
నీరజ్ చోప్రా
పారిస్ : ఫ్రాన్స్‌లో జరుగుతున్న సొట్టేవిల్లే అథ్లెటిక్స్ మీట్‌లో భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా స్వర్ణపతకం సాధించాడు. ఫ్రాన్స్‌లో జరిగిన అథ్లెటిక్స్ మీట్ ఫైనల్లో జావెలిన్‌ను రికార్డు స్థాయిలో 85.17 మీటర్లు విసిరి పసిడిని సొంతం చేసుకున్నాడు. 2012 లండన్ ఒలింపిక్ విజేత ఛాంపియన్ వాల్కాట్ ఐదో స్థానంలో నిలవడం విశేషం. చోప్రా తర్వాత స్థానంలో మోల్దోవన్ జావెలిన్ త్రోయర్ ఆండ్రియన్ 81.48 మీటర్లతో రజత పతకాన్ని గెలుపొందగా.. లిథునియా అథ్లెట్ ఈడిస్ 79.31 మీటర్లతో కాంస్య పతకం గెలుపొందాడు.
2016లో జరిగిన వరల్డ్ అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో జావెలిన్‌ను 86.48 మీటర్లు విసిరి ప్రపంచ రికార్డు నెలకొల్పిన నీరజ్ చోప్రా మళ్లీ ఆ రికార్డును బ్రేక్ చేయలేకపోతున్నాడు. ఈ ఏడాది ముగిసిన కామన్వెల్త్ గేమ్స్‌లో 86.47 మీటర్లతో ఆ రికార్డు దరిదాపుల్లోకి వచ్చినా.. తాజాగా 85.17 మీటర్లే జావెలిన్‌ను చోప్రా విసరడం కొసమెరుపు. 2016లో కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినప్పటికీ రియో ఒలింపిక్స్‌కి అర్హత సాధించలేకపోయిన ఈ స్టార్ జావెలిన్ త్రోయర్.. త్వరలోనే ఇండోనేషియా వేదికగా జరగనున్న ఆసియా గేమ్స్‌లో భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment