క్వాలిఫయింగ్‌లో ప్రపంచ రికార్డు
రెండో ర్యాంక్‌తో నేరుగా రెండో రౌండ్‌లోకి
పారాలింపిక్స్ క్రీడలు
పారిస్: పారా ఆర్చరీలో గత కొంత కాలంగా సంచలన విజయాలు సాధిస్తున్న భారత ప్లేయర్ శీతల్ దేవి పారాలింపిక్స్‌లోనూ శుభారంభం చేసింది. ఆర్చరీ కాంపౌండ్ ఈవెంట్ మహిళల వ్యక్తిగత విభాగంలో ఆమె నేరుగా రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన ర్యాంకింగ్ రౌండ్‌లో శీతల్ రెండో స్థానంలో నిలిచింది.
మొత్తం 703 పాయింట్లతో ఆమె తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేయడంతో పాటు 700 పాయింట్లు దాటిన భారత తొలి మహిళా పారా ఆర్చర్‌గా ఘనత సాధించింది. ఈ క్రమంలో ఆమె కొత్త ప్రపంచ రికార్డు కూడా సృష్టించింది. ఈ నెలలోనే ఫోబ్ పేటర్సన్ (బ్రిటన్) 698 పాయింట్లతో నెలకొల్పిన ప్రపంచ రికార్డును శీతల్ బద్దలు కొట్టింది.
అయితే కొద్ది సేపటికే 704 పాయింట్లతో ఈ రికార్డును సవరిస్తూ ఒజ్‌నర్ క్యూర్ (టర్కీ) మొదటి స్థానంలో నిలిచింది. గత ఏడాది జరిగిన ఆసియా క్రీడల్లో శీతల్ 2 స్వర్ణాలు, ఒక రజతం గెలుచుకుంది. ఆ తర్వాత పారా వరల్డ్ చాంపియన్íÙప్‌లో కూడా పతకం సాధించింది. కశీ్మర్‌కు చెందిన శీతల్ పుట్టుకతోనే ‘ఫొకెమెలియా సిండ్రోమ్’ వ్యాధి బారిన పడటంతో ఆమె రెండు చేతులూ పని చేయకుండా ఉండిపోయాయి.
సుకాంత్, సుహాస్, తరుణ్ ముందంజ...
బ్యాడ్మింటన్ పోటీల్లో తొలి రోజు భారత్ మెరుగైన ఫలితాలు సాధించింది. భారత్‌కు చెందిన సుకాంత్ కదమ్, సుహాస్ యతిరాజ్, తరుణ్ గ్రూప్ దశలో తమ మొదటి రౌండ్‌లలో విజయాలు అందుకున్నారు. సుకాంత్ 17–21, 21–15, 22–20తో మొహమ్మద్ అమీన్ (మలేసియా)పై, సుహాస్ 21–7, 21–5తో హిక్మత్ రమ్‌దాని (ఇండోనేసియా)పై, తరుణ్ 21–17, 21–19తో ఒలీవిరా రోజరియో (బ్రెజిల్)పై గెలుపొందారు.
అయితే మరో ఇద్దరు షట్లర్లు మన్‌దీప్ కౌర్, మానసి జోషిలకు తొలి మ్యాచ్‌లో ఓటమి ఎదురైంది. మానసి 21–16, 13–21, 18–21తో ఇక్తియార్ (ఇండోనేసియా) చేతిలో, మన్‌దీప్ 8–21, 14–21తో మరియమ్ బొలాజి (నైజీరియా) చేతిలో పరాజయంపాలయ్యారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో నితీశ్ కుమార్–తులసిమతి 21–14, 21–17తో భారత్‌కే చెందిన సుహాస్ యతిరాజ్–పలక్ కోహ్లిలను ఓడించి ముందంజ వేయగా... శివరాజన్–నిత్యశ్రీ ద్వయం 21–23, 11–21తో మైల్స్ క్రాజెస్కీ–జేసీ సైమన్ (అమెరికా) చేతిలో ఓడారు.
తైక్వాండో భారత ప్లేయర్ అరుణ తన్వర్ కథ ముగిసింది. ప్రిక్వార్టర్స్‌లో టరీ్కకి చెందిన నూర్సిహన్ ఎకిన్సీ 19–0తో అరుణను చిత్తుగా ఓడించింది. సైక్లింగ్ 3000 మీటర్ల వ్యక్తిగత పర్సూ్యట్ ఈవెంట్‌లో భారత్‌కు చెందిన జ్యోతి గడేరియా 10వ స్థానంలో నిలిచి ని్రష్కమించింది. జ్యోతి ఈ రేస్‌ను 4 నిమిషాల 53.929 సెకన్లలో ముగించింది.
Comments
Please login to add a commentAdd a comment