జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు ఎంపిక
జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు ఎంపిక
Published Mon, Dec 19 2016 10:42 PM | Last Updated on Mon, Sep 4 2017 11:07 PM
రాష్ట్ర టీమ్‌లో జిల్లా నుంచి 'ఫణీంద్ర' ప్రాతినిధ్యం
వచ్చె నెల చత్తీస్‌ఘడ్‌లో పోటీలు
కొత్తపేట : జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ అండర్ –17 పోటీలకు కొత్తపేట ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థి పాటి ఫణీంద్రసాయి ఎంపికయ్యాడు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 13,14,15 తేదీల్లో చిత్తూరులో జరిగిన రాష్ట్ర స్థాయి బాస్కెట్‌బాల్ పోటీల్లో జిల్లా జట్టులో పాల్గొన్న ఫణీంద్రసాయి అత్యుత్తమ ప్రతిభ కనపరచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్టు పాఠశాల హెచ్‌ఎం జి.సూర్యప్రకాశరావు సోమవారం తెలిపారు. చత్తీస్‌ఘడ్ రాష్ట్రం రాజనందిగామ్‌లో జనవరిలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో ఏపీ స్టేట్ టీమ్ 12 మందిలో (6వ) స్థానానికి ఎంపికైనట్టు తెలిపారు. జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ పోటీల్లో ప్రతిభ చూపుతానని ఫణీంద్రసాయి ఈ సందర్భంగా తెలిపారు. పాఠశాల పీడీ, పీఈటీ పర్యవేక్షణలో శిక్షణ పొందుతున్నాని వివరించారు. ఫణీంద్రసాయిని హెచ్‌ఎం జి.సూర్యప్రకాశరావు, ఎన్‌సీసీ ఆఫీసర్ ఉప్పలపాటి మాచిరాజు, పీడీ భమిడిపాటి అప్పాజీ, పీఈటీ పి.జ్యోతి అభినందించారు.
Advertisement