
ఆకట్టుకున్న పాట్ పెయింటింగ్స్
కాచిగూడ (హైదరాబాద్ సిటీ): బోనాల పండుగను పురస్కరించుకుని కాచిగూడలోని భారత్ మహిళా కళాశాలలో గురువారం విద్యార్థినులకు కుండలపైన పెయింటింగ్ పోటీలను నిర్వహించారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభా పాటవాలను పెయింటింగ్స్ రూపంలో ప్రదర్శించారు.
విద్యార్థినులకు చదువుతో పాటు ఇలాంటి పోటీలను నిర్వహించడం ద్వారా వారిలో అంతర్గతంగా దాగి ఉన్న సృజన్మాతకత బయటకు వస్తుందని ప్రిన్సిపాల్ ఎన్.వెంకటరమణ తెలిపారు. ఈ పోటీల్లో విజేతలైన విద్యార్థినులకు బహుమతులను ప్రధానం చేశారు. కార్యక్రమంలో కళాశాల హెచ్‌ఓడీ వి.వనిత, కె.రాధ, సి.స్వాతి పాల్గొన్నారు.