కూతురి కోసం చెవులు కుట్టించుకున్న హీరో
కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన సందడి చేశారు. గూంజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అన్షు గుప్తాకు మద్ధతుగా అభిషేక్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే సరదాగా సాగిన ఈ కార్యక్రమంలో అమితాబ్, అభిషేక్ లు కాసేపు తమ స్థానాలు మార్చుకోనున్నారు. అభిషేక్ బచ్చన్ వ్యాఖ్యతగా మారి ప్రశ్నలు సందిస్తుంటే బిగ్ బి హాట్ సీట్లో కూర్చోని సమాధానాలు ఇచ్చారు.
అంతేకాదు ఈ సందర్భంగా అభిషేక్ తన కూతురు ఆరాధ్యకు చెవులు కుట్టించే సమయంలో జరిగిన ఓ సంఘటన గురించి వెల్లడించారు. ఆరాధ్యకు చెవులు కుట్టించే సమయంలో అభిషేక్ ముందుగా తన చెవులు కుట్టించుకున్నారట. తన గారల పట్టికి ఎంత నొప్పి కలుగుతుందో తెలుసుకునేందుకు అభిషేక్ ఇలా చేశారట. ఈ విషయాన్ని అభిషేక్ స్వయంగా వెల్లడించారు. శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్ లో అన్షుతో కలిసి అభిషేక్ 25 లక్షల రూపాయలు గెలుచుకున్నారు.