
న్యూఢిల్లీ: టోక్యో పారా ఒలింపిక్స్‌కు భారత బృందం పయనమైంది. 54 మందితో టోక్యోకు భారత బృందం బయల్దేరింది. ఆటగాళ్లకు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వీడ్కోలు పలికారు. పారా ఒలింపిక్స్‌లో 9 క్రీడాంశాల్లో భారత ఆటగాళ్లు పోటీపడనున్నారు. ఈనెల 27న ఆర్చరీతో భారత్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి.
కాగా రియో పారా ఒలింపిక్స్ 2016లో చైనా 105 స్వర్ణాలు, 81 రజతాలు, 51 కాంస్యాలు కలిపి మొత్తంగా 237 పతకాలు సాధించింది. ఇక బ్రిటన్ 64, ఉక్రెయిన్ 41, అమెరికా 40 స్వర్ణాలు సాధించాయి. బ్రెజిల్ 14 బంగారం పతకాలు సాధించి ఎనిమిదో స్థానంలో నిలువగా.. భారత్ రెండు స్వర్ణాలు, ఒక రజతం, కాంస్యం సాధించి 42వ స్థానంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment