Basket
-
మంథనిలో బాహుబలి సీన్ రిపీట్
-
ఎస్జీఎస్ అండర్–19 బాస్కెట్‌బాల్ పోటీలు ప్రారంభం
రామచంద్రపురం : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–19 బాల బాలికల 62వ అంతర్ జిల్లాల బాస్కెట్‌బాల్ పోటీలు స్థానిక కృత్తి వెంటి పేర్రాజు పంతులు జాతీయ ఉన్నత పాఠశాలలో బుధవారం ప్రారంభమయ్యాయి. కృత్తివెంటి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల ఎం సూర్యమోహన్ అద్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇన్ఛార్జ్ చైర్మన్ మేడిశెట్టి సూర్యనారాయణ ఎస్జీఎస్ పతాకాన్ని ఆవిష్కరించి పోటీలు ప్రారంభించారు. జిల్లా వృత్తి విద్యాధికారిణి కె హెప్సీరాణి ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎస్జీఎఫ్–19 జిల్లా కార్యదర్శి వై.తాతబ్బాయి మాట్లాడుతూ ఈ పోటీలకు 12 జిల్లాల నుంచి బాలురు, 10 జిల్లాల నుంచి బాలికలు పాల్గొంటున్నారన్నారు. ఈనెల 30వరకు ఈ పోటీలు జరుగుతాయన్నారు. ఎస్జీఎఫ్ ఏపీ ప్రతినిధి, అబ్జర్వర్ వి సీతాపతిరావు మాట్లాడుతూ జనవరి 9 నుంచి జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ పోటీలు కృష్ణాజిల్లా నూజివీడులో జరుగుతున్నాయన్నారు. ఈ పోటీలో పాల్గొనే రాష్ట్ర జట్టు ఎంపిక రామచంద్రపురంలో జరుగుతుందన్నారు. రాష్ట్ర బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గన్నమని చక్రవర్తి, బాస్కెట్‌బాల్ సీనియర్ క్రీడాకారులు బాలకృష్ణారెడ్డి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల ముత్యాల సత్యనారాయణ, హెచ్ఎం జీ రాంప్రసాద్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కనకాల వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు ఎంపిక
రాష్ట్ర టీమ్‌లో జిల్లా నుంచి 'ఫణీంద్ర' ప్రాతినిధ్యం వచ్చె నెల చత్తీస్‌ఘడ్‌లో పోటీలు కొత్తపేట : జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ అండర్ –17 పోటీలకు కొత్తపేట ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థి పాటి ఫణీంద్రసాయి ఎంపికయ్యాడు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 13,14,15 తేదీల్లో చిత్తూరులో జరిగిన రాష్ట్ర స్థాయి బాస్కెట్‌బాల్ పోటీల్లో జిల్లా జట్టులో పాల్గొన్న ఫణీంద్రసాయి అత్యుత్తమ ప్రతిభ కనపరచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్టు పాఠశాల హెచ్ఎం జి.సూర్యప్రకాశరావు సోమవారం తెలిపారు. చత్తీస్ఘడ్ రాష్ట్రం రాజనందిగామ్లో జనవరిలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో ఏపీ స్టేట్ టీమ్ 12 మందిలో (6వ) స్థానానికి ఎంపికైనట్టు తెలిపారు. జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ పోటీల్లో ప్రతిభ చూపుతానని ఫణీంద్రసాయి ఈ సందర్భంగా తెలిపారు. పాఠశాల పీడీ, పీఈటీ పర్యవేక్షణలో శిక్షణ పొందుతున్నాని వివరించారు. ఫణీంద్రసాయిని హెచ్ఎం జి.సూర్యప్రకాశరావు, ఎన్సీసీ ఆఫీసర్ ఉప్పలపాటి మాచిరాజు, పీడీ భమిడిపాటి అప్పాజీ, పీఈటీ పి.జ్యోతి అభినందించారు. -
బాస్కెట్‌బాల్ చాంపియన్ ఎస్వీకేపీ
భానుగుడి (కాకినాడ): ఆదికవి నన్నయ వర్సిటీ మహిళా బాస్కెట్‌బాల్ జట్టు చాంపియన్‌గా పెనుగొండకు చెందిన ఎస్వీకేపీ కళాశాల నిలిచింది. పలు కళాశాల జట్లతో పోటీపడి నాకౌట్లో ఆడిన అన్ని మ్యాచ్‌లను గెలిచి విజేతగా నిలిచింది. అంతర్ వర్సిటీ బాస్కెట్‌బాల్ పోటీలలో పాల్గొనే నన్నయవర్సిటీ జట్టు ఎంపికకు గాను ఈ పోటీలు నిర్వహించిన విషయం తెలిసిందే. మంగళవారం నిర్వహించిన ముగింపు వేడుకలకు అధ్యక్షత వహించిన అంతర కళాశాలల బాస్కెట్ బాల్ కన్వీనర్ బీఈవీఎల్ నాయుడు మాట్లాడుతూ వర్సిటీ తరఫున ఎంపికయిన మహిళా బాస్కెట్ బాల్జట్టు సౌత్‌జోన్ చాంపియన్ లుగా నిలవాలని కాంక్షించారు. కేరళలోని కాలికట్ వర్సిటీలో జరిగే సౌత్‌జోన్ పోటీల్లో ప్రస్తుతం ఎంపికయిన బృందం ఆడుతుందని నన్నయ వర్సిటీ ఫిజికల్ డైరెక్టర్, స్పోర్ట్స్ బోర్డ్ కార్యదర్శి ఎ.సత్యనారాయణ తెలిపారు. ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ ఎన్ .శేషారెడ్డి, డైరెక్టర్ ఎన్ .సుగుణారెడ్డి, రంగరాయ మెడికల్ కళాశాల పీడీ స్పర్జన్ రాజు పాల్గొన్నారు. విజేతలు వీరే : నన్నయ వర్సిటీ పరిధిలోని అంతర కళాశాలల మహిళా బాస్కెట్‌బాల్ చాంపియ¯ŒSషిప్ పోటీలలో పెనుగొండ ఎస్‌కేవీపీ కళాశాల ప్రథమ స్థానం సాధించగా, ఏలూరుకు చెందిన సెయింట్ థెరిసా కళాశాల ద్వితీయ స్థానం, తణుకుకు చెందిన ఎస్‌కేఎస్‌డీ మహిళా కళాశాల తృతీయస్థానం సాధించాయి. కాకినాడ ఆదిత్య డిగ్రీకళాశాల జట్టు నాలుగోస్థానంలో నిలిచింది. సౌత్ జోన్ జట్టు సభ్యులు వీరే 2016–17 విద్యాసంవత్సరంలో నన్నయ వర్సిటీ తరఫున సౌత్‌జోన్ అంతర్ వర్సిటీ బాస్కెట్‌బాల్ టోర్నీకి 12మంది సభ్యులతో కూడిన టీమ్‌ను ఎంపిక చేశారు. ఇందులో బి.పూర్ణసాయిజ్యోతి, ఎస్కే హాఫిజున్నీషా, ఎస్కే అనిషా, సీహెచ్.కారుణ్య, కే.నాగశిరీష, సీహెచ్.శ్రావణి, ఎం.సాయికుమారి, కే శ్యామల, ఎన్ .సాయిభవానీ, జి.లలిత, జి.బేబీ సరోజినీ, ఎస్కే.షహనాజ్‌లు ఎంపికయ్యారు. ఎన్ .తేజసాయి సత్య, టి.పావని, సీహెచ్ వల్లివైష్ణవి, పి.రాణి, డి.వాణి, సత్యలక్ష్మి, కేవీఆర్రాజ్యలక్ష్మి స్టాండ్‌బైగా ఎంపికయ్యారు. విద్యుత్ సంస్థలో ప్రైవేటీకరణను నిలిపివేయాలి -
మక్క బుట్టలకూ గిరాకే
బట్టీల్లో పెరిగిన బుట్టల వినియోగం గంపకు రూ.70 వెచ్చించి కొనుగోలు బాల్కొండ: రైతు సాగు చేసిన ప్రతి వస్తువూ ఉపయోగకరమే. ఒకప్పుడు మొక్కజొన్న నూర్పిడి తర్వాత వచ్చే బుట్టను వంటకు ఉపయోగించే వారు. తమకు అవసరమైనంత మేరకు ఉంచుకొని మిగతాది తెలిసిన వారికి ఇచ్చే వారు. అయితే, సిలిండర్ల వాడకం పెరిగిపోయిన నేపథ్యంలో మక్క బుట్టల వినియోగం చాలా తగ్గింది. అయితే, ఇప్పుడదే బుట్టకు వ్యాపారుల నుంచి భారీగా డిమాండ్ ఏర్పడింది. ఒక్కో బుట్ట గంప రూ.70 పలుకుతోంది. ఖరీఫ్‌లో సాగు చేసిన మొక్కజొన్న పంటను ప్రస్తుతం నూర్పిడి చేస్తున్నారు. బుట్ట నుంచి వేరు చేసిన మక్కలను విక్రయిస్తున్నారు. అయితే, బుట్టకు కూడా డిమాండ్ ఏర్పడడంతో దాన్నీ విక్రయిస్తున్నారు. మన జిల్లాతో పాటు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వ్యాపారులు బాల్కొండ మండలానికి వస్తున్నారు. గ్రామాల్లో సంచరిస్తూ బుట్ట గంపకు రూ.70 చొప్పున చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ప్యాలాలు, అటుకుల తయారీ బట్టీలో ఈ బుట్టలను వినియోగిస్తామని వ్యాపారులు చెబుతున్నారు. వడ్ల నుంచి ప్యాలలు, బియ్యం నుంచి అటుకులు, మక్కల నుంచి మక్క ప్యాలాలు తీయడానికి వంట చెరుకు చాలా అవసరం. అయితే, వంట చెరుకు స్థానంలో మక్క బుట్టలు వినియోగిస్తున్నారు. దీంతో బుట్టలకు మంచి గిరాకీ ఏర్పడింది. వ్యాపారులు గ్రామాలకు వచ్చి వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ రూ.70లకు ఒక్కో గంప కొంటున్న వ్యాపారులు.. రూ.120 చొప్పున ప్యాలాల వ్యాపారులకు విక్రయిస్తున్నారు. మొక్కజొన్న కంకులు నూర్పిడి చేయడం వలన మక్క బుట్టలు వస్తాయి. ప్రస్తుతం సిలిండర్ వాడకం ఎక్కువ కావడం వలన మక్క బుట్టలను రైతులు వినియోగించడం లేదు. అయితే, ఈ బుట్టలను పసుపు ఉడికించే యంత్రాల్లో వినియోగించ వచ్చు. కానీ కూలీలు వాటిని వాడకపోవడంతో ఇలా వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఇలా రైతులకు ఎంతో కొంత ఆదాయం కలిసి వస్తోంది. బట్టీల్లో విక్రయిస్తాం రైతుల నుంచి మక్క బుట్టలు కొనుగోలు చేసి ప్యాలాలు, అటుకుల బట్టీలకు విక్రయిస్తాం, కొన్నిసార్లు లాభాలు వస్తాయి, కొన్నిసార్లు నష్టం వస్తుంది. – అమర్ సింగ్, వ్యాపారి, పిట్లం డిమాండ్ ఎక్కువగా ఉంది మక్క బుట్టలకు ఎక్కువ డిమాండ్ ఉంది. అందుకే గ్రామాల్లో తిరుగుతూ బుట్టలను కొనుగోలు చేస్తున్నాం. గంపకు రూ.70 పెడుతున్నాం. రైతులు అధికంగానే విక్రయిస్తున్నారు. – బాలుసింగ్, వ్యాపారి, పిట్లం -
సూపర్... షాపింగ్!
జాగ్రత్త సూపర్మార్కెట్లో షాపింగ్ చేయడంలో ఒక సౌకర్యం ఉంటుంది. దైనందిన జీవితంలో అవసరమయ్యే వస్తువుల్లో చాలా భాగం ఒకే ప్రదేశంలో దొరుకుతాయి. జాబితా రాసుకోకుండా షాపులో అడుగుపెట్టినా సరే... పోపుల డబ్బాలో ఆవాలు అడుగుకు చేరాయని, ఉప్పు పాకెట్ని ఆసాంతం డబ్బాలో పోసి ప్యాకెట్‌ను పారేశామనీ గుర్తుకు వస్తాయి. ఇక్కడి వరకు బాగానే ఉంటుంది. కానీ, సూపర్‌మార్కెట్ మాయాజాలంలో చెప్పలేనన్ని చమత్కారాలుంటాయి. వాటి మాయలో పడితే పర్సుకు చిల్లుపడడంతోపాటు ఇంటినిండా అవసరంలేని వస్తువులు పెరిగిపోతాయి. అందుకే కొన్ని జాగ్రత్తలు... సాధారణంగా తాజా ఉత్పత్తులను లోపలగా పెట్టి పాత సరుకును చేతికందేలాగ పెట్టడం వ్యాపార లక్షణం. కాబట్టి అరల్లో ముందుగా కనిపిస్తున్నవి కాక లోపలగా అమర్చిన వాటిని తీసుకోవాలి. ఒకటి కొంటే మరొకటి ఉచితం... ఆఫర్లో తీసుకున్నప్పటికీ ఎక్స్పైరీ డేట్ లోపు వాటిని ఉపయోగించగలమా లేదా అని చూసుకోవాలి. జామూన్ మిక్స్, కర్జూరాలకు ఈ ఆఫర్ ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఏదో ఒకటి రెండు ఉత్పత్తులకు తక్కువ ధర పెట్టి వాటి మీద దృష్టి కేంద్రీకృతమయ్యేలా చేయడం వ్యాపార సూత్రం. ఆ రెండింటి ఆధారంగా ఆ దుకాణంలో ధరలు తక్కువ అనే అనుకోకూడదు. సూపర్మార్కెట్లో ట్రాలీకి బదులు బాస్కెట్ వాడితే బాస్కెట్ బరువు పెరిగేకొద్దీ అవసరం లేని చోట నిలపకుండా కొనుగోలు ముగించేస్తారు. ఆకలిగా ఉన్నప్పుడు షాపింగ్ చేస్తే మనకు తెలియకుండానే బాస్కెట్లో ఇంటికి అవసరమైన పప్పుదినుసులు, సబ్బులు, షాంపూలకంటే బిస్కట్లు, చాక్లెట్లు, చిప్స్, జ్యూస్, తినుబండారాలే కనిపిస్తాయి. కంటికి కనిపించే ఎత్తులో ఎక్కువ లాభం వచ్చే ఉత్పత్తులను పెట్టి, తక్కువ లాభం వచ్చే వాటిని పై అరల్లో, కింది అరల్లో సర్దుతారు. తల పెకైత్తి, కిందకు దించి కూడా చూసుకోవాల్సిందే. రాత్రి ఆలస్యంగా షాపింగ్ చేస్తే దుకాణంలో రద్దీ ఉండదు. ఆఖరి గంటలో కూరగాయలు, పాలు, బ్రెడ్ వంటి (మరుసటి రోజుకు తాజాదనం కోల్పోయేవి) వాటి ధరలు తగ్గించవచ్చు.