'స్కై డైవింగ్‌ స్టంట్‌'తో రామభక్తి చాటుకున్న 22 ఏళ్ల మహిళ! | Inauguration Of Ram Temple 22-Year-Old Skydives With Jai Shri Ram Flag | Sakshi
Sakshi News home page

రామాలయ ప్రారంభోత్సవ వేళ: 'స్కై డైవింగ్‌ స్టంట్‌'తో రామభక్తి చాటుకున్న 22 ఏళ్ల మహిళ!

Published Thu, Jan 4 2024 11:01 AM | Last Updated on Thu, Jan 4 2024 11:17 AM

Inauguration Of Ram Temple 22 Year Old Skydives With Jai Shri Ram Flag  - Sakshi

అయోధ్యలో నూతన రామాలయం జనవరి 22న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని అదికారులు పెద్ద ఎత్తున​ సన్నాహాలు చేస్తున్నారు కూడా. ఈ సందర్భంగా  ఉత్తరప్రదేశ్‌లోని ప్రయోగ్‌రాజ్‌కు చెందిన 22 ఏళ్ల అనామిక శర్మ అనే మహిళ అద్భుతమైన స్టంట్‌ని ప్రదర్శించింది. అయోధ్యలోని రామమందిర ప్రారంభోత్సవం నేపథ్యంలోనే అనామిక బ్యాకాంక్‌లో ఈ స్కై డైవింగ్‌ స్టంట్‌తో తన రామభక్తిని ప్రదర్శించి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

ఈ మేరకు అనామిక శర్మ బ్యాంకాక్‌లో సుమారు 13 వేల అడుగుల ఎత్తులో 'జైశ్రీరామ్‌' అనే జెండాతో ఈ స్కై డైవింగ్‌ స్టంట్‌ చేసింది. తాను తన భక్తిని ఈ స్కై డైవింగ్‌తో ముందు తీసుకువెళ్లాలనుకుంటున్నా అని అన్నారు. అందుకు సంబంధించిన వీడియో సైతం నెట్టింట  తెగ వైరల్‌ అవుతోంది. కాగా,జనవరి 22న జరగనున్న ఈ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, సుమారు 4 వేలకు పైగా సాధువులు, పలువురు ఇతర ప్రముఖులు హాజరకానున్నారు.

కాగా, అయోధ్యలో ఈ రామ మందిర ప్రతిష్టాపన వేడుకను సందర్శకులు అపూర్వమైన మరుపురాని అనుభవంగా ఉండేలా అభివృద్ధిక కార్యక్రమాలతో అందంగా తీర్చిదిత్తున్నారు సీఎం యోగి. ఈ నూతన రామాలయం రాష్ట్ర దేశవాలయంగా భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సామజికి చిహ్నంగా అలారారుతుందని ఆదిత్యనాధ్‌లో ఉన్నారు. ఈనేపథ్యంలోనే అయోధ్యలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టి త్వరితగతిన పూర్తి చేశాలే అధికారులకు ఆదేశాలను కూడా జారీ చేశారు యోగి. 

(చదవండి: సీతమ్మ శాపాన్ని ఉపసంహరించుకుందేమో! అందుకే ఇవాళ అయోధ్య..!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement