బాస్కెట్‌బాల్ చాంపియన్ ఎస్‌వీకేపీ
బాస్కెట్‌బాల్ చాంపియన్ ఎస్‌వీకేపీ
Published Tue, Nov 22 2016 11:54 PM | Last Updated on Mon, Sep 4 2017 8:49 PM
భానుగుడి (కాకినాడ): ఆదికవి నన్నయ వర్సిటీ మహిళా బాస్కెట్‌బాల్ జట్టు చాంపియన్‌గా పెనుగొండకు చెందిన ఎస్‌వీకేపీ కళాశాల నిలిచింది. పలు కళాశాల జట్లతో పోటీపడి నాకౌట్‌లో ఆడిన అన్ని మ్యాచ్‌లను గెలిచి విజేతగా నిలిచింది. అంతర్ వర్సిటీ బాస్కెట్‌బాల్ పోటీలలో పాల్గొనే నన్నయవర్సిటీ జట్టు ఎంపికకు గాను ఈ పోటీలు నిర్వహించిన విషయం తెలిసిందే. మంగళవారం నిర్వహించిన ముగింపు వేడుకలకు అధ్యక్షత వహించిన అంతర కళాశాలల బాస్కెట్ బాల్ కన్వీనర్ బీఈవీఎల్ నాయుడు మాట్లాడుతూ వర్సిటీ తరఫున ఎంపికయిన మహిళా బాస్కెట్ బాల్‌జట్టు సౌత్‌జోన్ చాంపియన్ లుగా నిలవాలని కాంక్షించారు. కేరళలోని కాలికట్ వర్సిటీలో జరిగే సౌత్‌జోన్ పోటీల్లో ప్రస్తుతం ఎంపికయిన బృందం ఆడుతుందని నన్నయ వర్సిటీ ఫిజికల్ డైరెక్టర్, స్పోర్ట్స్ బోర్డ్ కార్యదర్శి ఎ.సత్యనారాయణ తెలిపారు. ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ ఎన్ .శేషారెడ్డి, డైరెక్టర్ ఎన్ .సుగుణారెడ్డి, రంగరాయ మెడికల్ కళాశాల పీడీ స్పర్జన్ రాజు పాల్గొన్నారు.
విజేతలు వీరే : నన్నయ వర్సిటీ పరిధిలోని అంతర కళాశాలల మహిళా బాస్కెట్‌బాల్ చాంపియ¯ŒSషిప్ పోటీలలో పెనుగొండ ఎస్‌కేవీపీ కళాశాల ప్రథమ స్థానం సాధించగా, ఏలూరుకు చెందిన సెయింట్ థెరిసా కళాశాల ద్వితీయ స్థానం, తణుకుకు చెందిన ఎస్‌కేఎస్‌డీ మహిళా కళాశాల తృతీయస్థానం సాధించాయి. కాకినాడ ఆదిత్య డిగ్రీకళాశాల జట్టు నాలుగోస్థానంలో నిలిచింది.
సౌత్ జోన్ జట్టు సభ్యులు వీరే
2016–17 విద్యాసంవత్సరంలో నన్నయ వర్సిటీ తరఫున సౌత్‌జోన్ అంతర్ వర్సిటీ బాస్కెట్‌బాల్ టోర్నీకి 12మంది సభ్యులతో కూడిన టీమ్‌ను ఎంపిక చేశారు. ఇందులో బి.పూర్ణసాయిజ్యోతి, ఎస్‌కే హాఫిజున్నీషా, ఎస్‌కే అనిషా, సీహెచ్.కారుణ్య, కే.నాగశిరీష, సీహెచ్.శ్రావణి, ఎం.సాయికుమారి, కే శ్యామల, ఎన్ .సాయిభవానీ, జి.లలిత, జి.బేబీ సరోజినీ, ఎస్‌కే.షహనాజ్‌లు ఎంపికయ్యారు. ఎన్ .తేజసాయి సత్య, టి.పావని, సీహెచ్ వల్లివైష్ణవి, పి.రాణి, డి.వాణి, సత్యలక్ష్మి, కేవీఆర్‌రాజ్యలక్ష్మి స్టాండ్‌బైగా ఎంపికయ్యారు.
విద్యుత్ సంస్థలో ప్రైవేటీకరణను నిలిపివేయాలి
Advertisement