ఆటంబరంగా
ఆటంబరంగా
Published Thu, Feb 16 2017 11:04 PM | Last Updated on Tue, Sep 5 2017 3:53 AM
ఘనంగా ప్రారంభమైన క్రీడా సంబరాలు
ముఖ్యఅతి«థులుగా హాజరైన ఆర్థికమంత్రి యనమల, రాజప్ప
భానుగుడి(కాకినాడ) : రాష్ట్రస్థాయి జర్నలిస్టుల క్రీడా పోటీలు గురువారం కాకినాడ జర్నలిస్టుల క్రీడోత్సవ్–2017 పేరుతో ఘనంగా ప్రారంభమయ్యాయి. 13 జిల్లాల నుంచి క్రికెట్, కబడ్డీ, షటిల్ పోటీలకు సంబంధించి 300కు పైగా క్రీడాకారులు పాల్గొంటున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు. కార్యక్రమానికి ముఖ్యఅతి«థిగా రాష్ట్ర ఆర్థికశాఖా మంత్రి యనమల రామకృష్ణుడు హాజరై మాట్లాడుతూ.. మానసిక ఒత్తిడిని దూరం చేసే క్రీడా పోటీల్లో జర్నలిస్టులు పాల్గొనడం శుభపరిణామమన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను, క్రీడా జెండాను ఆవిష్కరించి పోటీలను ప్రారంభించారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ ఏటా ఉప్పలగుప్తంలో వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నామని, ఈ పోటీలకు దేశ, విదేశాల నుంచి క్రీడాకారులు పాల్గొంటారన్నారు. జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా ఒక టోర్నీని నిర్వహించడం ఆహ్వానించదగ్గదని, నాయకులు ఎంత బిజీగా ఉంటారో జర్నలిస్టులు సైతం అంతే బిజీగా ఉంటారన్నారు. కార్యక్రమానికి కాకినాడ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు వి.సి.వెంకటపతిరాజు మాట్లాడుతూ రాష్ట్రం నలుమూలల నుంచి జర్నలిస్టులు ఈ పోటీల్లో పాల్గొంటారన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా ఈ క్రీడాపోటీలు నిర్వహించి జర్నలిస్టులకు ప్రశంసాపత్రం, నగదు బహుమతి అందివ్వాలని, ఈ పోటీల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ నామనరాంబాబు, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు, ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజు, జేఎన్‌టీయూకే వీసీ కుమార్, శాప్ ఎండీ నల్లపురాజు బంగార్రాజు, జిల్లాగ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎన్.వీర్రెడ్డి, డీఎస్‌డీఓ మురళీధర్, డీఈవో పి.అబ్రహం తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement