
'కరోర్ పతి' తో సానుకూల ధృక్పథం: అమితాబ్ బచ్చన్
ముంబై:'కౌన్ బనేగా కరోర్ పతి' కార్యక్రమంతో భాగస్వామ్యం అయ్యే వారిలో మార్పు తథ్యమని బిగ్ బి అమితాబ్ బచ్చన్ స్పష్టం చేశారు. ఆ ప్రోగ్రామ్ తప్పకుండా భాగస్వాముల్లో విపరీతమైన సంతృప్తిని మోసుకువస్తుందన్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఆ కార్యక్రమం.. 'కరోర్ పతి-8' గా మరోమారు మన ముందుకు రానుంది. వచ్చే ఆగస్టు నెల నుంచి సోనీలో ప్రసారం కానున్న ఈ షోకు అమితాబ్ వ్యాఖ్యాతగా ప్రేక్షకులను అలరించనున్నారు.
ఇందుకు సంబంధించి మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ కార్యక్రమానికి చాలా మంది పరిపూర్ణమైన అభిలాషతో వస్తుంటారన్నారు. అలా రావడమే వారి జీవితాల్లో సానుకూల ధృక్పథాన్ని తీసుకొస్తుందన్నారు. ఆ కార్యక్రమం ఆరంభం నుంచి వ్యాఖ్యాతగా వ్యవహరించిన అమితాబ్.. 2007 లో మాత్రం బ్రేక్ తీసుకున్నారు. అప్పుడు కేబీసీ-3 కు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.