ఎస్‌జీఎస్ అండర్–19 బాస్కెట్‌బాల్ పోటీలు ప్రారంభం
ఎస్‌జీఎస్ అండర్–19 బాస్కెట్‌బాల్ పోటీలు ప్రారంభం
Published Wed, Dec 28 2016 10:17 PM | Last Updated on Mon, Sep 4 2017 11:49 PM
రామచంద్రపురం : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–19 బాల బాలికల 62వ అంతర్ జిల్లాల బాస్కెట్‌బాల్ పోటీలు స్థానిక కృత్తి వెంటి పేర్రాజు పంతులు జాతీయ ఉన్నత పాఠశాలలో బుధవారం ప్రారంభమయ్యాయి. కృత్తివెంటి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల ఎం సూర్యమోహన్ అద్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇన్‌ఛార్జ్ చైర్మన్ మేడిశెట్టి సూర్యనారాయణ ఎస్‌జీఎస్ పతాకాన్ని ఆవిష్కరించి పోటీలు ప్రారంభించారు. జిల్లా వృత్తి విద్యాధికారిణి కె హెప్సీరాణి ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎస్‌జీఎఫ్–19 జిల్లా కార్యదర్శి వై.తాతబ్బాయి మాట్లాడుతూ ఈ పోటీలకు 12 జిల్లాల నుంచి బాలురు, 10 జిల్లాల నుంచి బాలికలు పాల్గొంటున్నారన్నారు. ఈనెల 30వరకు ఈ పోటీలు జరుగుతాయన్నారు. ఎస్‌జీఎఫ్ ఏపీ ప్రతినిధి, అబ్జర్వర్ వి సీతాపతిరావు మాట్లాడుతూ జనవరి 9 నుంచి జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ పోటీలు కృష్ణాజిల్లా నూజివీడులో జరుగుతున్నాయన్నారు. ఈ పోటీలో పాల్గొనే రాష్ట్ర జట్టు ఎంపిక రామచంద్రపురంలో జరుగుతుందన్నారు. రాష్ట్ర బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గన్నమని చక్రవర్తి, బాస్కెట్‌బాల్ సీనియర్ క్రీడాకారులు బాలకృష్ణారెడ్డి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల ముత్యాల సత్యనారాయణ, హెచ్‌ఎం జీ రాంప్రసాద్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కనకాల వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement