సాక్షి,ముంబై: వాలెంటైన్స్ డే వస్తోందంటే చాలు ప్రేమికుల సందడి మొదలవుతుంది. దీనికి తగ్గట్టుగానే పలు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ సంస్థలు సిద్ధమవుతాయి. ఈ ట్రెండ్‌కు తగ్గట్టుగా వెరైటీ గిఫ్ట్‌లు, ఆఫర్లతో ఆకట్టుకుంటాయి. స్మార్ట్‌ఫోన్లు, గాడ్జెట్లు ఇతర ట్రెండీ బహుమతులపై తగ్గింపు ధరతో ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకుంటాయి.
మరోవైపు వాలెంటైన్స్ డే చరిత్ర, అర్థం, పరమార్థం, ఈ ఒక్క రోజు ప్రేమ ఉంటే చాలా ఇలాంటి విషయాలతో సంబంధం లేకుండా...రోజుకో డే చొప్పున వారం రోజులు పాటు గిఫ్ట్‌లు, చాక్లెట్లు, టెడ్డీ బేర్స్ , గులాబీలతో పండుగ చేసుకుంటారు. ముఖ్యంగా తన స్వీటీకి సంతోషం పెట్టేందుకు వాలెంటైన్ తెగ ఆరాటపడతారు. తన కలలరాణికి, లేదా తన రాకుమారుడికి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలా అనేది ఒక సవాలే. ఏ గిఫ్ట్ అయితే తమ డార్లింగ్ ఫిదా అయి పోతుందా అని ఇంటర్నెట్‌లో, ఆన్‌లైన్ సైట్లలో తెగ సెర్చ్ చేస్తారు. ఈ నేపథ్యంలో గులాబీలు, టెడ్డీ బేర్‌లు, చాక్లెట్‌ల కంటే ఎక్కువ కిక్ ఇచ్చే, మరపురాని మధుర జ్ఞాపకంగా మిగిల్చే. గిఫ్ట్స్ ఏంటో కొన్ని చూద్దాం.
ప్రేమికుల మధ్య ప్రధానంగా ఉండాల్సింది అండర్ స్టాండింగ్. ఎలాంటి అరమరికలు, దాపరికాలు లేకుండా.. మనసు విప్పి మాట్లాడుకోవడాన్ని మంచిన స్వీట్ మెమొరీ. అంతకుమించిన గొప్ప అనుభూతి ఏముంటుంది. రోజూ వాట్సాప్‌లో చాటింగ్, కాల్స్‌లోమాట్లాడుకుంటూనే ఉంటాంగా అనుకోకుండా....స్పెషల్‌గా మాట్లాడుకోండి. ముఖ్యంగా అమ్మాయిలు సర్‌ప్రైజ్‌లకి ఎక్కువ థ్రిల్ అవుతారట. సో.. వాలెంటైన్స్ డే, ఆమె కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయండి!
మన మనసుకు నచ్చిన నేస్తంతో ఒక రోజు గడపడం, మాట్లాడటం, జోకులు వేసుకోవడం,ఇష్టమైన సినిమా చూడటం, షిట్స్ క్రీక్ (లేదా ఇతర కంఫర్ట్ షోలు) చూడటం, లాంగ్ డ్రైవ్, ఇష్టమైన ఫుడ్, డిన్నర్ డేట్ ఇవన్నీ సంతోషానిచ్చేవే. వీటన్నింటికి మంచి ఒక బిగ్ హగ్, లవ్లీ కిస్ .. ఆ కళ్లలో వెలిగే స్పార్క్.. ఇవన్నీ.. ఫర్ పఫర్ ఎవర్ గుర్తుండిపోయే స్వీట్ నథింగ్స్.. ఇది స్వయంగా లవ్ బర్డ్స్ చెబుతున్న మాట.
మీ ప్రియురాలికి లేదా ప్రియుడికి బుక్స్ చదవడం హాబీ అయితే,అందులోనూ మంచి రచయిత అయితే.. ఒక మంచి పుస్తకాన్న బహమతిగా ఇవ్వండి. వారికి టెడ్డీ బేర్, ఫ్లవర్ బొకే కంటే కూడా పుస్తకం ఇస్తే వచ్చే ఆనందానికి అవధులు ఉంవడట. అదీ సర్ ప్రైజింగ్‌గా ప్రియ నేస్తం ఇంటికి డెలివరీ చేస్తే ఇంకా మంచిది.
మధురమైన చాక్లెట్‌పాటు, మసాజ్ సెషన్ గిఫ్ట్ ఇవ్వడం లేటెస్ట్ ట్రెండ్, చాక్లెట్లు మన శరీరంలో సంతోషకరమైన డోపమైన్, ఎండార్ఫిన్లు, ఆక్సిటోసిన్ సెరోటోనిన్ హార్మోన్లను విడుదల చేస్తే, మసాజ్ మనస్సును రిలాక్స్ అయ్యేలా చేసిన కొత్త ఉత్సాహాన్నిస్తుంది. అందుకే అర్బన్ కంపెనీ లేదా ఇంట్లో సెలూన్ సర్వీస్‌ను అందించే ఇతర సంస్థల ద్వారా మంచి మసాజ్ సెషన్‌ను బుక్ చేస్తున్నారట.
సాధారణంగా ఇచ్చే గిఫ్ట్స్
కేక్
గులాబీలు
హ్యాండ్ బ్యాగ్, స్లింగ్ బ్యాగ్
స్పెషల్‌గా డిజైన్ చేససిన కాఫీ కప్స్
స్వీట్లు
చాక్లెట్లు
టెడ్డీ బేర్స్
హార్ట్ షేప్ కుషన్లు
సీసాలో ప్రేమ లేఖలు
షాపింగ్ కూపన్లు
ఫస్ట్ డేటింగ్ డేట్‌ను గుర్తు చేసేలా ఒక గిఫ్ట్
మాంచి రొమాంటిక్ సాంగ్స్, మ్యూజిక్‌తో స్లైడ్‌షో
డేట్ నైట్ ఐడియా కార్డ్‌లు
రొమాంటిక్ షోపీస్
గిఫ్ట్ బాక్స్‌లు/గిఫ్ట్ హాంపర్లు
క్యూట్ అండ్ రొమాంటిక్ ల్యాంప్స్
బంగారు, డైమండ్ నగలు
స్మార్ట్ ఫోన్లు, వాచెస్, ఇతర గాడ్జెస్ట్స్
Comments
Please login to add a commentAdd a comment