ఇస్రో క్విజ్ పోటీలకు విశేష స్పందన
ఇస్రో క్విజ్ పోటీలకు విశేష స్పందన
Published Sun, Sep 18 2016 9:05 PM | Last Updated on Mon, Sep 4 2017 2:01 PM
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ఇస్రో ఆధ్వర్యంలో జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు నిర్వహించిన క్విజ్ పోటీలకు విశేష స్పందన లభించించినట్లు నిర్వాహకులు ఎంవీ రఘుకుమార్, రాఘవేంద్రరావు తెలిపారు. అక్టోబర్ ఆరు, ఏడు తేదీల్లో నిర్వహించే వరల్డ్ స్పేస్ వీక్‌ను పురస్కరించుకొని సెయింట్ జోసెప్ డిగ్రీ కళాశాలలో ఆదివారం స్పేస్ టెక్నాలజీ, ఆస్ట్రానీమ, సౌర వ్యవస్థపై 50 ప్రశ్నలతో కూడిన క్విజ్ పోటీలు నిర్వహించారు. పోటీలకు జిల్లావ్యాప్తంగా 70 పాఠశాలల నుంచి 204 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొదటి 25 స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ఆక్టోబర్ ఏడో తేదీన ఇస్రో స్పేస్ ఎక్సిబిషన్ ప్రారంభ వేడుకల్లో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేస్తామన్నారు. మిగతా విద్యార్థులందరికీ పార్టిసిఫేషన్ సర్టిఫికెట్లు అందిస్తామని తెలిపారు.
7, 8 తేదీల్లో స్పేస్ ఎక్సిబిషన్
ఇస్రో ఆధ్వర్యంలో ఆక్టోబర్ ఏడు, ఎనిమిది తేదీల్లో సెయింట్ జోసెప్ డిగ్రీ కళాశాలలో స్పేస్ ఎక్సిబిషన్ నిర్వహిస్తామని ఎంవీ రఘుకుమార్, రాఘవేంద్రరావు తెలిపారు. ఈ ఎక్సిబిషన్‌లో రాకెట్ మోడల్స్, అంతరిక్ష నౌకలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శిస్తామన్నారు.ఆక్టోబర్ ఆరో తేదీ ఉదయం 7 గంటలకు ఇస్రో ఆధ్వర్యంలో కొండారెడ్డి బురుజు నుంచి కలెక్టరేట్ వరకు స్పేస్ వాక్ నిర్వహిస్తామన్నారు.
Advertisement
Advertisement