రకుల్‌ప్రీత్ సింగ్, స్కై డైవ్ చేస్తూ...
‘మనకు ఉన్న భయాలు పోవాలంటే దేనికి భయపడుతున్నామో దాన్ని ధైర్యంగా ఎదుర్కొని ఆ భయాన్ని పోగొట్టుకోవడమే’ అని రకుల్‌ప్రీత్ సింగ్ అంటున్నారు. రకుల్‌కు బాసోఫోబియా ఉండేదట. అంటే.. ఎత్తు నుంచి కిందపడిపోతానేమోనని భయం. ఆ భయాన్ని పోగట్టదలుచుకున్నారు. వెంటనే స్కై డైవింగ్ చేశారు. స్కై డైవ్ చేసిన తర్వాత ఆ అనుభవాన్ని రకుల్ పంచుకుంటూ – ‘‘జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించాలన్నది నా పాలసీ. జీవితంలో భయానికి చోటు ఉండకూడదు. జరిగేది జరగక మానదు.
మన భయాల్ని అధిగమించడాన్ని మించిన ఆనందం మరోటి ఉండదు. గాల్లోకి జంప్ చేయడానికి ఏరోప్లేన్ తలుపులు తెరిచినప్పుడు విపరీతంగా భయమేసింది. కానీ గాల్లో తేలిన ఆ 50 సెకన్లు నా జీవితంలో మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్స్. ఆ క్షణం నేనో పక్షిలా అయిపోయా. ఏదో సాధించాను అనే భావన. డైవింగ్‌లో మరో క్రేజీ విషయమేటంటే.. మీరు భయపడితే మేం రికార్డ్ చేసే వీడియో సరిగ్గా ఉండదు అని చెప్పడంతో నాలో ఉన్న నటిని బయటకు రప్పించి గాల్లో ఉన్నంతసేపు నవ్వుతూనే ఉన్నాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment