Send off
-
Delhi: కేంద్ర కేబినెట్ చివరి భేటీ నేడు
సాక్షి,ఢిల్లీ: ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ భేటీ ఆదివారం(మార్చ్ 3) జరగనుంది. పార్లమెంట్ ఎన్నికలకు త్వరలో షెడ్యూల్ విడుదలవనుండడంతో ఈ ప్రభుత్వంలో ఇదే చివరి కేబినెట్ సమావేశం కానుంది. ఈ భేటీలో కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ వీడ్కోలు పలకనున్నారు. వారికి ప్రధాని వీడ్కోలు పార్టీ ఇవ్వనున్నారు. మూడవసారి పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు అమలు చేయాల్సిన వ్యూహాలు, ప్రణాళికలపై ఈ సమావేశంలో ప్రధాని మంత్రులతో చర్చించే అవకాశాలున్నాయి. ఢిల్లీలోని చాణక్యపురి డిప్లమాటిక్ ఎనక్లేవ్‌లోని సుష్మా స్వరాజ్ భవన్లో తుది కేబినెట్ భేటీ జరగనుంది. ఈ నెలలోనే లోక్‌సభ సాధారణ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్(సీఈసీ) షెడ్యూల్ విడుదల చేయనుంది. ఇదీ చదవండి.. వచ్చే వారంలో కాంగ్రెస్ కీలక భేటీలు -
ఎయిర్‌పోర్టులో దుమ్మురేపుతున్న దోస్తులు, ఫ్యామిలీ మెంబర్స్, ప్లీజ్ రావొద్దు!
శంషాబాద్: ప్రయాణికుల స్వాగత, వీడ్కోలు జరిగే సమయాల్లో అత్యధికమంది రావడంతో ఎయిర్‌పోర్టు పరిసరాల్లో పార్కింగ్, రద్దీ పెరిగి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని ఎయిర్‌పోర్టు వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. ఇటీవల విదేశాలకు వెళుతున్న విద్యార్థుల వెంట పరిమితికి మించి పెద్దఎత్తున స్నేహితులు, బంధువులు, కుటుంబసభ్యుల రాకతో ఎయిర్‌పోర్టు ప్రాంగణం కిక్కిరిసిపోతున్న సందర్భాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. సుఖవంతమైన ప్రయాణం కోసం ప్రయాణికులు, వారి కుటుంబసభ్యులు సహకరించాలన్నారు. -
టోక్యో పారా ఒలింపిక్స్‌కు పయనమైన భారత బృందం
న్యూఢిల్లీ: టోక్యో పారా ఒలింపిక్స్‌కు భారత బృందం పయనమైంది. 54 మందితో టోక్యోకు భారత బృందం బయల్దేరింది. ఆటగాళ్లకు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వీడ్కోలు పలికారు. పారా ఒలింపిక్స్‌లో 9 క్రీడాంశాల్లో భారత ఆటగాళ్లు పోటీపడనున్నారు. ఈనెల 27న ఆర్చరీతో భారత్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. కాగా రియో పారా ఒలింపిక్స్ 2016లో చైనా 105 స్వర్ణాలు, 81 రజతాలు, 51 కాంస్యాలు కలిపి మొత్తంగా 237 పతకాలు సాధించింది. ఇక బ్రిటన్ 64, ఉక్రెయిన్ 41, అమెరికా 40 స్వర్ణాలు సాధించాయి. బ్రెజిల్ 14 బంగారం పతకాలు సాధించి ఎనిమిదో స్థానంలో నిలువగా.. భారత్ రెండు స్వర్ణాలు, ఒక రజతం, కాంస్యం సాధించి 42వ స్థానంలో నిలిచింది. -
రేపు గవర్నర్ నరసింహన్‌కు వీడ్కోలు
-
సైకిల్ యాత్రకు వీడ్కోలు
గాంధీనగర్ : కృష్ణానది పరిరక్షణకు సైకిల్ యాత్ర చేపట్టిన గౌరీశంకర్‌ను ఐజేయూ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు అభినందించారు. గురువారం ప్రెస్‌క్లబ్ వద్ద సైకిల్‌యాత్రకు ఏపీయూడబ్ల్యూజే నాయకులు వీడ్కోలు పలికారు. అంబటి మాట్లాడుతూ పాలనా వ్యవహారాలన్నీ తెలుగులోనే జరగాలనే సంకల్పంతో గౌరీశంకర్ యాత్ర చేపట్టారన్నారు. అధికార తెలుగుభాషలోనే పాలన జరిగితేనే పాలనా విధానం ప్రజలకు చేరుతుందన్నారు. అర్థం కానీ అంగ్లభాషలో పరిపాలించడంవలన తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. సైకిల్‌యాత్రలో భాగంగా రాజధాని నిర్మాణం కోసం మట్టి, నీరు, ఇటుకలు గౌరీశంకర్ అందించారన్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు పాల్గొన్నారు. -
రియో అథ్లెట్లతో ప్రధాని మోదీ భేటీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం రియో ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనడానికి అర్హత సాధించిన భారత అథ్లెట్లలో సమావేశం అయ్యారు. ఢిల్లీలోని మానేక్షా కేంద్రం వద్ద రియో ఒలింపిక్ బృందంలోని అథ్లెట్లతో మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారికి మోదీ శుభాకాంక్షలు తెలిపారు. రియో ఒలింపిక్స్‌లో రాణించాలని ఆకాంక్షించారు. కాగా బ్రెజిల్ రాజధాని రియో డి జనీరోలో జరిగే రియో క్రీడలకు 13 క్రీడాంశాల నుంచి 100కుపైగా భారత అథ్లెట్లు బెర్త్ దక్కించుకున్న సంగతి విదితమే. మరోవైపు ప్రధానితో కరచరణం చేస్తూ అథ్లెట్లు సెల్ఫీలు తీసుకున్నారు. -
ముగిసిన రాష్ట్రపతి వర్షాకాల విడిది
హైదరాబాద్ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వర్షాకాల విడిది నేటితో ముగిసింది. దాంతో బుధవారం ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ నరసింహన్, పలువురు మంత్రులు ..రాష్ట్రపతికి వీడ్కోలు పలికారు. హకీంపేటలోని విమానాశ్రయం నుంచి ప్రణబ్ ముఖర్జీ ఈరోజు ఉదయం 11 గంటలకు ఢిల్లీకి తిరిగి వెళ్లారు. ఆయన జూన్ 29న వర్షాకాల విడిదికి హైదరాబాద్ వచ్చిన విషయం తెలిసిందే. -
తపాలా: సెండాఫ్ పార్టీ
నేను ప్రస్తుతం ఒక గృహిణిని. చాలా యేళ్ల క్రితం ఒక ఆఫీస్‌లో జాబ్ చేసేదాన్ని. అప్పట్లో మా డిపార్ట్మెంట్లో నేనొక్కదాన్నే అమ్మాయిని. మిగిలినవాళ్లంతా అబ్బాయిలే. ఎవరితో మాట్లాడాలన్నా, ఏది అడగాలన్నా మొదట్లో చాలా ఇబ్బందిగా ఉండేది. నాతో పాటు వేరే డిపార్ట్మెంట్లో అమ్మాయి ట్రైనింగ్ పీరియడ్‌లో ఫ్రెండ్ అయింది. ఇక లంచ్ టైమ్‌లో వాళ్లతో పాటు లంచ్ చేసేదాన్ని. వాళ్లలో చాలామంది అమ్మాయిలున్నారు. వాళ్లు కూడా ఫ్రెండ్సయ్యారు. టీ బ్రేక్‌లో, లంచ్ టైమ్‌లో బాగా ఎంజాయ్ చేసేవాళ్లం. రాను రాను మా డిపార్ట్మెంట్ కొలీగ్స్ కూడా క్లోజయ్యారు. మాదే చివరి పెద్ద హాల్. అందులోనే ప్రతి డిపార్ట్మెంట్ సపరేట్గా ఉండేవారు. మాది మూలన కావటంతో బాగా అల్లరి చేసేవాళ్లం. అస్సలు ఆఫీస్‌కి వెళ్లినట్టు ఉండేది కాదు. కాలేజ్‌లో ఎంజాయ్ చేస్తున్నట్టుండేది. కాకపోతే అక్కడ వర్క్ ప్రజర్ ఎక్కువగా ఉండేది. టార్గెట్స్ రీచ్ అవ్వాలి. అలాగే ఓటీలు కూడా చేయాల్సి వస్తుంటే, మాకు మాత్రం ఫుల్‌గా జోక్స్ వేసుకుంటూ జాలీగా వర్క్ చేసేవాళ్లం. నా పక్క సీట్లో ముస్లిం అబ్బాయి, ఇద్దరు హిందువులు, నేను క్రిస్టియన్. నలుగురం ఒకే వరుసలో కూర్చునేవాళ్లం. ప్రతిదీ పంచుకునేవాళ్లం. ఇంక మా డిపార్ట్‌మెంట్‌వాళ్లు సీనియర్స్. వాళ్లతో పాటే ఆఫీస్ స్టార్ట్ అయింది. బర్త్‌డే పార్టీస్‌కి కంపల్సరీగా ఎక్కడికైనా రెస్టారెంట్లోనో, బేకరీలోనో పార్టీ చేసుకునేవాళ్లం. అది చాలా హ్యాపీగా జరిగేది. ప్రతి శనివారం కలర్ఫుల్గా వెళ్లేవాళ్లం. నా పక్క ముస్లిం అబ్బాయి రంజాన్‌కి రోజా ఉండేవాడు. నేను హలీమ్ అడిగితే, పిస్తా హౌస్‌కి రమ్మని ఎగ్గొట్టేవాడు. ‘నువ్వు చాలా పిసినారి’వని మేం తనని వెక్కిరించేవాళ్లం. అయితే మార్చి 2005లో అనుకుంటా, ఏదో పనిమీద మా మేనేజర్ రూమ్‌కి వెళ్లా. అందరూ చూశారు. ‘ఎందుకెళ్లావు?’ అంటే రిజైన్ లెటర్ ఇవ్వడానికి అని చెప్పా. అందరూ షాకయ్యారు. ‘ఎందు’కని అడిగారు. ‘ఏమో రిజైన్ చేయాలనిపించి ఇచ్చా’ అని చెప్పాను. ఒక నెల ముందు లెటర్ ఇవ్వాలి. సో! అలా అందరూ కొంచెం అప్సెట్ అయ్యారు. నేను అందరినీ బాగా ఆటపట్టించేదాన్ని. అలా రోజులు గడుస్తున్నాయి. ‘నా చివరి రోజు మార్చి 31’ అని చెప్పా. అందరూ అలాగే అనుకున్నారు. అయితే వేరే డిపార్ట్మెంట్లో అమ్మాయి ఈ ముస్లిం అబ్బాయి కొంచెం క్లోజయ్యారు. సెండాఫ్ పార్టీ వాళ్లు 31న అని చెప్పారు. సరే, అదే నాకు ఆఖరి రోజు. మార్చి 31న ఆఫీస్ అయిపోయాక, వాళ్లు నాకు బేకరీలో పార్టీ ఇచ్చారు. పార్టీ అయ్యాక, గుడ్‌బై చెప్పి ఇంటికెళ్లిపోయా. తెల్లారి ఉదయం ఏప్రిల్ ఫస్టున అందరికంటే ముందెళ్లి చివరి వరుస సీట్లో కూర్చున్నా. అందరూ షాక్. ‘ఏంటీ నిన్నే నీకు చివరిరోజు కదా’ అన్నారు. వాళ్లందర్నీ నేను ఏప్రిల్ ఫూల్ చేసినట్టు తెలిసి, తెగ ఫీలయ్యారు. - శైలజ, మల్కాజ్గిరి, హైదరాబాద్ చంద్రముఖి నక్షత్రం! నా పేరు భారతి. మా ఊరు గుంటూరు జిల్లా భట్టిప్రోలు పరిధిలోని ఓలేరు. మా బాబు పేరు మాధవ్. అల్లరిలో ‘అరవీర భయంకర చిచ్చర పిడుగు’ అనే బిరుదాంకితుడు. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు. వాడు ఏదో ఒక అల్లరిపని చేస్తూనేవుంటాడు. ఏ పనీ లేకపోతే ఆవుదూడ పలుపు ఊడదీసి, దానితో సమానంగా పరుగెడుతూ ఉంటాడు. వాడికి మూడేళ్లు ఉన్నప్పుడు అనుకుంటా. ఓ రోజు రాత్రిపూట ఎత్తుకొని తిప్పుతూ అన్నం తినిపించే ప్రయత్నంలో ఉన్నాను. ‘‘ఒరేయ్ మాధవా! అదిగో ఆకాశంలో చందమామ దగ్గరలో బ్రైట్‌గా కనిపిస్తోందే... దాన్ని ‘అరుంధతి’ నక్షత్రం అంటారు నాన్నా’’ అని చెప్పాను. దానికి వాడు సమాధానంగా, ‘‘అమ్మా! దాని పక్కన ఇంకోటి బ్లైట్గా ఉందే, మరి అది ‘చంద్రముఖి’ నక్షత్రమా?’’అని అడిగాడు. వాడి సినిమా పరిజ్ఞానం అలా ఉంది మరి! - ఎన్.భారతీకిషోర్ ఓలేరు ఇది మీ కోసం పెట్టిన పేజీ. మీ అనుభవాలు, అనుభూతులు, ఆలోచింపజేసిన సంఘటనలు, మీ ఊరు విశేషాలు, మీ పిల్లల ముద్దుమాటలు, వారి అల్లరి చేష్టలు... అవీ ఇవీ అని లేదు, ఏవైనా మాకు రాసి పంపండి. మా చిరునామా: తపాలా, ఫన్డే, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34. funday.sakshi@gmail.com -
జడ్జీలకు వీడ్కోలు
సాక్షి, హైదరాబాద్: పదోన్నతిపై హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులైన రంగారెడ్డి జిల్లా కోర్టు ప్రిన్సిపల్ జడ్జి ఎం.ఎస్.కె. జైస్వాల్‌కు మంగళవారం జిల్లా కోర్టులో ఘనంగా వీడ్కోలు పలికారు. జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జైస్వాల్‌ను ఘనంగా సన్మానించారు. జిల్లా న్యాయమూర్తిగా సేవలందించిన హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి లభించడం తనకు తీపిగుర్తు అని, రంగారెడ్డి జిల్లా కోర్టు తనకు మార్గదర్శకమని జైస్వాల్ అన్నారు. రాగద్వేషాలకు అతీతంగా వృత్తిధర్మాన్ని కొనసాగించానని అన్నారు. హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతిపై వెళ్లడం సంతోషాన్ని కలిగిస్తున్నా జిల్లా కోర్టును వదిలి వెళ్తున్నందుకు కొంత బాధగా ఉందన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజిరెడ్డి, కార్యదర్శి సుధాకర్‌రెడ్డి, పలువురు జడ్జీలు, ప్రిపైడింగ్ అధికారులు, బార్ కౌన్సిల్ సభ్యులు, పలువురు న్యాయవాదులు కార్యక్రవుంలో పాల్గొన్నారు. పలువురి రిలీవ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన సీబీఐ ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు, సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి సీతారామమూర్తి, ఎండోమెంట్స్ ట్రిబ్యునల్ చైర్మన్ శివశంకర్‌లు మంగళవారం రిలీవ్ అయ్యారు. బుధవారం వీరు హైకోర్టు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇదిలా ఉండగా సీబీఐ ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయస్థానానికి ఇన్‌ఛార్జ్‌గా సీబీఐ రెండో అదనపు కోర్టు జడ్జి ఎంవీ రమేష్ నియమితులయ్యారు. ఇప్పటికే ఖాళీగా ఉన్న మొదటి కోర్టుకు కూడా రమేష్ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. నేడు హైకోర్టులో అదనపు న్యాయమూర్తుల ప్రమాణం రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా తొమ్మిది మంది బుధవారం ఉదయం ప్రమాణం చేయనున్నారు. వీరితో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతిసేన్‌గుప్తా ఉదయం 10.30 గంటలకు ప్రమాణం చేయించనున్నారు. జిల్లా జడ్జీలుగా ఉన్న 9 మందిని పదోన్నతిపై హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. బులుసు శివశంకరరావు, ఎం.సీతారామమూర్తి, సరిపెళ్ల రవికుమార్, ఉప్మాక దుర్గాప్రసాదరావు, తాళ్లూరి సునీల్ చౌదరి, మల్లవోలు సత్యనారాయణమూర్తి, మిస్రిలాల్ సునీల్ కిషోర్ జైస్వాల్, అంబటి శంకర నారాయణ, అనీస్ అదనపు న్యాయమూర్తులుగా ప్రమాణం చేసే వారిలో ఉన్నారు.