para archery
-
ఏడు నెలల గర్భిణి.. అమ్మగా.. అథ్లెట్‌గా..
ఆమె ఒక అమ్మ. పైగా ఏడు నెలల గర్భవతి! అయితేనేం పారిస్‌లో ఆర్చర్‌గా పారాలింపిక్స్‌లో పతకంపై గురి పెట్టింది. ఇంట్లో ఓ కంట రెండేళ్ల బాలుడి ఆలనాపాలన చూస్తోంది. మరో కంట రెండు నెలల్లో కళ్లు తెరిచే గర్భస్థ శిశువుని కనిపెడుతోంది. అలాగని రెండు పాత్రలతోనే సరిపెట్టుకోలేదు. ఆర్చరీలో లక్ష్యంపై బాణాలు కూడా సంధిస్తోంది.వైకల్యాన్నే చిన్నబోయేలా చేసిందిఅలా బ్రిటన్‌కు చెందిన జోడీ గ్రిన్‌హమ్ త్రిపాత్రాభినయానికి సమన్యాయం చేస్తోంది. శుక్రవారం జరిగిన మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఓపెన్ ఈవెంట్ ర్యాంకింగ్ రౌండ్లో జోడీ గ్రిన్‌హమ్ 693 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. అనంతరం బ్రిటన్ సహచరుడు నాథన్ మాక్క్విన్తో కలిసి మిక్స్డ్ టీమ్ కాంపౌండ్ ఓపెన్ ఈవెంట్లో రెండో స్థానంలో నిలిచింది. ఒకే రోజు ఓ గర్భిణి రెండు ఈవెంట్లతో పాల్గొని వైకల్యాన్నే చిన్నబోయేలా చేసింది.అమ్మను.. పారా అథ్లెట్‌ను కూడాపోటీల అనంతరం ఆమె మాట్లాడుతూ ‘నేను అమ్మను, అలాగే పారా అథ్లెట్‌ను. వీటిలో ఏ ఒక్కటి వదులుకోను. కానీ... ఇంట్లో మాత్రం వందశాతం అమ్మనే’ అని అమ్మతనాన్ని, అథ్లెట్ సామర్థ్యాన్ని వివరించింది. ‘నేను ఇంకా బాగా రాణించగలనని నాకు తెలుసు. ఇంకాస్త మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సింది. అయినా నాలుగో స్థానమేమి నిరాశపర్చలేదు. మిగతా ఈవెంట్లపై మరింత దృష్టి సారించేలా ఆత్మవిశ్వాసాన్నిచ్చింది’ అని తెలిపింది. జోడీ గ్రిన్హమ్కు ఇదేం తొలి పారాలింపిక్స్ కాదు. రియో పారాలింపిక్స్ (2016)లో పాల్గొని మిక్స్డ్ టీమ్ కాంపౌండ్ విభాగంలో రజతం నెగ్గింది. ఇక ఈ పారాలింపిక్స్‌లో ఆమె శని, సోమవారాల్లో పతకాల కోసం రెండు ఈవెంట్లలో పాల్గొనాల్సి ఉంది.చదవండి: అవని అద్వితీయం -
శీతల్ దేవి శుభారంభం
పారిస్: పారా ఆర్చరీలో గత కొంత కాలంగా సంచలన విజయాలు సాధిస్తున్న భారత ప్లేయర్ శీతల్ దేవి పారాలింపిక్స్‌లోనూ శుభారంభం చేసింది. ఆర్చరీ కాంపౌండ్ ఈవెంట్ మహిళల వ్యక్తిగత విభాగంలో ఆమె నేరుగా రెండో రౌండ్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన ర్యాంకింగ్ రౌండ్లో శీతల్ రెండో స్థానంలో నిలిచింది. మొత్తం 703 పాయింట్లతో ఆమె తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేయడంతో పాటు 700 పాయింట్లు దాటిన భారత తొలి మహిళా పారా ఆర్చర్‌గా ఘనత సాధించింది. ఈ క్రమంలో ఆమె కొత్త ప్రపంచ రికార్డు కూడా సృష్టించింది. ఈ నెలలోనే ఫోబ్ పేటర్సన్ (బ్రిటన్) 698 పాయింట్లతో నెలకొల్పిన ప్రపంచ రికార్డును శీతల్ బద్దలు కొట్టింది. అయితే కొద్ది సేపటికే 704 పాయింట్లతో ఈ రికార్డును సవరిస్తూ ఒజ్నర్ క్యూర్ (టర్కీ) మొదటి స్థానంలో నిలిచింది. గత ఏడాది జరిగిన ఆసియా క్రీడల్లో శీతల్ 2 స్వర్ణాలు, ఒక రజతం గెలుచుకుంది. ఆ తర్వాత పారా వరల్డ్ చాంపియన్íÙప్లో కూడా పతకం సాధించింది. కశీ్మర్‌కు చెందిన శీతల్ పుట్టుకతోనే ‘ఫొకెమెలియా సిండ్రోమ్’ వ్యాధి బారిన పడటంతో ఆమె రెండు చేతులూ పని చేయకుండా ఉండిపోయాయి. సుకాంత్, సుహాస్, తరుణ్ ముందంజ... బ్యాడ్మింటన్ పోటీల్లో తొలి రోజు భారత్ మెరుగైన ఫలితాలు సాధించింది. భారత్‌కు చెందిన సుకాంత్ కదమ్, సుహాస్ యతిరాజ్, తరుణ్ గ్రూప్ దశలో తమ మొదటి రౌండ్లలో విజయాలు అందుకున్నారు. సుకాంత్ 17–21, 21–15, 22–20తో మొహమ్మద్ అమీన్ (మలేసియా)పై, సుహాస్ 21–7, 21–5తో హిక్మత్ రమ్‌దాని (ఇండోనేసియా)పై, తరుణ్ 21–17, 21–19తో ఒలీవిరా రోజరియో (బ్రెజిల్)పై గెలుపొందారు. అయితే మరో ఇద్దరు షట్లర్లు మన్దీప్ కౌర్, మానసి జోషిలకు తొలి మ్యాచ్‌లో ఓటమి ఎదురైంది. మానసి 21–16, 13–21, 18–21తో ఇక్తియార్ (ఇండోనేసియా) చేతిలో, మన్దీప్ 8–21, 14–21తో మరియమ్ బొలాజి (నైజీరియా) చేతిలో పరాజయంపాలయ్యారు. మిక్స్డ్ డబుల్స్‌లో నితీశ్ కుమార్–తులసిమతి 21–14, 21–17తో భారత్‌కే చెందిన సుహాస్ యతిరాజ్–పలక్ కోహ్లిలను ఓడించి ముందంజ వేయగా... శివరాజన్–నిత్యశ్రీ ద్వయం 21–23, 11–21తో మైల్స్ క్రాజెస్కీ–జేసీ సైమన్ (అమెరికా) చేతిలో ఓడారు. తైక్వాండో భారత ప్లేయర్ అరుణ తన్వర్ కథ ముగిసింది. ప్రిక్వార్టర్స్‌లో టరీ్కకి చెందిన నూర్సిహన్ ఎకిన్సీ 19–0తో అరుణను చిత్తుగా ఓడించింది. సైక్లింగ్ 3000 మీటర్ల వ్యక్తిగత పర్సూ్యట్ ఈవెంట్లో భారత్‌కు చెందిన జ్యోతి గడేరియా 10వ స్థానంలో నిలిచి ని్రష్కమించింది. జ్యోతి ఈ రేస్‌ను 4 నిమిషాల 53.929 సెకన్లలో ముగించింది. -
పారా ఆర్చర్ శీతల్‌కు స్వర్ణం, రజతం
ఆసియా పారా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు నాలుగు స్వర్ణాలు, నాలుగు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి మొత్తం తొమ్మిది పతకాలు లభించాయి. ఆసియా పారా గేమ్స్‌లో రెండు స్వర్ణాలు నెగ్గి అందరి ప్రశంసలు అందుకున్న శీతల్ దేవి ఆసియా చాంపియన్‌షిప్‌లోనూ రాణించింది. రెండు చేతులు లేకున్నా తన కాళ్లతో విల్లు ఎక్కుపెట్టి బాణాలు సంధించే శీతల్ ఈ టోర్నీలో మిక్స్డ్ టీమ్ విభాగంలో రాకేశ్‌తో కలిసి స్వర్ణం... వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించింది. వ్యక్తిగత విభాగం ఫైనల్లో శీతల్ దేవి ‘షూట్ ఆఫ్’లో సింగపూర్ ప్లేయర్ నూర్ సియాదా చేతిలో ఓడిపోయింది. -
రేపటి నుంచి జాతీయ ఆర్చరీ
ఇండియన్ రౌండ్ విభాగంలో పోటీలు ∙పారా ఆర్చరీ కూడా సాక్షి, హైదరాబాద్: జాతీయ ఆర్చరీ చాంపియన్‌షిప్‌కు నగరం వేదిక కానుంది. రేపటినుంచి రెండు రోజుల పాటు ఆర్ఆర్సీ గ్రౌండ్స్‌లో ఇండియన్ రౌండ్ విభాగంలో పోటీలు జరుగుతాయి. ఇందులో దేశవ్యాప్తంగా దాదాపు 300 మంది ఆర్చర్లు పాల్గొంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి జాతీయ ఆర్చరీ టోర్నీ జరుగుతుండటం విశేషం. గురువారం జరిగిన మీడియా సమావేశంలో నిర్వాహకులు ఈ టోర్నీ వివరాలు వెల్లడించారు. బాంబూ విల్లుతో సాగే ఈ పోటీల్లో గ్రామీణ ప్రతిభను గుర్తించడమే తమ లక్ష్యమని భారత ఆర్చరీ సమాఖ్య ప్రధాన కార్యదర్శి అనిల్ కామినేని వెల్లడించారు. ప్రధానంగా గిరిజన ప్రాంతాలకు చెందిన ఆటగాళ్లను అంతర్జాతీయ స్థాయి ఆర్చర్లుగా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగానే నగరంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. గతంలో కూడా ఇలాంటి ప్రతిభాన్వేషణ కార్యక్రమం ద్వారానే పలువురు ఆర్చర్లు వెలుగులోకి వచ్చి నట్లు అనిల్ వివరించారు. దీనికి సమాంతరంగా జాతీయ పారా ఆర్చరీ చాంపియన్‌షిప్ కూడా నిర్వహిస్తారు. ఇందులో రికర్వ్, కాం పౌండ్ విభాగాల్లో ఆర్చర్లు తలపడతారు. పారా విభాగంలో 75 మందికి పైగా ఆర్చర్లు పోటీలో నిలిచారు. పారా విభాగంలో జాతీయ స్థాయిలో పోటీలు జరగడం ఇది రెండోసారి మాత్రమే. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆర్చరీ సంఘం కార్యదర్శి ఉపాధ్యక్షుడు టి.రాజు, కోశాధికారి శంకరయ్య, హైదరాబాద్ ఆర్చరీ సంఘం కార్యదర్శి అరవింద్ కూడా పాల్గొన్నారు.