Tokyo Paralympics 2021
-
భళా భవీనా: పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకం ఖాయం
టోక్యో: టోక్యో వేదికగా జరుగుతన్న పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకం ఖాయమైంది. భారత ప్యాడ్లర్ భవీనా పటేల్ సంచలనం సృష్టించింది. టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ క్లాస్-4 విభాగంలో సెమీ ఫైనల్లో అడుగు పెట్టింది. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్‌గా రికార్డులకెక్కింది. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్ 2, రియో పారా ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అయిన సెర్బియాకు చెందిన రాంకోవిక్‌తో జరిగిన పోరులో ఘన విజయం సాధించి సెమీస్‌లోకి దూసుకెళ్లింది. ప్రత్యర్థి రాంకోవిక్‌ను 18 నిమిషాల్లోనే 11-5, 11-6, 11-7 వరుస సెట్లలో ఓడించింది. కాగా శనివారం జరిగే సెమీ ఫైనల్స్‌లో ఆమె చైనాకు చెందిన జాంగ్ మియావోతో తలపడుతుంది. కాంస్యం కోసం ప్లే ఆఫ్ లేకపోవడంతో భవీనాకు పతకం ఖాయమైంది. ఓడిపోయిన సెమీ-ఫైనలిస్టులు ఇద్దరూ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంటారు. చదవండి: IND Vs ENG 3rd Test Day 3: తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా.. కేఎల్ రాహుల్(8) ఔట్ ⭐1st Indian to secure a #ParaTableTennis medal ⭐Lost her opening match and then won 3 in a row. ⭐In her quarter final match, she trailed just once. Take a bow, @BhavinaPatel6 🔥 Stay tuned for her semi-final tomorrow! ⌛#Paralympics #Tokyo2020 pic.twitter.com/1gyRX7cHOj — #Tokyo2020 for India (@Tokyo2020hi) August 27, 2021 -
Tokyo Paralympics 2021: ‘మాకూ రెక్కలున్నాయి...’
టోక్యోలో నెల రోజుల వ్యవధిలో మరో ప్రారంభోత్సవ కార్యక్రమం అదరగొట్టింది... ప్రధాన ఒలింపిక్స్‌కు ఏమాత్రం తగ్గని రీతిలో పారాలింపిక్స్ వేడుకలను కూడా నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పైకి ఎగసేందుకు ప్రయత్నించే దివ్యాంగ క్రీడాకారుల ఆశలను ప్రతిబింబించేలా ‘మాకూ రెక్కలున్నాయి’ అనే నేపథ్యంతో సాగిన ఈ ఉత్సవం ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులందరి మనసులూ దోచుకుంది. టోక్యో: కరోనా సమస్యలను దాటి ఒలింపిక్స్‌ను విజయవంతంగా నిర్వహించిన జపాన్ ఇప్పుడు పారాలింపిక్స్‌ను అంతే స్థాయిలో అద్భుతంగా జరిపేందుకు సిద్ధమైంది. మంగళవారం జరిగిన ప్రారంభోత్సవ వేడుకలు అందుకు నిదర్శనం. మొదటినుంచి చివరి వరకు స్టేడియాన్ని రంగులమయంగా మారుస్తూ జరిపిన ప్రదర్శనలు జపాన్ కళలు, సంస్కృతిని చూపించడంతో పాటు పారాలింపిక్స్ అథ్లెట్ల పట్టుదలను దృశ్య రూపంలో ఆవిష్కరించాయి. బుధవారంనుంచి ప్రధాన పోటీలు ప్రారంభం కానుండగా... సెప్టెంబర్ 5 వరకు ఈ క్రీడలు జరుగుతాయి. ముగ్గురు జ్యోతిని వెలిగించగా... స్టేడియంలో ప్రేక్షకులకు అనుమతి లేకపోయినా పోటీల్లో పాల్గొంటున్న అథ్లెట్లలో మెగా ఈవెంట్ భావోద్వేగం కనిపించింది. గత ఏడాది కాలంగా కోవిడ్ విఘ్నాలను అధిగమించి 4,403 మంది ఆటగాళ్లు ఎదురు చూసి క్షణం రానే వచ్చింది. ముందుగా జపాన్ జాతీయ పతాకం మైదానంలోకి తీసుకు రావడంతో కార్యక్రమం మొదలైంది. దీనిని తెచ్చిన వారిలో ఆటగాళ్లతో పాటు టోక్యో అగ్నిమాపక విభాగానికి చెందిన కార్మికుడికి కూడా అవకాశం కల్పించడం విశేషం. ‘ఆప్టిక్ నెర్వ్ హైపోప్లాసియా’తో బాధపడుతూ పూర్తి అంధురాలిగా మారిన సటో హిరారి జపాన్ జాతీయ గీతం ఆలపించినప్పుడు స్టేడియంలోనివారంతా జేజేలు పలికారు. ఆ తర్వాత ‘పారా ఎయిర్పోర్ట్’ పేరుతో సాగిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. పెద్ద సంఖ్యలో శారీరక లోపాలు ఉన్నవారిని ఎందరినో ఈ రూపకంలో భాగం చేశారు. అనంతరం నృత్య, విభిన్న సంగీత ప్రదర్శనలు జరిగాయి. అయితే అన్నింటికి మించి హైలైట్‌గా నిలిచిన అంశం ‘వన్ వింగ్డ్ ప్లేన్’. చక్రాల కుర్చీలో కూర్చున్న అమ్మాయి ఒకటే రెక్క ఉన్న విమానంలో ఎగురుకుంటూ వచ్చి తాను అందరిలాగే ఎగరాలనే కోరికను కనబర్చే అంశానికి చప్పట్లు మార్మోగాయి. మార్చ్‌పాస్ట్‌లో మొత్తం 162 జట్లకు చెందిన బృందాలు పాల్గొనగా రెఫ్యూజీ పారాలింపిక్ టీమ్ అందరికంటే ముందుగా నడిచింది. తాలిబన్ల కారణంగా తమ దేశంలో ఎదురైన అనూహ్య పరిస్థితుల నేపథ్యంలో అఫ్గానిస్తాన్ జట్టు చివరి నిమిషంలో పోటీలనుంచి తప్పుకుంది. అయితే వారికి సంఘీభావంగా ఒలింపిక్ కమిటీ తమ వాలంటీర్ ద్వారా మార్చ్‌పాస్ట్‌లో అఫ్గాన్ జాతీయ జెండాను కూడా ప్రదర్శించింది. ముగ్గురు జపాన్ పారా అథ్లెట్లు యు కమిజి, షున్‌షుకె ఉచిదా, కరిన్ మరిసకి సంయుక్తంగా ఒలింపిక్ జ్యోతిని వెలిగించడంతో అధికారికంగా పోటీలు ప్రారంభమయ్యాయి. అఫ్గాన్ జెండాతో... ఫ్లాగ్ బేరర్‌గా టెక్ చంద్... భారత జట్టు మార్చ్‌పాస్ట్‌కు సంబంధించి అనూహ్య మార్పు చోటు చేసుకుంది. ఫ్లాగ్ బేరర్‌గా ప్రకటించిన రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత మరియప్పన్ తంగవేలు చివరి నిమిషంలో తప్పుకున్నాడు. టోక్యోకు మరియప్పన్‌తో కలిసి ప్రయాణించిన విదేశీ ఆటగాడు ఒకడు కరోనా పాజిటివ్‌గా తేలడమే అందుకు కారణం. ముందు జాగ్రత్తగా తంగవేలును పక్కన పెట్టాలని నిర్వాహకులు భారత జట్టుకు సమాచారం అందించారు. దాంతో షాట్‌పుట్‌లో పోటీ పడుతున్న టెక్ చంద్ ఫ్లాగ్ బేరర్‌గా ముందుకు సాగాడు. మొత్తంగా భారత బృందంనుంచి 9 మంది మార్చ్‌పాస్ట్‌లో పాల్గొన్నారు. పారాలింపిక్స్‌లో నేడు (భారత్) మహిళల సింగిల్స్ టేబుల్ టెన్నిస్: సోనల్ బెన్ పటేల్ – క్లాస్ 3 (ఉ.గం.7.30), భావినా బెన్ పటేల్ – క్లాస్ 4 (ఉ.గం.8.50) -
చిన్న వయసులో పారా ఒలింపిక్స్‌కు హాజరైన మహిళా అథ్లెట్..!
కషిష్ లక్రాకు 18 ఏళ్లు. తన కాళ్ల మీద తాను నిలబడలేదు. కాని రెండు చేతుల్లో బలంగా దేశ పతాకాన్ని రెపరెపలాడించాలని పట్టుదలగా ఉంది. మంగళవారం నుంచి మొదలైన టోక్యో పారా ఒలింపిక్స్‌లో దేశం నుంచి హాజరవుతున్న అతి చిన్న వయసు అధ్లెట్ లక్రా 14 ఏళ్ల వయసులో డాక్టర్లు ఇక నువ్వు జీవితాంతం బెడ్ మీద ఉండాలి అని చెప్తే విధిని సవాలు చేసి నేడు దేశానికి ప్రతినిధిగా ఎదిగింది. చిన్న చిన్న సమస్యలకు కుంగిపోయే వారికి అతి పెద్ద స్ఫూర్తి లక్రా. టోక్యోలో జరుగుతున్న పారా ఒలింపిక్స్ (దివ్యాంగుల ఒలింపిక్స్)లో భారత్ నుంచి 54 మంది క్రీడాకారులు హాజరవుతున్నారు. ఇది గతంతో పోలిస్తే పెద్ద సంఖ్య. ఈ మొత్తం 54 మందిలో అందరి కంటే చిన్నది కషిష్ లక్రా. 18 ఏళ్ల వయసులో పారా ఒలింపిక్స్‌కు హాజరైన మహిళా అథ్లెట్‌గా ఆమె రికార్డు స్థాపించినట్టే. క్లబ్‌త్రోలో ఆమె పాల్గొననుంది. క్లబ్ అంటే 40 సెం.మీల కొయ్యగూటం. దానిని విసరాలి. ఎఫ్ 51 విభాగం (చేతికి ఉండే లోపం స్థాయిని బట్టి చేసే విభాగం) లో ఆమె పాల్గొననుంది. ‘నేను కచ్చితంగా నా దేశానికి పతకం తెస్తాను’ అని కషిష్ అంది. ఢిల్లీ అమ్మాయి ఢిల్లీలో అందరిలాంటి అమ్మాయే కషిష్. చిన్నప్పటి నుంచి ఆటలంటే ఇష్టం. మూడో క్లాసులోనే స్కేటింగ్ మొదలెట్టింది. ఆ తర్వాత బాడ్మింటన్ ఆడాలని అనుకుంది. కాని దాని కోచింగ్ కోసం డబ్బు ఖర్చు అవుతుందని ఆ స్తోమత లేక రెజ్లర్‌గా మారింది. ఏడో క్లాసులో జూనియర్ రెజ్లర్‌గా ఢిల్లీలో శిక్షణ మొదలెట్టింది. చిన్నప్పటి నుంచి బలశాలి అయినందువల్ల రెజ్లర్‌గా రాణించి ‘ఖేలో ఇండియా’ యూత్ గేమ్స్‌కు ఎంపికైంది. 2018 జనవరిలో ఆ గేమ్స్ జరగనున్నాయి. వాటి కోసం 2017 నవంబర్‌లో నజఫ్‌గడ్‌లోని గవర్నమెంట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో కుస్తీ ప్రాక్టీసు చేస్తున్న 14 ఏళ్ల కషిష్ పట్టు జారి పడిపోయింది. వెన్నుపూసకు బలమైన గాయాలయ్యాయి. స్పృహ తప్పిపోయింది. కొన్నాళ్ల తర్వాత స్పృహలోకి వచ్చిన కషిష్కు తన మెడకూ మిగిలిన శరీరానికి ఏ సంబంధమూ లేదని అర్థమైంది. మెడ దిగువ భాగమంతా చలనం కోల్పోయింది. ఎంతో భవిష్యత్తును కలగన్న ఆ టీనేజ్ బాలిక బెంబేలెత్తి పోయింది. తన బతుక్కు ఇక ఏ అర్థమూ లేదని అనుకుంది. దానికి తోడు డాక్టర్లు ఆమె తల్లిదండ్రులతో ‘చనిపోయే అవకాశమే ఎక్కువ’ అన్నారు. అంతే కాదు ఒకవేళ బతికినా జీవితాంతం మంచం మీదే ఉండాలన్నారు. కాని కషిష్, ఆమె తల్లిదండ్రులు, ముఖ్యంగా అమ్మమ్మ, తాతయ్య ఈ సవాలును దాటాలని గట్టిగా అనుకున్నాను. దాటారు కూడా. ఫిజియోథెరపీ మూడు–నాలుగు నెలలు కషిష్ ఫిజియోథెరపీ కోసం అంతులేని సంకల్పబలంతో సహకారం అందించింది. ఫిజియోథెరపిస్ట్ ఆమెలో ఆత్మవిశ్వాసం నింపాడు. మంచానికే పరిమితం అని చెప్పిన డాక్టర్ల అంచనాలకు విరుద్ధంగా ఆమె లేచి కూచోగల్గింది. వీల్‌చైర్‌లో కదిలే శక్తి పొందింది. ఒక్కసారి వీల్‌చైర్‌లో కూచున్నాక ‘నేను చదువుకుంటా’ అని కషిష్ అంది. ఏ స్కూల్లో అయితే అంతవరకూ చదువుతూ ఉందో ఆ స్కూల్ వాళ్లు ‘మేము చేర్చుకోము’ అన్నారు. అది పెద్ద దెబ్బ. ఆ తర్వాత షాలీమార్ బాగ్‌లోని మోడరన్ పబ్లిక్ స్కూల్ ఆమెకు అడ్మిషన్ ఇవ్వడమే కాదు ఆమె క్రీడాసక్తిని కూడా ప్రోత్సహించింది. ద్రోణాచార్య అవార్డు గ్రహీత సత్యపాల్ సింగ్ ఆమెకు కోచ్‌గా ఉండటానికి ముందుకు వచ్చాడు. క్లబ్ త్రోలో శిక్షణ ఇచ్చాడు. వ్యాయామం పట్ల ఆసక్తి ఉన్న కషిష్ తన సోదరుడితో కలిసి వ్యాయామం చేస్తూ దారుఢ్యాన్ని పెంచుకోవడమే కాదు, శక్తి కొద్దీ క్లబ్‌ను విసరడానికి శిక్షణ తీసుకుంది. జైత్రయాత్ర ఆ తర్వాత కషిష్ ఆగలేదు. స్టేట్ లెవల్లో గోల్డ్ మెడల్ సాధించింది. నేషనల్ లెవల్లో గోల్డ్, సిల్వర్ పతకాలు సొంతం చేసుకుంది. స్విట్జర్లాండ్‌లో జరిగిన జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ గెలిచింది. 2019లో దుబయ్‌లో జరిగిన సీనియర్ ఛాంపియన్ షిప్లో ఐదో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం క్లబ్ త్రోలో ప్రపంచ ర్యాంకులో 8వ స్థానంలో ఉంది కషిష్. అందుకే భారత ప్రభుత్వం ఆమెను టోక్యోకు ఎంపిక చేసింది. ‘ఒకప్పుడు కదల్లేను అనుకున్నాను. ఇవాళ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నాను. నా స్వప్నం సత్యమైంది’ అంది కషిష్. ‘మా అమ్మ నా వెంట నీడలా ఉండి ఈ విజయాలు సాధించేలా చేసింది. నా కోచ్‌లు నాకు ఎంతో మద్దతుగా నిలిచారు. వారు లేకుంటే నేను లేను’ అంటుంది కషిష్. బహుశా రెండు మూడు రోజుల్లో మనం కషిష్ గురించి మంచి వార్త వింటామనే ఆశిద్దాం. ఆల్ ద బెస్ట్ కషిష్. -
పారాలింపిక్స్ వేడుకలు ప్రారంభం..
టోక్యో: మరో విశ్వ క్రీడా సంగ్రామానికి తెరలేచింది. టోక్యో వేదికగా మంగళవారం పారాలింపిక్స్ క్రీడలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పారాలింపిక్స్ ప్రారంభ వేడుకలకు జపాన్ చక్రవర్తి నరుహిటో, ప్రధాని సుగా హాజరయ్యారు. ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 5 వరకు 13 రోజుల పాటు జరిగే పారా విశ్వక్రీడల్లో 163 దేశాలకు చెందిన సుమారు 4500 మంది పారా అథ్లెట్లు పాల్గొననున్నారు. 22 క్రీడలకు సంబంధించి 540 ఈవెంట్లలో పోటీలు జరగనున్నాయి. పతకాలే లక్ష్యంగా భారత్ నుంచి 54 మంది పారా అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. ఈ ప్రారంభోత్సవంలో భారత త్రివర్ణ పతాకాన్ని జావెలిన్ త్రోయర్ టెక్ చంద్ చేతబూని మన దేశ బృందాన్ని నడిపించాడు. Best of luck India! I am sure our #Paralympics contingent will give their best and inspire others. pic.twitter.com/XEXXp4EzFc — Narendra Modi (@narendramodi) August 24, 2021 Good luck to Team India for the #Tokyo2020 #Paralympics You are an inspiration to the entire nation! The best wishes of 1.3 billion Indians are with you... I am certain that you will make India proud. pic.twitter.com/3GdfzmIsbC — Vice President of India (@VPSecretariat) August 24, 2021 -
నేటినుంచి టోక్యోలో మళ్లీ క్రీడా సంబరం
టోక్యో ఒలింపిక్స్ భారత్‌కు తొలిరోజు నుంచే పతకాన్ని, సంతోషాన్ని పంచింది. అలాగే పారాలింపిక్స్ కూడా ఈ సంతోషాన్ని, పతకాలను రెట్టింపు చేయాలని భారత పారాఅథ్లెట్ల బృందం గంపెడాశలతో బరిలోకి దిగుతోంది. స్టార్ జావెలిన్ త్రోయర్ దేవేంద్ర ఝఝారియా, హైజంపర్ మరియప్పన్ తంగవేలు రియో పారాలింపిక్స్‌కు రీప్లే చూపాలనే పట్టుదలతో ఉన్నారు. ఈసారి పదికిపైగా పతకాలు సాధించాలని, స్వర్ణాల వేట కూడా పెరగాలని భారత బృందం లక్ష్యంగా పెట్టుకుంది. టోక్యో: మరో విశ్వ క్రీడా వేడుకకు టోక్యో సిద్ధమైంది. రెగ్యులర్ ఒలింపిక్స్‌కు దీటుగా పారాలింపిక్స్‌ను నిర్వహించేందుకు సై అంటున్న జపాన్, మంగళవారం అట్టహాసంగా ఆరంభ సంబరాలు నిర్వహించనుంది. అనంతరం పారాథ్లెట్ల పోరాటం మొదలవనుంది. కరోనా మహమ్మారిని ఓ కంట కనిపెడుతూనే ఈ మెగా ఈవెంట్‌ను కూడా విజయవంతంగా నిర్వహించాలని టోక్యో ఆర్గనైజింగ్ కమిటీ పగలురేయి శ్రమిస్తోంది. ప్రేక్షకులను ఈ పోటీలకు కూడా అనుమతించడం లేదు. క్రమం తప్పని కోవిడ్ టెస్టులు, ప్రొటోకాల్ తదితర పకడ్బంది చర్యలతో పోటీలు నిర్వహిస్తారు. చదవండి: Miguel Oliveira: సవతి సోదరితో నెల రోజుల కిందట పెళ్లి.. త్వరలోనే.. ఎవరికెవరూ తీసిపోరు... పారాలింపియన్ల పట్టుదల ముందు వైకల్యం ఎప్పుడూ ఓడిపోతూనే ఉంది. పారాలింపిక్ దిగ్గజం, బ్రెజిల్ స్విమ్మర్ డానియెల్ డియాస్ వరుసగా నాలుగో మెగా ఈవెంట్లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. 24 పతకాలు గెలుచుకున్న డానియెల్ ఈ సారి ఆ సంఖ్యను 30కి చేర్చుతాడనే అంచనాలున్నాయి. అమెరికా మహిళా స్విమ్మర్లు జెస్సికా లాంగ్, మెకెంజీ కోన్లు కూడా టోక్యో కొలనులో రియో టైటిళ్లను నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. జర్మనీ లాంగ్‌జంపర్, మార్కస్ రెమ్, ఇరాన్ ఆర్చర్ జహ్రా నెమటి, బ్రిటన్ వీల్‌చైర్ టెన్నిస్ ప్లేయర్ జోర్డాన్ విలీ, జపాన్ పారాథ్లెట్ సాటో తొమకి తదితర స్టార్లతో టోక్యో వేదిక మురిసిపోనుంది. ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 5 వరకు 13 రోజుల పాటు జరిగే పారా విశ్వక్రీడల్లో 163 దేశాలకు చెందిన సుమారు 4500 మంది అథ్లెట్లు పాల్గొననున్నారు. 22 క్రీడలకు సంబంధించి 540 ఈవెంట్లలో పోటీలు నిర్వహిస్తారు. తంగవేలు పతాకధారి ఐదుగురు అథ్లెట్లు, ఆరు మంది అధికారులు మొత్తం 11 మందితో కూడిన భారత జట్టు మార్చ్‌పాస్ట్‌లో పాల్గొంటుంది. పతాకధారి మరియప్పన్ తంగవేలు మన జట్టును ముందుండి నడిపించనున్నాడు. ఇరాన్ తర్వాత 17వ దేశంగా భారత్ స్టేడియంలోకి అడుగుపెట్టనుంది. పారాలింపిక్స్ మార్చ్‌పాస్ట్‌లో అథ్లెట్లకు పరిమితులేమీ లేవు. అయితే టోక్యోకు భారత్ నుంచి ఇప్పటివరకు కేవలం ఏడుగురు అథ్లెట్లు మాత్రమే వచ్చారు. ఇందులో ఇద్దరు టేబుల్ టెన్నిస్ ప్లేయర్లు సోనల్ పటేల్, భవిన పటేల్‌లకు మరుసటి రోజు (బుధవారం) పోటీలున్నాయి. దీంతో వారిని మినహాయించి ఐదుగురు అథ్లెట్లకు జతగా ఆరుగురు అధికారులు మార్చ్‌పాస్ట్ చేస్తారని భారత పారాలిం పిక్ కమిటీ కార్యదర్శి, చెఫ్ డి మిషన్ గుర్శరణ్ చెప్పా రు. మువ్వన్నెల పతాకధారి మరియప్పన్ తంగవేలుతో పాటు వినోద్ కుమార్ (డిస్కస్ త్రో), టెక్ చంద్ (జావెలిన్ త్రో), జైదీప్, సకీనా ఖాతూన్ (పవర్ లిఫ్టర్లు)లు ప్రారంభోత్సవంలో కవాతు చేయనున్నారు. చదవండి: హాకీ ఆటగాళ్లకు అరుదైన గౌరవం అఫ్గాన్ జెండా రెపరెపలు అఫ్గానిస్తాన్‌లో పౌర ప్రభుత్వం కూలి... తాలిబన్ల తుపాకి రాజ్యం నడుస్తోంది. అక్కడి భీతావహ పరిస్థితులు, పౌర విమాన సేవలు లేక ఆ దేశ అథ్లెట్లు ఎవరూ పారాలింపిక్స్‌లో పాల్గొనడం లేదు. అయినాసరే వారి జాతీయ పతాకం మాత్రం రెపరెపలాడుతుందని అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ చీఫ్ అండ్రూ పార్సన్స్ స్పష్టం చేశారు. సంఘీభావానికి సంకేతంగా అఫ్గాన్ జాతీయ జెండా ప్రారంభవేడుకల్లో ఎగురుతుందని చెప్పారు. ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రతినిధి అఫ్గాన్ పతాకాధారిగా మార్చ్‌పాస్ట్‌లో పాల్గొంటారని పార్సన్స్ తెలిపారు. -
5 స్వర్ణాలు సహా కనీసం 15 పతకాలు గెలుస్తాం..
న్యూఢిల్లీ: టోక్యో వేదికగా జరగనున్న పారా ఒలింపిక్స్‌లో భారత్ బృందం 5 స్వర్ణాలు సహా కనీసం 15 పతకాలు గెలుస్తుందని భారత పారా ఒలింపిక్స్ కమిటీ సెక్రటరీ జనరల్ గరుశరణ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత భారత అథ్లెట్ల బృందం అత్యుత్తమమైందని, పారా ఒలింపిక్స్ చరిత్రలో భారత్ ఎన్నడూ సాధించని పతకాలు ఈ పారా ఒలింపిక్స్‌లో సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రియో పారా ఒలింపిక్స్ తర్వాత అథ్లెట్లంతా అంతర్జాతీయ టోర్నీల్లో రాణించారని, త్వరలో ప్రారంభంకాబోయే పారా ఒలింపిక్స్‌లో సత్తా చాటేందుకు వారంతా ఉవ్విళ్లూరుతున్నారని, ఇదే తమ ధీమాకు కారణమని వెల్లడించారు. అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, షూటింగ్, ఆర్చరీ విభాగాల్లో భారత్ కచ్చితంగా పతకాలు సాధిస్తుందని, పారా హైజంప్‌లో భారత పతాకధారి మరియప్పన్ తంగవేలు మరోసారి పసిడి ముద్దాడుతాడని గురుశరణ్ ధీమా వ్యక్తం చేశారు. కాగా, టోక్యో పారా ఒలింపిక్స్‌లో భారత్ 54 మందితో కూడిన జంబో బృందాన్ని బరిలోకి దించుతోంది. ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, కెనోయింగ్, షూటింగ్, స్విమ్మింగ్, పవర్‌లిఫ్టింగ్, టేబుల్ టెన్నిస్, తైక్వాండో తదితర క్రీడల్లో వీరంతా పోటీ పడనున్నారు. భారత్ ఇప్పటి వరకు 11 పారా ఒలింపిక్స్ క్రీడల్లో కేవలం 12 పతకాలే సాధించగా, గడిచిన 2016 రియో పారా ఒలింపిక్స్‌లో 2 స్వర్ణాలు, ఓ రజతం, మరో కాంస్యం సహా మొత్తం నాలుగు పతకాలు గెలవడం గమనార్హం. చదవండి: కివీస్ క్రికెటర్లను భయపెడుతున్న తాలిబన్లు.. పాక్ పర్యటనపై నీలినీడలు -
పోరాడండి.. పతకాలు వాటంతటవే వస్తాయి: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఈ నెల 24 నుంచి సెప్టెంబర్ 5 వరకు టోక్యో వేదికగా జరుగనున్న పారా ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు ఒత్తిడికి గురికాకుండా పోరాడాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అథ్లెట్లు పతకాల గురించి ఆలోచించకుండా శక్తి మేరకు పోరాడాలని, పతకాలు వాటంతటవే వస్తాయని ఆయన సూచించారు. పారా అథ్లెట్లు జపాన్‌లో మరోసారి సత్తా చాటాలని ప్రధాని ఆకాంక్షించారు. మీరంతా అత్యుత్తమ నైపుణ్యం కలిగిన అథ్లెట్లంటూ కితాబునిచ్చారు. పారా ఒలింపిక్స్‌లో పాల్గొననున్న అథ్లెట్లతో ఆయన మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. సమావేశంలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని అథ్లెట్లలో స్పూర్తి నింపారు. పారా ఒలింపిక్స్ కోసం భారత్ నుంచి 54 మంది అథ్లెట్ల బృందం త్వరలో జపాన్ బయలుదేరనుంది. అయితే పారా ఒలింపిక్స్‌లో భారత్ నుంచి ఇంత పెద్ద మొత్తంలో క్రీడాకారులు పాల్గొనడం ఇదే మొదటిసారి. 2016 రియో పారా ఒలింపిక్స్‌లో భారత్ 2 స్వర్ణ పతకాలు, ఓ రజతం, మరో కాంస్యం సహా మొత్తం నాలుగు పతకాలు సాధించింది. చదవండి: నీరజ్ చోప్రాకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు -
టోక్యోకు వెళుతున్న పారా ఒలంపియన్స్ కు ప్రధాని పిలుపు
-
పారాలింపిక్స్ క్రీడాకారులతో ప్రధాని మోదీ వర్చువల్ మీటింగ్
న్యూఢిల్లీ: పారాలింపిక్స్‌లో పాల్గొనే భారత క్రీడాకారులతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడనున్నారు. ఎల్లుండి(మంగళవారం) ఉదయం 11 గంటలకు వర్చువల్ సమావేశంలో ప్రధాని మోదీ వారితో ముచ్చటించనున్నారు. కాగా టోక్యో పారాలింపిక్స్‌లో 54 మంది పారా అథ్లెట్లు పాల్గొననున్నారు. పారాలింపిక్స్ క్రీడల్లో భారత్ తరపున పాల్గొననున్న అతిపెద్ద బృందం ఇదే కావడం విశేషం. భారత్ తరపున 9 క్రీడా విభాగాల్లో పారా అథ్లెట్లు పాల్గొననున్నారు. -
టోక్యో పారా ఒలింపిక్స్‌కు పయనమైన భారత బృందం
న్యూఢిల్లీ: టోక్యో పారా ఒలింపిక్స్‌కు భారత బృందం పయనమైంది. 54 మందితో టోక్యోకు భారత బృందం బయల్దేరింది. ఆటగాళ్లకు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వీడ్కోలు పలికారు. పారా ఒలింపిక్స్‌లో 9 క్రీడాంశాల్లో భారత ఆటగాళ్లు పోటీపడనున్నారు. ఈనెల 27న ఆర్చరీతో భారత్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. కాగా రియో పారా ఒలింపిక్స్ 2016లో చైనా 105 స్వర్ణాలు, 81 రజతాలు, 51 కాంస్యాలు కలిపి మొత్తంగా 237 పతకాలు సాధించింది. ఇక బ్రిటన్ 64, ఉక్రెయిన్ 41, అమెరికా 40 స్వర్ణాలు సాధించాయి. బ్రెజిల్ 14 బంగారం పతకాలు సాధించి ఎనిమిదో స్థానంలో నిలువగా.. భారత్ రెండు స్వర్ణాలు, ఒక రజతం, కాంస్యం సాధించి 42వ స్థానంలో నిలిచింది.