
John Abraham Cries In front Of Amitabh Bachchan: బాలీవుడ్ హీరో, కండల వీరుడు జాన్ అబ్రహం రియాలిటీ షో వేదికపై ఒక్కసారిగా కన్నీటి పర్యంతరమయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ షోకు అతిగా జాన్ అబ్రహం వచ్చాడు. ప్రస్తుతం 13వ సీజన్‌ను జరుపుకుంటోన్న ఈ షో ది. ‘సత్యమేవ జయతే 2’ హీరోహీరోయిన్ అయిన జాన్ అబ్రహాం, దివ్యా ఖోస్లా కుమార్ సందడి చేశారు.
చదవండి: Priyanak Chopra-Nick Jonas: తమ విడాకుల రూమార్లపై స్పందించిన ప్రియాంక-నిక్ జోనస్
ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ ప్రోమోను సోనీ టీవీ తాజాగా విడుదల చేసింది. ఇందులో జాన్ అబ్రహాం తనదైన శైలిలో హాట్ సీట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. తన సిక్స్ ప్యాక్‌ను ప్రదర్శించాడు. దీంతో అక్కడున్న అభిమానులు ఒక్కసారిగా కేకలతో హోరెత్తించారు. ఆ వెంటనే బిగ్‌బి అంతా అమ్మాయిలే కేకలేస్తున్నారంటూ చమత్కిరించారు. హాట్ సీట్‌పై కూర్చున్న జాన అబ్రహం ‘ధూమ్’ సినిమా తర్వాత ఓసారి తాను అమితాబ్ ఇంటికి వెళ్లిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు.
చదవండి: ప్రియాంక వీడియోపై సమంత కామెంట్, దీని అంతర్యం ఏంటి సామ్?
‘‘నేను బైక్‌పై మీ ఇంటికి అభిషేక్‌ను మాత్రం ఈ విషయంలో ప్రోత్సహించవద్దంటూ మీరు నాకు చెప్పారు.. గుర్తుందా!’’ అంటూ చెప్పాడు. అయితే అభిషేక్ కిందకురాగానే ‘వావ్.. బైక్ చాలా బాగుంది’ అంటూ మీరు మాట మార్చేశారని జాన్ అనడంతో బిగ్‌బి గట్టిగా నవ్వేశారు. ఇక ఏమైందో తన వ్యక్తిగత విషయం చెబుతూ జాన్ భావోద్వేగానికి లోనైనట్లు తెలుస్తోంది. ప్రోమో ఎండింగ్‌లో జాన్ ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యాడు. మరి, అతడి దు:ఖానికి కారణమేంటో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment