ప్యారిస్ వేదికగా జరిగిన పారాలింపిక్స్‌లో భారత హై జంపర్ నిషాద్ కుమార్ సత్తాచాటిన సంగతి తెలిసిందే. ఈ విశ్వక్రీడల్లో నిషాద్ రజత పతకంతో మెరిశాడు. పురుషుల హై జంప్ T47 విభాగంలో నిషద్ కూమార్ సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నాడు. ఫైనల్స్‌లో నిషిద్ కూమార్ 2.06 మీటర్లు ఎత్తు ఎగిరి రెండో స్థానంలో నిలిచి.. రెండో పారాలింపిక్స్ మెడల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
నిషాద్ సూపర్ డ్యాన్స్..
ఇక పారాలింపిక్స్ ముగిసిన తర్వాత నిషాద్ తనలోని మరో కోణాన్ని చూపించాడు. ప్యారిస్ వీధుల్లో డ్యాన్స్ చేస్తూ సందడి చేశాడు. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన నిషాద్ అద్బుతంగా డ్యాన్స్ చేస్తూ.. తన మెడల్ విన్నింగ్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా నిషాద్ తన ఆరేళ్ల వయస్సులోనే ఓ ప్రమాదంలో తన చేతిని కోల్పోయాడు. అయినప్పటకి తన పట్టుదలతో విశ్వవేదికపై సత్తాచాటుతున్నాడు. టోక్యో ఒలింపిక్స్‌లో సైతం అతడు సిల్వర్ మెడల్ సాధించాడు.
Paralympics Silver Medalist Nishad Kumar amazing dance moves at Paris 🕺🗼
Nishad is totally enjoying it 🤩pic.twitter.com/EkND79OoBk— The Khel India (@TheKhelIndia) September 9, 2024
Comments
Please login to add a commentAdd a comment