sport
-
బంగ్లా రెండో టెస్ట్ లో మార్పు ఆ స్టార్ ప్లేయర్ ని తీసుకుంటున్న రోహిత్
-
2026 ఆసియా క్రీడల్లో ప్రదర్శన క్రీడగా ‘యోగాసన’
న్యూఢిల్లీ: భారతదేశ ప్రాచీన వ్యాయామ పద్ధతి ‘యోగాసన’కు ఆసియా క్రీడల్లో చోటు దక్కింది. 2026లో జపాన్‌లోని ఐచీ–నగోయాలో జరగనున్న ఆసియా క్రీడల్లో యోగాసనను ప్రదర్శన ఈవెంట్‌గా చేర్చుతున్నట్లు ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (ఓసీఏ) ప్రకటించింది. ఆదివారం జరిగిన 44వ ఓసీఏ సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఓసీఏ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన రణ్‌దీర్ సింగ్ మాట్లాడుతూ... ‘2026 ఆసియా క్రీడల్లో యోగా భాగం కానుంది. దీనికి అందరి ఆమోదం లభించింది. అన్ని సభ్య దేశాలను ఒప్పించేందుకు పది రోజుల సమయం పట్టింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యోగాను ప్రతి ఒక్కరి జీవితంలో భాగం చేసేందుకు విశేష కృషి చేస్తున్నారు. ఆ దిశగా ఇది మరో ముందడుగు వంటింది. 2030 ఆసియా క్రీడల వరకు యోగాను పతక క్రీడల్లో భాగం చేసేలా చూస్తాం’ అని అన్నారు. -
లక్నో హ్యాట్రిక్ విక్టరీ.. టైటాన్స్ తప్పని పరాభవం
-
ఇండోనేసియా మాస్టర్స్ టోర్నీకి సాత్విక్ జోడీ దూరం
-
భారత్ థ్రిల్లింగ్ విక్టరీ
-
ఐపీఎల్ 2022 టైటిల్ నీదా? నాదా?
-
IND vs PAK: దాయాదుల సమరంపై సర్వత్రా ఉత్కంఠ..
-
కోహ్లి నిర్ణయం సరైందే
-
యోగాకు సౌదీ గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ : సౌదీ ప్రభుత్వం మంగళవారం యోగాపై అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. యోగాభ్యాసం అనేది ఒక క్రీడ.. దానిని అందరూ నేర్చుకోవచ్చు అంటూ సౌదీ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. యోగా శిక్షణలో లైసెన్స్ ఉన్న టీచర్ల వద్ద ఎవరైనా యోగా నేర్చుకోవచ్చని సౌదీ ప్రభుత్వం తెలిపింది. సౌదీ అరేబియాలో యోగా గుర్తింపు కోసం నూఫ్ మార్వాయి అనే మహిళ అనితర సాధ్యమైన పోరాటాన్ని నిర్వహించి విజయం సాధించింది. సౌదీలో మొదటి యోగా ట్రైనర్‌గా గుర్తింపు తెచ్చుకున్న నూఫ్ మార్వాయి.. యోగాకు మతానికి సంబంధం లేదని మొదటి నుంచి వాదిస్తున్నారు. సౌదీ, గల్ఫ్ ప్రాంతాల్లో యోగా, ఆయుర్వేదాన్ని నూఫ్ చాలాకాలంగా ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం యూఫ్‌ను యోగాచారిణిగా గుర్తింపు తెచ్చుకుంది. మధ్యప్రాచ్య దేశాలైన సౌదీ అరేబియా యోగాను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో భారత్‌లోని ముస్లిం మత పెద్దలు తమ అభిప్రాయాన్ని మార్చుకోవాలని పలుపురు పలుపునిస్తున్నారు. ముస్లిం రాజ్యమైన సౌదీలో ఒక ముస్లిం యువతి యోగా నేర్పుతున్న నేపథ్యంలో.. రాంచీలోని రఫియా నాజ్‌పై ముస్లింలు దాడి చేయడాన్ని పలువురు ఖండిస్తున్నారు. -
ఆటంబరంగా
ఘనంగా ప్రారంభమైన క్రీడా సంబరాలు ముఖ్యఅతి«థులుగా హాజరైన ఆర్థికమంత్రి యనమల, రాజప్ప భానుగుడి(కాకినాడ) : రాష్ట్రస్థాయి జర్నలిస్టుల క్రీడా పోటీలు గురువారం కాకినాడ జర్నలిస్టుల క్రీడోత్సవ్–2017 పేరుతో ఘనంగా ప్రారంభమయ్యాయి. 13 జిల్లాల నుంచి క్రికెట్, కబడ్డీ, షటిల్ పోటీలకు సంబంధించి 300కు పైగా క్రీడాకారులు పాల్గొంటున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు. కార్యక్రమానికి ముఖ్యఅతి«థిగా రాష్ట్ర ఆర్థికశాఖా మంత్రి యనమల రామకృష్ణుడు హాజరై మాట్లాడుతూ.. మానసిక ఒత్తిడిని దూరం చేసే క్రీడా పోటీల్లో జర్నలిస్టులు పాల్గొనడం శుభపరిణామమన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను, క్రీడా జెండాను ఆవిష్కరించి పోటీలను ప్రారంభించారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ ఏటా ఉప్పలగుప్తంలో వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నామని, ఈ పోటీలకు దేశ, విదేశాల నుంచి క్రీడాకారులు పాల్గొంటారన్నారు. జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా ఒక టోర్నీని నిర్వహించడం ఆహ్వానించదగ్గదని, నాయకులు ఎంత బిజీగా ఉంటారో జర్నలిస్టులు సైతం అంతే బిజీగా ఉంటారన్నారు. కార్యక్రమానికి కాకినాడ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు వి.సి.వెంకటపతిరాజు మాట్లాడుతూ రాష్ట్రం నలుమూలల నుంచి జర్నలిస్టులు ఈ పోటీల్లో పాల్గొంటారన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా ఈ క్రీడాపోటీలు నిర్వహించి జర్నలిస్టులకు ప్రశంసాపత్రం, నగదు బహుమతి అందివ్వాలని, ఈ పోటీల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ నామనరాంబాబు, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు, ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజు, జేఎన్టీయూకే వీసీ కుమార్, శాప్ ఎండీ నల్లపురాజు బంగార్రాజు, జిల్లాగ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎన్.వీర్రెడ్డి, డీఎస్డీఓ మురళీధర్, డీఈవో పి.అబ్రహం తదితరులు పాల్గొన్నారు. -
సలామ్ ఫౌజా సింగ్
102 సంవత్సరాలు... ఓ మనిషి ఇన్నేళ్లు బతకడమంటేనే అత్యంత అరుదైన విషయం.. ఓ వేళ బతికినా చక్రాల కుర్చీకో.. ఓ గదికో పరిమితమవడం సహజం.. కానీ ఫౌజా సింగ్ కథ వేరు.. ఈయన దృష్టిలో వయస్సు అనేది కేవలం సంఖ్య మాత్రమే... ఎందుకంటే ఈ ప్రపంచంలో అత్యంత ఎక్కువ వయస్సు కలిగిన మారథాన్ రన్నర్ ఆయనే... ఇంకా విచిత్రమేమిటంటే 89 ఏళ్ల ముదిమి వయస్సులో ఈ క్రీడను ఆయన సీరియస్‌గా తీసుకోవడం. ఏదో మామూలుగా కాకుండా 9 ఫుల్ మారథాన్‌లో పాల్గొని ఎందరో యువ రన్నర్లకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.. ఇప్పటికీ రోజూ నాలుగు గంటలపాటు వాకింగ్, రన్నింగ్, జాగింగ్ చేయనిదే ఆయన దినచర్య ప్రారంభం కాదు.. అందుకే ఈ ఫౌ(జియో)జాకు ఎవరైనా సలామ్ కొట్టాల్సిందే.. 1911, ఏప్రిల్ 1...పంజాబ్‌లోని జలంధర్‌లో ఫౌజా సింగ్ జన్మించాడు. నలుగురు పిల్లల్లో చివరివాడు. చిన్నప్పుడు అతడి కాళ్లు చాలా సన్నగా, బలహీనంగా వుండడంతో ఐదేళ్లు వచ్చే వరకు అసలు నడవలేకపోయాడు. తోటి పిల్లల హేళనను సవాల్‌గా తీసుకున్న తను యుక్త వయస్సులో రన్నర్‌గా మారాడు. అయితే భారత్, పాక్ విభజన సమయంలో దీనికి తెర దించాడు. ఆ తర్వాత 90వ దశకంలో తన జీవితంలో కొన్ని విషాద సంఘటనలు జరిగాయి. తన భార్య, కుమారుడు, కుమార్తె వివిధ కారణాల రీత్యా మరణించడంతో ఒంటరి వాడైన ఫౌజా తిరిగి రన్నింగ్‌పై దృష్టి పెట్టాడు. ఇదే సమయంలో ఇంగ్లండ్ వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. 89 ఏళ్ల వయస్సులో ఇక మారథాన్‌పై సీరియస్‌గా తీసుకున్నాడు. ఆ వయస్సులో తను సులువుగా 20 కి.మీ పరిగెత్తే వాడు. అందుకే మారథాన్‌లో పాల్గొనాలని భావించాడు. అయితే ఇక్కడ తను 26 మైళ్ల (42 కి.మీ.)కు బదులు మారథాన్ 26 కి.మీ దూరం ఉంటుందని భావించాడు. కోచ్ అసలు విషయం వివరించడంతో ఆ దూరాన్ని సవాల్‌గా తీసుకుని తదేక దీక్షతో ప్రాక్టీస్ చేశాడు. ప్రపంచ రికార్డు... 2000, లండన్ మారథాన్. అందరి దృష్టీ 89 ఏళ్ల ఫౌజా సింగ్ పైనే. ఏదో సరదాకి వచ్చాడనే అనుకున్నారంతా. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రేసును పూర్తి చేశాడు. 2003లో ఇదే రేసును 6 గంటల 2 నిమిషాల్లో పూర్తి చేసి తన అత్యుత్తమ సమయాన్ని నమోదు చేశాడు. ఇక 2004లో ఈ పంజాబీ పుత్తర్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. 93 ఏళ్ల వయస్సులో 26.2 మైళ్ల దూరాన్ని 6 గంటల 54 ని.ల్లో అధిగమించి ఔరా! అనిపించుకున్నాడు. ఎందుకంటే అప్పటిదాకా 90+ వ్యక్తుల కన్నా 58 నిమిషాల తక్కువ వ్యవధిలోనే ఆ రేసును పూర్తి చేయగలిగాడు. అలాగే తన వయస్సు కేటగిరీల్లో 200మీ. 400మీ. 800మీ. 3000మీ. రేసులో యూకే రికార్డులన్నీ తన పేరిటే ఉన్నాయి. వందేళ్ల వయస్సులో ఒకే రోజు 8 రేసులను పరిగెత్తిన ఫౌజా ప్రపంచ రికార్డు సృష్టించాడు.