జాతీయస్థాయి తెలుగు పాటల పోటీలు
నరసరావుపేట ఈస్ట్ : మహాత్మా గాంధీ–పొట్టి శ్రీరాములు కళాసమితి, సేవా సింధూ సంస్థల ఆధ్వర్యంలో వేగాస్ ఫౌండేషన్ సౌజన్యంతో జాతీయస్థాయి తెలుగు పాటల పోటీలు ఆదివారం రాత్రి భువనచంద్ర టౌన్ హాల్‌లో నిర్వహించారు. ఈ పోటీలలో సీహెచ్ స్టాలిన్ (బాపట్ల), జి.హిమబిందు (అద్దంకి), రమణపాత్రో (పార్వతీపురం) బహుమతులు సాధించారు. అలాగే ప్రోత్సాహక బహుమతులను సీహెచ్ వెంకటేశ్వర్లు, ఎ.శ్రుతి, ఎం.మల్లిఖార్జునరావులకు అందించారు. ఎమ్మెల్యే డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎన్‌ఇసి విద్యా సంస్థల చైర్మన్ మిట్టపల్లి వెంకట కోటేశ్వరరావు, రాష్ట్ర బులియన్ మర్చంట్ అధ్యక్షులు కపిలవాయి విజయకుమార్, జిల్లా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ అ««దl్యక్షులు ఊరా భాస్కరరావు తదితరులు విజేతలకు బహుమతులు అందజేశారు. వాగిచర్ల వెంకటేశ్వరరావు, వై.త్యాగరాజు, షేక్ సలాం తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.