
హీరోగా 100కి పైగా తెలుగు సినిమాలు చేసిన శ్రీకాంత్.. ఇప్పుడు విలన్, సహాయ పాత్రలు చేస్తున్నాడు. ఈయన కొడుకు రోషన్.. నిర్మలా కాన్వెంట్, పెళ్లి సందD లాంటి మూవీస్ చేశాడు గానీ బ్రేక్ రాలేదు. దీంతో చాలా గ్యాప్ తీసుకుని 'ఛాంపియన్' మూవీ చేస్తున్నాడు.
(ఇదీ చదవండి: Court Movie Review: నాని ‘కోర్ట్’ మూవీ రివ్యూ)
2021లో పెళ్లి సందడి వచ్చింది. శ్రీలీల తొలి తెలుగు సినిమా ఇది. ఈ నాలుగేళ్లలో ఆమె స్టార్ హీరోయిన్ అయిపోగా.. అదే మూవీలో హీరోగా చేసిన రోషన్.. ఇప్పుడు మరో మూవీ మొదలుపెట్టాడు. ఈ రోజు ఇతడి పుట్టినరోజు. ఈ క్రమంలోనే గ్లింప్స్ రిలీజ్ చేశారు.
చూస్తుంటే 90స్ బ్యాక్ డ్రాప్ లో ఫుట్ బాల్ గేమ్ డ్రామాతో నడిచే సినిమా అని అర్థమైంది. మహానటి, సీతారామం చిత్రాల్ని నిర్మించిన వైజయంతీ సంస్థ నిర్మిస్తుండగా.. ప్రదీప్ అద్వైతం దర్శకుడు. మరి ఈ ఏడాది రిలీజ్ చేస్తారో వచ్చే ఏడాది మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారో చూడాలి?
(ఇదీ చదవండి: ఓటీటీల్లో ఈ శుక్రవారం 21 సినిమాలు స్ట్రీమింగ్)
Comments
Please login to add a commentAdd a comment