యోగాకు సౌదీ గ్రీన్‌ సిగ్నల్‌ | Saudi Arabia approves yoga as sport | Sakshi
Sakshi News home page

యోగాకు సౌదీ గ్రీన్‌ సిగ్నల్‌

Nov 14 2017 5:52 PM | Updated on Nov 14 2017 5:52 PM

 Saudi Arabia approves yoga as sport - Sakshi

న్యూఢిల్లీ : సౌదీ ప్రభుత్వం మంగళవారం యోగాపై అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. యోగాభ్యాసం అనేది ఒక క్రీడ.. దానిని అందరూ నేర్చుకోవచ్చు అంటూ సౌదీ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.  యోగా శిక్షణలో లైసెన్స్‌ ఉన్న టీచర్ల వద్ద ఎవరైనా యోగా నేర్చుకోవచ్చని సౌదీ ప్రభుత్వం తెలిపింది.  సౌదీ అరేబియాలో యోగా గుర్తింపు కోసం నూఫ్‌ మార్వాయి అనే మహిళ అనితర సాధ్యమైన పోరాటాన్ని నిర్వహించి విజయం సాధించింది. సౌదీలో మొదటి యోగా ట్రైనర్‌గా గుర్తింపు తెచ్చుకున్న నూఫ్‌ మార్వాయి.. యోగాకు మతానికి సంబంధం లేదని మొదటి నుంచి వాదిస్తున్నారు.  సౌదీ, గల్ఫ్‌ ప్రాంతాల్లో యోగా, ఆయుర్వేదాన్ని నూఫ్‌ చాలాకాలంగా ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం యూఫ్‌ను యోగాచారిణిగా గుర్తింపు తెచ్చుకుంది.

మధ్యప్రాచ్య దేశాలైన సౌదీ అరేబియా యోగాను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో భారత్‌లోని ముస్లిం మత పెద్దలు తమ అభిప్రాయాన్ని మార్చుకోవాలని పలుపురు పలుపునిస్తున్నారు. ముస్లిం రాజ్యమైన సౌదీలో ఒక ముస్లిం యువతి యోగా నేర్పుతున్న నేపథ్యంలో.. రాంచీలోని రఫియా నాజ్‌పై ముస్లింలు దాడి చేయడాన్ని పలువురు ఖండిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement