ఈ అవకాశాన్ని పొందండి: ప్రధాని మోదీ | PM Modi Urges Followers To Attempt Quiz On Padma Awards | Sakshi
Sakshi News home page

‘పద్మ’ క్విజ్‌పై మోదీ ట్వీట్‌

Published Tue, Mar 10 2020 8:43 AM | Last Updated on Tue, Mar 10 2020 9:25 AM

PM Modi Urges Followers To Attempt Quiz On Padma Awards - Sakshi

న్యూఢిల్లీ: పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు అవకాశం కల్పించే క్విజ్‌ గురించి ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు. ఈ క్విజ్‌లోని ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వడం ద్వారా పద్మ అవార్డుల కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ‘వివిధ రంగాల్లో కృషి చేసే వ్యక్తులకు ఏటా ఇచ్చే పద్మ అవార్డ్స్‌ పదానోత్సవంలో పాల్గొనే అవకాశం కల్పించే క్విజ్‌ ఇది’ అంటూ మోదీ ట్వీట్‌ చేశారు. అందులో పాల్గొని అవకాశాన్ని పొందాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది దాదాపు 140 పద్మ అవార్డులను ఇవ్వనున్నారు. mygov.in వెబ్‌సైట్‌లో హిందీలో 20 ప్రశ్నలతో పొందుపరిచిన లింక్‌ను తన ట్వీట్‌కు ప్రధాని మోదీ జత చేశారు. ఆసక్తి ఉన్నవారు ఈ లింక్‌ క్లిక్‌ చేసి క్విజ్‌లో పాల్గొవచ్చు. (చదవండి: రాజకీయ పార్టీల ఎన్నికల ఖర్చుపైనా పరిమితి?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement