
'స్కై డైవ్ చేసి చెట్టుకు ఢీకొని..'
శాన్ ఫ్రాన్సిస్కో: ప్రముఖ స్పోర్ట్స్ స్టార్ ఎరిక్ రోనర్(39) అనూహ్యంగా మృత్యువాత పడ్డాడు. ఉత్తర కాలిఫోర్నియాలోని స్క్వా వ్యాలీలో నిర్వహిస్తున్న ఓ గోల్ఫ్ ఈవెంట్ ప్రారంభానికి ముందు నిర్వహించిన స్కై డైవింగ్ కార్యక్రమంలో పాల్గొని డైవ్ చేసి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. అతడు ఓ చెట్టుపై పడటంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈవిషయాన్ని షెరిఫ్ రాష్ట్ర కెప్టెన్ డెన్నిస్ వాష్ తెలిపారు.
గోల్ఫ్ టోర్నమెంటు జరగడానికి ముందు స్కై డైవింగ్ నిర్వహించడం అక్కడ అనవాయితీకిగా కొనసాగుతుంటుంది. అందులో భాగంగానే సోమవారం జరిగిన స్కై డైవింగ్ కార్యక్రమంలో పలువురు పాల్గొనగా అందులో రోనర్ కూడా ఒకరు. అందరితోపాటు తాను కూడా స్కై డైవ్ చేశారు. అయితే, మిగితా వారు సురక్షితంగా నేలపై దిగగా.. ఒక్క రోనర్ మాత్రం చెట్టుకు ఢీకొని అక్కడే చిక్కుకుపోయారు. మృతదేహాన్ని చెట్టు కిందికి దించే అవకాశం కూడా అధికారులకు లేకుండాపోయింది.