార్డు క్రియేట్ చేశాడు. ఆ తర్వాత ప్రభుత్వం తనకు ఎలాంటి సాయం అందకపోవడంతో తాను ఇలా ఐస్‌క్రీమ్స్ అమ్ముకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదిలా ఉండగా.. సచిన్ 2015 నుండి 2019 వరకు క్రికెట్ ఆడాడు. కానీ, దివ్యాండైన కారణంగా క్రికెట్లో పెద్దగా రాణించలేకపోయాడు. అనంతరం.. గ్వాలియర్ అథ్లెటిక్స్ కోచ్ బీకే ధవన్ సాయంతో పారా అథ్లెట్‌గా మారాడు. అనంతరం కాంస్య పతకం సాధించాడు. Madhya Pradesh | Para-athlete Sachin Sahu sells ice cream in Rewa to make ends meet "Despite lack of facilities, I won a bronze medal in 400m race in 20th National Para-Athletics Championship. I appeal to the government to support me to play further," he said pic.twitter.com/bH53zzwdcf — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) May 6, 2022 -
రిటైర్మెంట్ ఆలోచన వచ్చింది
- కానీ లక్ష్యాలు మిగిలే ఉన్నాయి - మేరీకామ్ వ్యాఖ్య న్యూఢిల్లీ: బాక్సింగ్‌కు ఇక గుడ్‌బై చెప్పాలన్న ఆలోచన కలుగుతోందని భారత మహిళా బాక్సర్, లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత మేరీ కామ్ తెలిపింది. ఏడాది కాలంగా బాక్సింగ్‌కు దూరంగా ఉండి మూడో బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం కామన్వెల్త్ క్రీడల కోసం ఆమె తిరిగి ప్రాక్టీస్ ప్రారంభించింది. ఈ సందర్భంగా మేరీ కామ్ మాట్లాడుతూ, ‘రిటైర్మెంట్ ఆలోచన చాలాసార్లు వచ్చింది. కానీ, సాధించాల్సిన లక్ష్యాలు ఇంకా ఉన్నాయి. ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడమే ప్రధాన లక్ష్యం’ అని వివరించింది. 2008లో తొలిసారి తల్లి అయ్యేందుకు బాక్సింగ్ నుంచి విరామం తీసుకున్న మేరీ కామ్ ఆ తరువాత రింగ్‌లోకి అడుగు పెడుతూనే ప్రపంచ టైటిల్‌ను గెలుచుకుంది. తాజా విరామంతో కూడా తనకు ఎటువంటి ఇబ్బంది తలెత్తదని, నెల రోజుల క్రితమే ప్రాక్టీస్ మొదలుపెట్టానని ఆమె పేర్కొంది.