హోరాహోరీగా బిలియర్డ్స్ పోటీలు
రాజమహేంద్రవరం సిటీ : ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి బిలియర్డ్స్ చాంపియన్‌షిప్-2017 టోర్నమెంట్‌లో భాగంగా రెండోరోజు శుక్రవారం పోటీలు హోరాహోరీగా జరిగాయి. రెండు రాష్ట్రాల నుంచి 28 మంది క్రీడాకారులు పోటీల్లో తలపడుతున్నారు. గురు,శుక్రవారాల్లో జరిగిన పోటీల్లో విజేతలకు శనివారం ఫైనల్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకుడు సుబ్బారావు తెలిపారు.