under19
-
భారత యువ ఆటగాళ్లకిది ఎనిమిదోసారి...
దుబాయ్: అండర్–19 ప్రపంచకప్‌కు ముందు భారత యువ ఆటగాళ్లు అసలైన రీతిలో సన్నద్ధమయ్యారు. ఆసియా స్థాయిలో చాంపి యన్‌గా నిలిచి కుర్రాళ్లు సత్తా చాటారు. శుక్రవారం ముగిసిన అండర్–19 ఆసియా కప్‌లో భారత్ టైటిల్ చేజిక్కించుకుంది. ఫైనల్లో యువ భారత్ 9 వికెట్ల తేడాతో శ్రీలంక అండర్–19 జట్టును చిత్తు చేసింది. భారత అండర్–19 టీమ్ ఆసియా కప్‌ను గెలుచుకోవడం ఇది ఎనిమిదోసారి కావడం విశేషం. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 38 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 106 పరుగులే చేయగలిగింది. రోడ్రిగో (19 నాటౌట్)దే అత్యధిక స్కోరు. లంక స్కోరు 33 ఓవర్లకు 74/7 ఉన్నప్పుడు వర్షం కారణంగా ఆట ఆగిపోయింది. దాంతో మ్యాచ్‌ను 38 ఓవర్లకు కుదించారు. విరామం తర్వాత లంక తర్వాతి 5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి మరో 32 పరుగులు చేసింది. భారత బౌలర్లలో విక్కీ ఒస్వాల్ 11 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టగా, కౌశల్ తాంబేకు 2 వికెట్లు దక్కాయి. అనంతరం ‘డక్‌వర్త్ లూయిస్’ ప్రకారం భారత్ లక్ష్యాన్ని 32 ఓవర్లలో 102 పరుగులుగా నిర్దేశించారు. భారత్ 21.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 104 పరుగులు చేసింది. హర్నూర్ సింగ్ (5) ఆరంభంలోనే వెనుదిరిగినా... అంగ్రిష్ రఘువంశీ (67 బంతుల్లో 56 నాటౌట్; 7 ఫోర్లు), ఆంధ్ర క్రికెటర్ షేక్ రషీద్ (49 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు) కలిసి జట్టును గెలిపించారు. వీరిద్దరు రెండో వికెట్‌కు అభేద్యంగా 96 పరుగులు జోడించారు. జనవరి 14 నుంచి వెస్టిండీస్ వేదికగా అండర్–19 ప్రపంచకప్ జరుగుతుంది. జనవరి 15న తమ తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో గత ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత్ తలపడుతుంది. -
ఎస్జీఎస్ అండర్–19 బాస్కెట్‌బాల్ పోటీలు ప్రారంభం
రామచంద్రపురం : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–19 బాల బాలికల 62వ అంతర్ జిల్లాల బాస్కెట్‌బాల్ పోటీలు స్థానిక కృత్తి వెంటి పేర్రాజు పంతులు జాతీయ ఉన్నత పాఠశాలలో బుధవారం ప్రారంభమయ్యాయి. కృత్తివెంటి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల ఎం సూర్యమోహన్ అద్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇన్ఛార్జ్ చైర్మన్ మేడిశెట్టి సూర్యనారాయణ ఎస్జీఎస్ పతాకాన్ని ఆవిష్కరించి పోటీలు ప్రారంభించారు. జిల్లా వృత్తి విద్యాధికారిణి కె హెప్సీరాణి ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎస్జీఎఫ్–19 జిల్లా కార్యదర్శి వై.తాతబ్బాయి మాట్లాడుతూ ఈ పోటీలకు 12 జిల్లాల నుంచి బాలురు, 10 జిల్లాల నుంచి బాలికలు పాల్గొంటున్నారన్నారు. ఈనెల 30వరకు ఈ పోటీలు జరుగుతాయన్నారు. ఎస్జీఎఫ్ ఏపీ ప్రతినిధి, అబ్జర్వర్ వి సీతాపతిరావు మాట్లాడుతూ జనవరి 9 నుంచి జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ పోటీలు కృష్ణాజిల్లా నూజివీడులో జరుగుతున్నాయన్నారు. ఈ పోటీలో పాల్గొనే రాష్ట్ర జట్టు ఎంపిక రామచంద్రపురంలో జరుగుతుందన్నారు. రాష్ట్ర బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గన్నమని చక్రవర్తి, బాస్కెట్‌బాల్ సీనియర్ క్రీడాకారులు బాలకృష్ణారెడ్డి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల ముత్యాల సత్యనారాయణ, హెచ్ఎం జీ రాంప్రసాద్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కనకాల వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.