సన్నీలియోన్‌ రెస్టారెంట్‌లో ప్రేమికులకు ప్రత్యేక ఏర్పాట్లు! | Sunny Leone 'Chika Loca' Special Offer On Valentine's Day | Sakshi
Sakshi News home page

Chika Loka: సన్నీలియోన్‌ రెస్టారెంట్‌లో ప్రేమికులకు ప్రత్యేక ఏర్పాట్లు!

Published Tue, Feb 13 2024 12:20 PM | Last Updated on Tue, Feb 13 2024 12:55 PM

Sunny Leone Chika Loka is Giving Special Offer - Sakshi

బాలీవుడ్ నటి సన్నీలియోన్‌కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు  ఉంది. సన్నీలియోన్  ఇటీవలే ఓ రెస్టారెంట్ యజమానిగా మారారు. ఆమె ఈ మధ్యనే యూపీలోని నోయిడాలో తన మొదటి రెస్టారెంట్‌ను ప్రారంభించారు. 

సన్నీ రెస్టారెంట్ పేరు చికా లోకా. ఇది నోయిడాలోని గుల్షన్ మాల్‌లో ఉంది. ‘చికా లోకా’ ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ప్రేమ జంటలకు చక్కని అలంకారంతో కూడిన టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ప్రైవేట్ టేబుళ్లను కూడా బుక్ చేసుకోవచ్చని పేర్కొంది. లైవ్ బ్యాండ్ సంగీతంతో క్యాండిల్ డిన్నర్ చేయవచ్చని వివరించింది. 

రెస్టారెంట్‌కు వచ్చే ప్రేమ జంటల కోసం టెర్రస్‌ను అందంగా అలంకరించినట్లు మేనేజర్ భూపేష్ సింగ్ తెలిపారు. ఇక్కడ సమయాన్ని గడపడం ద్వారా ఈ వాలెంటైన్‌ను ప్రత్యేకంగా చేసుకోవచ్చన్నారు.  గ్రౌండ్ ఫ్లోర్, టెర్రస్ ఏరియాలలో ప్రత్యేక టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. డ్యాన్స్, క్యాండిల్ డిన్నర్, లైవ్ బ్యాండ్ మ్యూజిక్ విత్ డీజే మొదలైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement