రసవత్తరంగా క్యారమ్స్ పోటీలు
చిలకలూరిపేటటౌన్: పట్టణంలోని సీఆర్ క్లబ్‌లో రాష్ట్రస్థాయి సెకెండ్ ర్యాంకు క్యారమ్స్ పోటీలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. క్లబ్ స్థాపించి 75 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ పోటీలు శుక్రవారం రెండోరోజు కొనసాగాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్యారమ్ బోర్డు ప్లేయర్లు పోటీలలో పాల్గొంటున్నారు. పోటీలను పురుషులు, మహిళ విభాగాల్లో వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. శనివారం నుంచి సౌత్ ఇండియా స్థాయిలో పోటీలు ప్రారంభమై రెండు రోజుల పాటు కొనసాగుతాయని క్లబ్ కార్యదర్శి పావులూరి శ్రీనివాసరావు తెలిపారు.