హైదరాబాద్: నిమ్స్‌లో ‘బలగం’ మొగిలయ్యకు చికిత్స కొనసాగుతుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆదేశాల మేరకు వైద్యనిపుణులు నిత్య పర్యవేక్షణలో వైద్యం అందిస్తున్నారు. ఛాతి నొప్పి రావడంతో మెరుగైన చికత్స నిమిత్తం వరంగల్ నుంచి నిమ్స్‌కు తరలించిన సంగతి తెలిసిందే.
ఆయన దీర్ఘకాలంగా డయాబెటిక్, బీపీ సమస్యలతో బాధ పడుతున్నాడు. రెండు కిడ్నీలు చెడిపోవడంతో ఏడాది నుంచి డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో గత కొన్ని రోజుల నుంచి మొగిలయ్య కంటి చూపునూ కోల్పోయారు. ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆయనను గురువారం నిమ్స్ పాత భవనంలోని ఎఫ్ బ్లాక్ స్పెషల్ రూమ్‌కు తరలించి డయాలసిస్ సేవలను అందిస్తున్నారు. ప్రస్తుతం మొగిలయ్య ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆహారం కూడా తీసుకుంటున్నారని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప తెలిపారు. తన పనులు తాను చేసుకోలేని పరిస్థితుల్లో మొగిలయ్య ఉన్నాడని ఆయన భార్య కొమురమ్మ కన్నీటి పర్యంతమైంది.
అయనకు మెరుగైన వైద్యం అందించడానికి సాయపడుతున్న మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకరరావులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఆయా సార్ల సాయంతో నిమ్స్‌కు వచ్చిన మొగిలయ్య ఆరోగ్యం గురించి మరెంతో మంది పెద్ద సార్లు ఆందోళన చెందుతున్నారని.. ఇప్పటికీ అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్‌ఎస్ నాయకులు, నిర్మాత దిల్ రాజు, బలగం దర్శకులు వేణు ఇంకా ఎంతో మంది ఫోన్లు చేస్తున్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment