ఉభయ తెలుగు రాష్ట్రాల బిలియర్డ్స్ పోటీలు ప్రారంభం
రాజమహేంద్రవరం సిటీ : ఉభయ తెలుగు రాష్ట్రాల బిలియర్డ్స్ చాంపియన్ షిప్ పోటీలు రాజమండ్రి స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం ప్రారంభమయ్యాయి. పోటీలను నేషనల్ బిలియర్డ్స్ చాంపియన్ దేవగుప్తాపు సుబ్బారావు ప్రారంభించారు. టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ రాష్ట్ర అ«ధ్యక్షుడు, రాజమండ్రి స్పోర్ట్స్ క్లబ్ కార్యదర్శి వి.భాస్కరరామ్ మాట్లాడుతూ బిలియర్డ్స్ క్రీడ గతంలో ఉజ్వలంగా సాగిందన్నారు. ఎందరో అంతర్జాతీయ క్రీడాకారులు నగరంలో బిలియర్డ్స్ ఆడిన సందర్భాలున్నాయన్నారు. దేవగుప్తాపు సుబ్బారావు, న్యాపతి సుబ్బారావు ద్వయం బిలియర్డ్స్, స్నూకర్స్ పోటీల్లో నగరానికి ప్రపంచ గుర్తింపు తీసుకు వచ్చారన్నారు. మూడు రోజుల పాటు జరిగే పోటీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 28 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటున్నారు. కార్యక్రమంలో హెచ్‌బీవీ శర్మ, ఆకుల వీర్రాజు, చల్లా శంకరావు తదితరులు పాల్గొన్నారు.