టోక్యో: మరో విశ్వ క్రీడా సంగ్రామానికి తెరలేచింది. టోక్యో వేదికగా మంగళవారం పారాలింపిక్స్ క్రీడలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పారాలింపిక్స్ ప్రారంభ వేడుకలకు జపాన్ చక్రవర్తి నరుహిటో, ప్రధాని సుగా హాజరయ్యారు. ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 5 వరకు 13 రోజుల పాటు జరిగే పారా విశ్వక్రీడల్లో 163 దేశాలకు చెందిన సుమారు 4500 మంది పారా అథ్లెట్లు పాల్గొననున్నారు.
22 క్రీడలకు సంబంధించి 540 ఈవెంట్లలో పోటీలు జరగనున్నాయి. పతకాలే లక్ష్యంగా భారత్ నుంచి 54 మంది పారా అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. ఈ ప్రారంభోత్సవంలో భారత త్రివర్ణ పతాకాన్ని జావెలిన్ త్రోయర్ టెక్ చంద్ చేతబూని మన దేశ బృందాన్ని నడిపించాడు.
Best of luck India!
— Narendra Modi (@narendramodi) August 24, 2021
I am sure our #Paralympics contingent will give their best and inspire others. pic.twitter.com/XEXXp4EzFc
Good luck to Team India for the #Tokyo2020 #Paralympics
— Vice President of India (@VPSecretariat) August 24, 2021
You are an inspiration to the entire nation!
The best wishes of 1.3 billion Indians are with you... I am certain that you will make India proud. pic.twitter.com/3GdfzmIsbC
Comments
Please login to add a commentAdd a comment