
టోక్యో: ఒలింపిక్స్‌లో భారత్‌కు అథ్లెటిక్స్ విభాగంలో తొలిసారి స్వర్ణం అందించి చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రాపై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. జావెలిన్ త్రో ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి స్వర్ణం కొల్లగొట్టిన భారత్‌కు గోల్డెన్ ముగింపునిచ్చిన నీరజ్‌కు దేశ వ్యాప్తంగా అభిమానులతో పాటు సెలబ్రిటీలు సహా పలు కార్పొరేట్ సంస్థలు భారీ నజరానాను ప్రకటిస్తూ వచ్చాయి. ఇందులో భాగంగానే ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ నీరజ్ చోప్రాకు అరుదైన కానుకను ఇచ్చింది.
ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో ఫైనల్లో అతని ప్రదర్శనకు గాను రూ. కోటి రివార్డుతో పాటు ప్రత్యేక జెర్సీని గిఫ్ట్‌గా అందించనుంది. జావెలిన్ త్రోలో అతను స్వర్ణం కొట్టేందుకు కారణమైన 87.58 మీటర్ల దూరాన్ని సీఎస్‌కే ప్రత్యేకంగా తీసుకుంది. 8758 పేరుతో ఒక స్పెషల్ సీఎస్‌కే జెర్సీని తయారు చేయించి నీరజ్‌కు అందజేయనుంది. సీఎస్‌కే జట్టు ఉన్నంతకాలం నీరజ్ చోప్రా స్పెషల్ జెర్సీ మా గుర్తుగా ఉంటుందని.. అది అతనికి ఇచ్చే గౌరవమని సీఎస్‌కే ప్రతినిధి ఒకరు చెప్పుకొచ్చారు.
Anbuden saluting the golden arm of India, for the Throw of the Century!
— Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) August 7, 2021
8️⃣7⃣.5⃣8⃣ 🥇🔥
CSK honours the stellar achievement by @Neeraj_chopra1
with Rs. 1 Crore. @msdhoni
Read: https://t.co/zcIyYwSQ5E#WhistleforIndia #Tokyo2020 #Olympics #WhistlePodu 🦁💛 📸: Getty Images pic.twitter.com/lVBRCz1G5m
Comments
Please login to add a commentAdd a comment