
న్యూఢిల్లీ: పారాలింపిక్స్‌లో పాల్గొనే భారత క్రీడాకారులతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడనున్నారు. ఎల్లుండి(మంగళవారం) ఉదయం 11 గంటలకు వర్చువల్ సమావేశంలో ప్రధాని మోదీ వారితో ముచ్చటించనున్నారు. కాగా టోక్యో పారాలింపిక్స్‌లో 54 మంది పారా అథ్లెట్లు పాల్గొననున్నారు. పారాలింపిక్స్ క్రీడల్లో భారత్ తరపున పాల్గొననున్న అతిపెద్ద బృందం ఇదే కావడం విశేషం. భారత్ తరపున 9 క్రీడా విభాగాల్లో పారా అథ్లెట్లు పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment