left foot
-
అమితాబ్ బచ్చన్‌కు గాయం.. విపరీతమైన రక్తస్రావం.. కుట్లు
ముంబై: ఇటీవల తన ఎడమ కాలికి గాయమైందని బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ తెలిపారు. ఇనుప ముక్క కాలిపిక్కను చీల్చడంతో విపరీతంగా రక్తస్రావమైందని, కుట్లు కూడా పడ్డాయని ఆదివారం తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నడవొద్దని డాక్టర్లు గట్టి సలహా ఇచ్చినా గాయం కట్టుతోనే కౌన్ బనేగా కరోడ్‌పతి చిత్రీకరణలో పాల్గొన్నట్లు చెప్పారు. ఎడమ కాలి పిక్కకు బ్యాండేజీతో కౌన్ బనేగా కరోడ్‌పతి సెట్స్‌లో పరుగెత్తుతున్న ఫొటోలను శనివారం ఆయన పోస్ట్ చేశారు. -
తిరుమలలో విరిగిన శ్రీవారి పాదం బోటన వేలు
-
తిరుమలలో విరిగిన శ్రీవారి పాదం బోటన వేలు
తిరుమలలో ఆదివారం దుస్సంఘటన చోటు చేసుకుంది. శ్రీవారి మెట్టు మీదున్న ఉన్న శ్రీవారి పాదాల్లోని ఎడమ పాదం బోటన వేలు విరిగి పోడిపోయింది. ఆ విషయం గమనించిన భక్తులు వెంటనే శ్రీవారి పాదాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా శ్రీవారి పాదాల బోటనవేలు విరిగిపోవడంపై భక్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో పరిస్థితులు ఇప్పటికే అధ్వానంగా ఉన్నాయి. అంతేకాకుండా శ్రీవారి పాదల బోటన వేలు విరగడం ఏదో ఓ ఉపద్రవం జరిగే సూచనలు ఉన్నాయని భక్తులు భయపడుతున్నారు. అయితే శ్రీవారి పాదాల బోటన వేలు విరిగిన టీటీడీ అధికారులు అసలు ఆ వైపే రాకపోవడంపై భక్తులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.