ముంబై: ఇటీవల తన ఎడమ కాలికి గాయమైందని బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ తెలిపారు. ఇనుప ముక్క కాలిపిక్కను చీల్చడంతో విపరీతంగా రక్తస్రావమైందని, కుట్లు కూడా పడ్డాయని ఆదివారం తన బ్లాగ్‌లో పేర్కొన్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ నడవొద్దని డాక్టర్లు గట్టి సలహా ఇచ్చినా గాయం కట్టుతోనే కౌన్ బనేగా కరోడ్‌పతి చిత్రీకరణలో పాల్గొన్నట్లు చెప్పారు. ఎడమ కాలి పిక్కకు బ్యాండేజీతో కౌన్ బనేగా కరోడ్‌పతి సెట్స్‌లో పరుగెత్తుతున్న ఫొటోలను శనివారం ఆయన పోస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment