
శంషాబాద్: ప్రయాణికుల స్వాగత, వీడ్కోలు జరిగే సమయాల్లో అత్యధికమంది రావడంతో ఎయిర్‌పోర్టు పరిసరాల్లో పార్కింగ్, రద్దీ పెరిగి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని ఎయిర్‌పోర్టు వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి.
ఇటీవల విదేశాలకు వెళుతున్న విద్యార్థుల వెంట పరిమితికి మించి పెద్దఎత్తున స్నేహితులు, బంధువులు, కుటుంబసభ్యుల రాకతో ఎయిర్‌పోర్టు ప్రాంగణం కిక్కిరిసిపోతున్న సందర్భాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. సుఖవంతమైన ప్రయాణం కోసం ప్రయాణికులు, వారి కుటుంబసభ్యులు సహకరించాలన్నారు.